Chiru Vs Balayya : మాఫియా వర్సెస్ ఫ్యాక్షన్.. సంక్రాంతి బరిలో గెలిచేదెవరు?

Waltair Veeraya vs Veera Simha Reddy చిరంజీవి వాల్తేరు వీరయ్య, బాలయ్య వీర సింహారెడ్డి సినిమాలు సంక్రాంతి బరిలోకి దిగేందుకు సిద్దంగా ఉన్నాయి. ప్రమోషన్స్ కూడా చివరి దశకు చేరుకున్నాయి. అయితే ఇప్పుడు ఈ సినిమా కథల మీద అందరికీ ఓ ఐడియా వచ్చింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 8, 2023, 07:36 AM IST
  • రసవత్తరంగా మారనున్న సంక్రాంతి పోటీ
  • ఫ్యాక్షన్‌ కథతో బాలయ్య, మాఫియా కథతో చిరు
  • బాలయ్య నెగ్గేనా? చిరు గెలిచేనా?
Chiru Vs Balayya : మాఫియా వర్సెస్ ఫ్యాక్షన్.. సంక్రాంతి బరిలో గెలిచేదెవరు?

Waltair Veeraya vs Veera Simha Reddy ఈ సంక్రాంతికి పోటీ చాలా గట్టిగానే ఉంది. తమిళ హీరోలైన విజయ్, అజిత్ సినిమాలు కూడా బరిలోకి దిగుతున్నాయి. అజిత్ తెగింపు, విజయ్ వారసుడు  సినిమాలు ముందు రాబోతోన్నాయి. బాలయ్య వీర సింహా రెడ్డి సినిమా జనవరి 12న రాబోతోంది. ఆ తరువాత చిరంజీవి వాల్తేరు వీరయ్య 13న సందడి చేయనుంది. తెగింపు కథ కాస్త కొత్తగానే అనిసిస్తోంది. వారసుడు మరీ రొటీన్ తెలుగు సినిమా ఫార్మూలాతో రాబోతోన్నట్టుగా కనిపిస్తోంది. వీటి టాక్ ఎలా ఉంటుందో.. కలెక్షన్లు ఎలా ఉంటాయో ఇప్పుడే చెప్పలేం.

బాలయ్య ఫ్యాక్షన్ కథలకు మాత్రం ఎప్పుడూ డిమాండ్ అండ్ క్రేజ్ ఉంటుంది. బాలయ్యకు కెరీర్ హిట్లు పడ్డవి కూడా ఫ్యాక్షన్ కథలే. సమర సింహా రెడ్డి, నరసింహా నాయుడు, సింహా, లెజెండ్ వంటి బ్లాక్ బస్టర్‌ హిట్లను ఆ జానర్‌లోనే కొట్టేశాడు. ఇప్పుడు మరోసారి వీర సింహా రెడ్డి అంటూ రాబోతోన్నాడు. అయితే ఇప్పుడు ఫ్యాక్షన్ కథలు ఎలా క్లిక్ అవుతాయి.. పాత రొటీన్ ఫార్మూలాను ఇప్పుడు గోపీచంద్ ఎలా మలిచాడు? అనేది కాస్త ఆసక్తికరంగా మారింది.

మరి బాలయ్య అయితే వీర సింహా రెడ్డి సినిమాలో డైలాగ్స్ మీద డైలాగ్స్ కొట్టేశాడు. ఏపీ ప్రభుత్వం మీద కౌంటర్లు వేశాడు. సీఎం జగన్‌ చర్యల మీద సెటైర్లు వేశాడు. ట్రైలర్‌ మాత్రం గట్టిగానే ఇంపాక్ట్ చూపించినట్టుంది. ఇక చిరంజీవి, రవితేజలు వాల్తేరు వీరయ్యలో కుమ్మేశాడు. ట్రైలర్‌ మొత్తంలో రవితేజ, చిరంజీవిలు వారి వారి ఐకానిక్ డైలాగ్స్‌ను మార్చుకుని చెప్పడం హైలెట్‌గా నిలిచింది.

వాల్తేరు వీరయ్య మాఫియా బ్యాక్ గ్రౌండ్ అని అర్థమవుతోంది. మరి వీటిలో ఏ సినిమా నిలుస్తుంది? బాక్సాఫీస్ వద్ద ఏ సినిమా కనకవర్షం కురిపిస్తుంది? అన్నది చూడాలి. ఈ రెండు చిత్రాలకు నిర్మాత మైత్రీ, హీరోయిన్ శ్రుతి హాసన్ ఒక్కరే అవడం విశేషం. ఈ రెండింటిలో ఏ ఒక్కటి క్లిక్ అయినా కూడా నిర్మాతలకు మాత్రం పండుగే.

Also Read: Thala Ajith Family : అజిత్ ఫ్యామిలీ ఫోటోలు.. ఆయన కూతురు ఎలా ఉందో చూశారా?

Also Read: Roja Satires on Mega Family : ఏ ఒక్కరికీ సాయం చేయలేదట.. అందుకే ముగ్గుర్నీ ఓడించారట.. మంత్రి రోజా సంచలన కామెంట్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News