BiggBoss Telugu5: అదిరిపోయిన బిగ్‌బాస్‌ నవరాత్రి స్పెషల్‌ ఎపిసోడ్‌

BiggBossTelugu5 Navratri Special Episode: హైపర్‌ ఆది, హెబ్బా పటేల్‌, (Hebah Patel) సింగర్‌ మంగ్లీ ..తదితర తారలు స్పెషల్‌ ఫెర్ఫ్మామెన్స్‌లతో అదరగొట్టారు. అఖిల్‌, (Akhil ) పూజాహెగ్డే (Pooja Hegde) జంటగా నటించిన చిత్రం ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’ (Most Eligible Bachelor) ప్రమోషన్స్‌లో భాగంగా వీరిద్దరూ బిగ్‌బాస్‌ స్టేజ్‌పై మెరిశారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 10, 2021, 07:48 PM IST
  • బిగ్‌బాస్‌ వీకెండ్ ఎపిసోడ్ అదిరిపోయింది
  • ఆటపాటలతో వేడుకగా సాగిన నవరాత్రి స్పెషల్‌ ఎపిసోడ్‌
  • పంచులతో హౌస్‌మేట్స్‌ను రోస్ట్‌ చేసిన హైపర్‌ ఆది
  • వీడియోలు చూసి ఏడ్చేసిన హౌజ్‌మేట్స్
  • లెహరాయి పాటకు అఖిల్‌, పూజాహెగ్డే స్టెప్పులు
  • పూజాతో అఖిల్‌ రొమాన్స్
BiggBoss Telugu5: అదిరిపోయిన బిగ్‌బాస్‌ నవరాత్రి స్పెషల్‌ ఎపిసోడ్‌

BiggBossTelugu5 dussehra special full episode highlights: 
ఈ సారి బిగ్‌బాస్‌ వీకెండ్ ఎపిసోడ్ అదిరిపోయింది. ఆటపాటలతో వేడుకగా సాగింది. నవరాత్రి స్పెషల్‌ ఎపిసోడ్‌ (Navratri Special Episode) సూపర్బ్‌గా నడిచింది. పండుగను బిగ్‌హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లు అక్కడున్నవాళ్లతోనే జరుపుకోవాలి తప్ప వారివారి ఫ్యామిలీమెంబర్స్‌ను కలవడానికి.. చూసుకోవడానికి అవకాశం లేదు. అయితే బిగ్‌బాస్‌ హౌజ్‌మేట్స్ కు వారి ఫ్యామిలీ మెంబర్స్‌ మాట్లాడిన వీడియోలు చూపించి హౌస్‌మేట్స్‌ను (Housemates) సర్‌ప్రైజ్‌ చేశారు ఈవారం. కంటెస్టెంట్లు (Contestants) ఫ్యామిలీ మెంబర్స్ మాటలు వినగానే ఎమోషనల్‌ అయ్యారు. సంతోషంతో కన్నీళ్లు పెట్టుకున్నారు.

హైపర్‌ ఆది పంచులు

నవరాత్రి స్పెషల్‌ ఎపిసోడ్‌లో భాగంగా స్పెషల్‌ గెస్ట్‌గా హైపర్‌ ఆది (Hyper Adi) వచ్చారు. ఎప్పటిలాగే తన పంచులతో హౌస్‌మేట్స్‌ను రోస్ట్‌ చేస్తూ నవ్వించాడు. శ్వేతతో పులిహోర కలపడం వచ్చుగానీ చపాతీ పిండి కలపడం రాదా? అంటూ సెటైర్‌ వేశాడు ఆది. ఇదేంటీ నేను బిగ్‌బాస్ టైటిల్‌ వెంట పడుతుంటే పింకీ నా వెంట పడుతుంది అని అనిపిస్తోందా అంటూ మానస్‌ను (Manas‌) గుచ్చిగుచ్చి అడిగాడు. కాజల్‌ను నిద్రలో నుంచి లేపి నీ పేరేంటి అని అడిగితే స్ట్రాటజీ అంటుందంటూ కాజల్‌పై ఆది వేసిన పంచ్‌కు అందరూ నవ్వారు. ఆటలు, పాటలు, కన్నీళ్ల కలుయిక సాగింది నేటి బిగ్‌బాస్‌ ఎపిసోడ్‌.

Also Read :  Breaking news: 'మా' ఎన్నికల్లో తొలి ఫలితం..బోణీ కొట్టిన ప్రకాశ్ రాజ్ ప్యానెల్

వీడియోలు చూసి ఏడ్చేసిన హౌజ్‌మేట్స్

ఇక హౌజ్‌లో మగాళ్లందరూ బంగార్రాజులాగా, ఆడాళ్లందరూ సత్యభామల్లా ఉన్నారంటూ కంటెస్టెంట్ల మీద పొగడ్తల వర్షం కురిపించాడు నాగ్‌. నవరాత్రి సందర్భంగా 9 గేమ్స్‌, 9 అవార్డుల పంపిణీ జరిగింది. ఇందులో భాగంగా ఏ.. టీమ్‌లో రవి, (Ravi) హమీదా, (Hamida) శ్వేత, సన్నీ, షణ్ముఖ్‌, ప్రియాంక, లోబో, యానీ ఉండగా మిగిలినవారు బీ టీమ్‌లో ఉన్నారు. మొదటగా వీరిద్దరికీ మధ్య రింగ్‌ ఫైట్‌ పెట్టారు. ఇందులో సన్నీ, సిరి గెలవడంతో వారికి ఫ్యామిలీ వీడియో చూపించారు. లోబో (Lobo) తన కూతురు మాట్లాడిన వీడియో చూసి వెక్కివెక్కి ఏడ్చాడు. తర్వాత జెస్సీ తల్లి అతడికి ధైర్యం చెప్తున్న వీడియో ఆకట్టుకుంది. అనంతరం రెండు టీమ్‌లు చెరో స్కిట్‌తో మంచి సందేశాన్ని అందించే ప్రయత్నం చేశాయి. ఇక ఈ గేమ్‌లో రవి (Ravi) టీమ్‌ గెలుపొందింది. ఇందులో అతడు మరోసారి పాలపిట్ట అవార్డు అందుకున్నాడు. ఈ సందర్భంగా రవి టీమ్‌లోని యానీ మాస్టర్‌కు ఆమె తల్లి మాట్లాడిన వీడియో చూపించారు. ఇలా పోటీలు పెట్టడం.. వీడియోలు చూపించడం.. అవార్డులు ఇవ్వడంలాంటి అంశాలతో బిగ్‌బాస్‌ సరదసరదాగా సాగింది.

 

Also Read : MAA Elections 2021 : వాటమ్మా.. వాటీజ్ దిస్ అమ్మా అంటూ విష్ణు, ప్రకాశ్‌రాజ్‌లపై మంచు మనోజ్‌ సెటైర్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News