Chay-Sam: మళ్లీ జతకట్టనున్న సమంత - నాగ చైతన్య..? ఎంతవరకు నిజం..??

నాగ చైతన్య - సమంత విడాకుల తరువాత ఇద్దరు వారి వారి పనుల్లో బిజీగా మారిపోయారు. అయితే ప్రస్తుతం ఒక వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. నందిని రెడ్డి దర్శకత్వం వచిస్తున్న సినిమాలో నాగ చైతన్య - సమంత మరోసారి జతకట్టబోతున్నారని వార్త వైరల్ అవుతుంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 6, 2022, 09:34 AM IST
  • ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్న సామ్-చైతుల వార్త
  • ఇద్దరు కలిసి నటించబోతున్నారని హల్ చల్ చేస్తున్న వార్త
  • నందినిరెడ్డి దర్శకత్వం వచించబోతుందని టాక్
Chay-Sam: మళ్లీ జతకట్టనున్న సమంత - నాగ చైతన్య..? ఎంతవరకు నిజం..??

Chay-Sam: 'జబర్దస్త్' అనే సినిమాతో డైరెక్టర్ నందినిరెడ్డితో కలిసి సమంత మొదటిసారి పనిచేసింది. ఆ మూవీ రిజల్ట్ సంగతి పక్కనపెడితే.. డైరెక్టర్ నందిని రెడ్డి, సామ్ మంచి ఫ్రెండ్స్ అయ్యారు. ఆ తర్వాత 'ఓ బేబీ' సినిమాతో మళ్ళీ జత కలిశారు. ఈ కాంబో సూపర్ హిట్టైంది. దీని తర్వాత డైరెక్టర్ నందిని రెడ్డి..సామ్‌తో కలిసి మరో మూవీ చేయాలనుకుంది. కానీ అది సాధ్యం కాలేదు. ఆ తర్వాత సమంత మూవీల పరంగా బిజీ కావడం.. అక్కినేని నాగచైతన్యతో విడిపోవడం జరిగాయి. 

అయినప్పటికి డైరెక్టర్ నందినిరెడ్డి, సమంతల మధ్య ఫ్రెండ్ షిప్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆ ఫ్రెండ్ షిప్‌తోనే డైరెక్టర్ నందిని రెడ్డి.. నాగ చైతన్యను, సమంతను మళ్లీ కలపాలని ప్రయత్నిస్తోందని ఫిలిం నగర్ టాక్. కలపడం అంటే.. నిజజీవితంలో కాదండోయ్.. ఓ మూవీతో.. దీని కోసం డైరెక్టర్ నందిని రెడ్డి విశ్వప్రయత్నం చేస్తున్నారని టాలీవుడ్ టాక్. 

త్వరలో డైరెక్టర్ నందిని రెడ్డి, నాగచైతన్య  హీరోగా ఓ సినిమా తెరకెక్కించే ప్రయత్నంలో ఉన్నారు. ఆ స్టోరి నాగ చైతన్యకి బాగా నచ్చడంతో అతడు మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్. అయితే డైరెక్టర్ నందిని కొత్త మూవీలో హీరోయిన్‌గా పలువురు హీరోయిన్స్‌ను సెలెక్ట్ చేసినప్పటికీ ఎవరూ సెట్ కాలేదు. దీంతో నాగ చైతన్య సరసన సామ్‌నే హీరోయిన్‌గా ఎంపిక చేస్తే బాగుంటుందని నందినిరెడ్డి భావిస్తున్నారు. 

ఒకవేళ నందిని రెడ్డి ప్రయత్నం సక్సెస్‌ అయ్యి ఇద్దరూ కలిసి మూవీ చేస్తే ఫ్యాన్స్‌కు పండగని వేరే చెప్పాలా? ఆటోనగర్ సూర్య, మనం.. ఏమాయ చేశావె లాంటి సినిమాల్లో పెళ్లికాక ముందు నటించిన నాగ చైతన్య, సమంత.. పెళ్లి అయ్యాకా తొలిసారిగా 'మజిల'లో కలిసి నటించారు. డైరెక్టర్ నందిని‌రెడ్డి మూవీ కానీ కార్యరూపం దాల్చితే.. విడిపోయిన తర్వాత వారిద్దరూ కలిసి నటించిన సినిమాగా ఇది నిలిచిపోతుంది. మరి డైరెక్టర్ నందినిరెడ్డి ప్రయత్నం ఎంతవరకూ సక్సెస్ అవుతుందో మనం వేచి చూడాలి.

Also Read: Lakshmipati Arrest: ఎట్టకేలకు పోలీసులకు చిక్కిన లక్ష్మీపతి.. తొలి డ్రగ్స్ మరణం కేసులో కీలక నిందితుడు...

Also Read: Viral News: లాగుడు బండిలో ఆసుపత్రికి.. అంబులెన్స్ లేక 5 గంటలు ఆలస్యం.. మహిళ మృతి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News