Hyper Aadi Bald Head : హైపర్ ఆదికి ఘోర అవమానం?.. గుండు కొట్టించి పంపించారుగా!

Hyper Aadi Bald Head హైపర్ ఆదికి తాజాగా గుండు కొట్టించినట్టు తెలుస్తోంది. శ్రీదేవీ డ్రామా కంపెనీ ప్రోమోను కాస్త టీఆర్పీ రేటింగ్  యాంగిల్‌లో కట్ చేశాడు. ఎప్పటిలానే స్ట్రాటజీలు వర్కవుట్ చేశాడు. ఈ సారి మాత్రం ఆది గుండు మీద ప్లాన్ వేశారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 28, 2022, 05:57 PM IST
  • స్టేజ్ మీద హైపర్ ఆదికి అవమానం?
  • గుండు కొట్టించిన శ్రీదేవీ డ్రామా కంపెనీ టీం
  • ఇదంతా టీఆర్పీ స్ట్రాటజీ అంటూ ట్రోల్స్
Hyper Aadi Bald Head : హైపర్ ఆదికి ఘోర అవమానం?.. గుండు కొట్టించి పంపించారుగా!

Hyper Aadi Bald Head  హైపర్ ఆదికి బుల్లితెరపై ఉన్న క్రేజ్, ఫాలోయింగ్ అందరికీ తెలిసిందే. ఆది ఉంటే ఆ షో హిట్టే అన్నట్టుగా మారిపోయింది. ఆది రైటింగ్, యాక్టింగ్ అన్నీ కూడా జనాలకు తెగ నచ్చేస్తుంటుంది. అయితే ఆదికి బుల్లితెరపై మంచి డిమాండ్ ఉంటుంది. కానీ వెండితెరపై మాత్రం ఆది పంచ్‌లు అంతగా వర్కౌట్ అవ్వవనిపిస్తోంది. ఆది నటించిన ఏ సినిమాలోనూ ఆయన పంచ్‌లు అంతగా పేలలేదు.

బుల్లితెరపై మాత్రం ఆదికి తిరుగుండదు. ఆది పంచ్‌లు వేస్తే అవతలి వాళ్లు నోరెళ్లబెట్టాల్సిందే. ఆది ప్రస్తుతం జబర్దస్త్, శ్రీదేవీ డ్రామా కంపెనీ, ఢీ షోలు అంటూ ఇలా ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈటీవీ, మల్లెమాల షోలతో ఆది తెగ బిజీగా ఉన్నాడు. మధ్యలో కొన్ని రోజులు జబర్దస్త్ షోకు దూరంగా ఉన్నాడు. ఇక మొత్తానికి మల్లెమాల నుంచి బయటకు వస్తాడనే టాక్ కూడా స్ప్రెడ్ అయింది. కానీ మళ్లీ ఆది జబర్దస్త్ షోలోకి వచ్చేశాడు.

యథాతథంగా మూడు షోలు చేసుకుంటూ ఫుల్ బిజీగా ఉన్నాడు ఆది. తాజాగా శ్రీదేవీ డ్రామా కంపెనీ ప్రోమోను వదిలారు. ఇందులో ఆదికి అవమానం జరిగినట్టుగా ప్రోమోను కట్ చేశారు. జబర్దస్త్ అయినా శ్రీదేవీ డ్రామా కంపెనీ అయినా కూడా ఆదికి ఎదురు ఉండదు. అలాంటి ఆదికి ఇలా గుండు కొట్టించారంటే ఎవ్వరూ నమ్మరు. కానీ నమ్మేట్టుగా ప్రోమోను కట్ చేసింది మల్లెమాల టీం.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News