Arjun Kapoor Disaster movie: ప్రతి శుక్రవారం ప్రతిభాషలో.. బోలెడు సినిమాలు విడుదల అవుతూ ఉంటాయి. కొన్ని సినిమాలు సూపర్ హిట్ అయ్యి కాసుల వర్షం కురిపిస్తాయి.. మరికొన్ని సినిమాలు మాత్రం బడ్జెట్ కాదు కదా కనీసం ఒక యాక్టర్ కి ఇచ్చారు రెమ్యూనరేషన్ అంత కూడా వసూళ్లు చేయలేక పోతాయి. సినిమా ఇండస్ట్రీ అంటేనే హిట్ ఫ్లాప్ రెండు ఉంటాయి. అందరూ రాజమౌళి లాగా 100% సక్సెస్ రేట్ తో సినిమాలు తీయలేరు.
అయితే భారతదేశంలో ఇప్పటిదాకా అతిపెద్ద డిజాస్టర్ అయిన సినిమా ఏది అని ఎప్పుడైనా ఆలోచించారా? ఇప్పటిదాకా విడుదలైన ఎన్నో సినిమాలలో ఒక సినిమా భారీ స్థాయిలో డిజాస్టర్ అయింది. ఇండియాలోనే కాదు భారతదేశంలో కూడా ఇంతకు మించిన డిజాస్టర్ ఆయన సినిమా మరొకటి ఉండదేమో. ఈ సినిమాని 45 కోట్లు పెట్టి మరి నిర్మించారు.. కానీ విడుదల అయ్యాక ఈ సినిమా వసూళ్లు చేసింది కేవలం 45 వేలు మాత్రమే.
చిన్న బడ్జెట్ అయినా పెద్ద బడ్జెట్ అయినా.. సినిమా విడుదల అవుతుంది అంటే ప్రమోషన్స్ చాలా ముఖ్యం. ఎంత భారీగా ప్రమోషన్స్ చేస్తున్న కూడా చాలామంది ప్రేక్షకులకు సినిమా ఎప్పుడు విడుదలవుతుందో తెలియదు. ఇక ప్రమోషన్స్ లేకపోతే.. అసలు అలాంటి సినిమా ఒకటి ఉంది అని కూడా చాలామందికి తెలియకపోవచ్చు. అలా ఏమాత్రం ప్రమోషన్స్ లేకుండా విడుదలైన సినిమా ది లేడీ కిల్లర్. 2023 నవంబర్ మూడవ తేదీన.. ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమాలో అర్జున్ కపూర్, భూమి పెడ్నేకర్ వంటి పేరున్న యాక్టర్ లు హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా షూటింగ్ చాలా కాలం ముందు ప్రారంభించారు. కానీ బడ్జెట్ పెరిగిపోతూ ఉండడంతో షూటింగ్ మొత్తం పూర్త అవ్వకుండానే నిర్మాతలు సినిమాని విడుదల చేసేసారు.
ఇక ఈ సినిమా డిజాస్టర్ లకే డిజాస్టర్ గా మారి రికార్డు సృష్టించింది. భారతీయ చిత్ర పరిశ్రమలో ఈ సినిమాకి మించిన ఫ్లాప్ సినిమా మరిది లేదు అంటే నమ్మగలరా.. ఇక భవిష్యత్తులో కూడా ఇంత డిజాస్టర్ అయ్యే సినిమా రాదేమో. దేశం మొత్తం మీద ఈ సినిమాకి 12 షోలు పడ్డాయి. మొదటిరోజు 293 టికెట్లు అమ్ముడు అయ్యాయి. అక్కడే 38000 వచ్చేసాయి. ఇక ఫైనల్ రన్ పూర్తయ్యేసరికి 45000 చేతిలో పడ్డాయి.
మరోవైపు ఈ సినిమా డిజిటల్ రైట్స్ నెట్ఫ్లిక్స్ వారు కొనుగోలు చేశారు. కానీ వాళ్లు ఇంకా సినిమాని విడుదల చేయడం లేదు. మరోవైపు అర్జున్ కపూర్, భూమి పెడ్నేకర్లు కూడా సినిమాని ప్రమోట్ చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేశారు. అలా ఈ సినిమా మళ్లీ వెలుగులోకి రాలేదు.
Also Read: No Selfies: తెలంగాణ ప్రభుత్వం హెచ్చరిక! జలాశయాల వద్ద సెల్ఫీలు.. ఫొటోలు వద్దు
Also Read: Narendra Modi: తెలంగాణలో వరదలపై ప్రధాని మోదీ ఆరా.. అండగా ఉంటామని భరోసా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter