Casting Couch: స్టార్ ప్రొడ్యూసర్ పై బిగ్ బాస్ బ్యూటీ సంచలన వ్యాఖ్యలు.. ఫామ్ హౌస్ కి వస్తే 30 లక్షలు

Tollywood casting couch:తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న బిగ్ బాస్ సీజన్ 8 మరో వారంలో పూర్తి కాబోతోంది. ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ సీజన్ 8 లో కంటెస్టెంట్ గా పాల్గొని హౌస్ లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని , తన ఆటతీరుతో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న కిర్రాక్ సీత. అనుకోకుండా ఐదు వారాలకే ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే.   

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Dec 7, 2024, 07:29 PM IST
Casting Couch: స్టార్ ప్రొడ్యూసర్ పై బిగ్ బాస్ బ్యూటీ సంచలన వ్యాఖ్యలు.. ఫామ్ హౌస్ కి వస్తే 30 లక్షలు

Actress on casting couch: 
యూట్యూబ్లో సెవెన్ ఆర్ట్స్ అనే ఛానల్ ద్వారా సరయుతో కలిసి ఆడియన్స్ కి మంచి బోల్డ్ కంటెంట్ అందించిన కిర్రాక్ సీతా గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ముఖ్యంగా యూట్యూబ్లో పలు వీడియోలు చేస్తూ భారీ పాపులారిటీ అందుకున్న ఈ ముద్దుగుమ్మ, సాయి రాజేష్ దర్శకత్వంలో వచ్చిన బేబీ సినిమాలో నటించినది. 

రౌడీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమాలో హీరోయిన్ గా వైష్ణవి చైతన్య నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ లో నటించి చాలా అద్భుతంగా ప్రేక్షకులను అలరించింది. ఒక్క సినిమాతో లైమ్ లైట్ లోకి వచ్చిన కిర్రాక్ సీత అదే క్రేజ్ తో బిగ్ బాస్ సీజన్ 8లోకి అడుగు పెట్టింది. 

బిగ్ బాస్ హౌస్లో కూడా దాదాపు 5 వారాలపాటు కొనసాగింది. అందులో మెగా చీఫ్ కూడా అయింది. తన వ్యక్తిత్వంతో హౌస్ మేట్స్ మనసులు గెలుచుకున్న ఈమె ఇటు ఆడియన్స్ ని కూడా మెప్పించింది. ఇకపోతే టాప్ ఫైవ్ వరకు వెళ్తుంది అనుకున్న కిర్రాక్ సీత అనుకోకుండా ఎలిమినేట్ అయింది. 

ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి తెలిపింది. కిర్రాక్ సీతా మాట్లాడుతూ.. నేను సినిమా అవకాశాల కోసం ప్రయత్నం చేస్తున్న సమయంలో అనుకోకుండా ఒక సినిమాలో అవకాశం వచ్చింది. అయితే మొదటి సినిమాకే నాకు.. రూ.30 లక్షలు రెమ్యునరేషన్ ఇస్తామన్నారు. కానీ నిర్మాతలు దర్శకుడితో కలిసి వెకేషన్స్ కి వెళ్లాలని, ఫారెన్ ట్రిప్ వెళ్లాలని చెప్పారు. అలానే మ..ఫార్మ్ హౌస్ కి వస్తే 30 లక్షలు ఇస్తామని ఆఫర్ చేశారని వ్యాఖ్యలు చేసింది.

ఏమాత్రం గుర్తింపు లేదు మొదటి సినిమాకే అంత రెమ్యునరేషన్ అనేసరికి నాకు అనుమానం వచ్చింది. దాంతో సున్నితంగా రిజెక్ట్ చేశాను అంటూ ఇండస్ట్రీలో తాను ఎదుర్కొన్న క్యాస్టింగ్ కౌచ్ గురించి తెలిపింది కిర్రాక్ సీత. ఇక ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Read more: Allu Arjun: మీకు సిగ్గు, శరం ఉందా..?.. అల్లు అర్జున్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన జనసేన అడ్వకేట్ ..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook 

Trending News