Lucky Lakshman Trailer : ల‌క్కీ ల‌క్ష్మ‌ణ్‌ ట్రైల‌ర్‌.. మాస్‌కు ఫుల్ మీల్స్ పెట్టనున్న బిగ్ బాస్ సోహెల్

Lucky Lakshman Trailer లక్కీ లక్ష్మణ్ ట్రైలర్‌ను నిన్న చిత్రయూనిట్ విడుదల చేసింది. ఇక ఇందులో సోహెల్ కామెడీ, ఎమోషనల్ పాత్రలో కనిపించాడు. బిగ్ బాస్ ఇంట్లో సోహెల్ చేసిన సందడి ఇప్పుడు వెండితెరపైనా కనిపించబోతోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 25, 2022, 03:52 PM IST
  • లక్కీ లక్ష్మణ్‌తో హీరోగా సోహెల్
  • లక్కీ లక్ష్మణ్ ట్రైలర్ వైరల్
  • నవ్వించిన బిగ్ బాస్ సోహెల్
Lucky Lakshman Trailer : ల‌క్కీ ల‌క్ష్మ‌ణ్‌ ట్రైల‌ర్‌.. మాస్‌కు ఫుల్ మీల్స్ పెట్టనున్న బిగ్ బాస్ సోహెల్

Sohel Lucky Lakshman Trailer బిగ్ బాస్ షోతో ఫేమస్ అయిన సోహైల్‌ ఇప్పుడు హీరోగా పరిచయం కాబోతోన్నాడు. మోక్ష హీరోయిన్‌గా సోహెల్ హీరోగా వస్తోన్న చిత్రం ‘లక్కీ లక్ష్మ‌ణ్’. హ‌రిత  గోగినేని ఈ సినిమానుద‌త్తాత్రేయ మీడియా గ్యారంటీడ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ బ్యాన‌ర్‌పై నిర్మిస్తుండగా.. ఎ.ఆర్‌.అభి దర్శ‌క‌త్వంలో ఈ చిత్రం రాబోతోంది.  ఈ మూవీ డిసెంబర్ 30న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈక్రమంలో ‘ల‌క్కీ ల‌క్ష్మ‌ణ్‌’ ట్రైలర్‌ను శ‌నివారం విడుద‌ల చేశారు. 

ఈ ట్రైలర్‌లో సోహెల్ అదరగొట్టేశాడు. డబ్బు చుట్టూ తిరిగే పాత్రలో సోహెల్ కనిపించాడు. డబ్బు సంపాదించాలనే ఆలోచనలో తల్లిదండ్రులను కూడా పట్టించుకోవడం లేదు. ఇక ప్రేమించిన అమ్మాయిని సైతం బాధపెట్టినట్టు కనిపిస్తోంది. మొత్తానికి ఈ ట్రైలర్ చూస్తుంటే ఎంటర్టైన్మెంట్‌తో పాటుగా సందేశం కూడా ఇచ్చినట్టు అనిపిస్తోంది. ఈ ట్రైలర్‌లో సోహెల్ ఎనర్జీ మాత్రం కనిపిస్తోంది. సోహెల్ సత్తాను డిసెంబ‌ర్ 30న చూడాల్సిందే. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News