Waltair Veerayya Trailer అప్డేట్..ప్రీ రిలీజ్ ఈవెంట్‌ కోసం భారీ ప్లానింగ్ 

Waltair Veerayya Trailer చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా ట్రైలర్, ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సంబంధించిన అప్డేట్లు వచ్చాయి. రేపు ట్రైలర్‌ను రిలీజ్ చేసి.. ఎల్లుండి అంటే ఆదివారం నాడు విశాఖలో గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించబోతోన్నారట.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 6, 2023, 12:43 PM IST
  • సంక్రాంతి బరిలో వాల్తేరు వీరయ్య
  • రేపు వాల్తేరు వీరయ్య ట్రైలర్
  • ఆదివారం నాడు విశాఖలో ఈవెంట్
Waltair Veerayya Trailer అప్డేట్..ప్రీ రిలీజ్ ఈవెంట్‌ కోసం భారీ ప్లానింగ్ 

Waltair Veerayya Pre Release Event ప్రస్తుతం ఏపీలో సభలు, ర్యాలీల మీదున్న నిషేధం గురించి తెలిసిందే. బాలయ్య వీర సింహా రెడ్డి, చిరంజీవి వాల్తేరు వీరయ్య సభలకు అనుమతులు ఇచ్చేందుకు ప్రభుత్వం నిరాకరించింది. ముప్పు తిప్పలు పెట్టి, ఎన్నో ఆంక్షల మధ్య ఈ ఈవెంట్లను నిర్వహించుకోవాల్సి వస్తోంది. మొత్తానికి ఈ రెండు ఈవెంట్లకు అనుమతులు అయితే వచ్చాయి. వారికి నచ్చిన చోట కాకుండా.. ప్రభుత్వం చెప్పిన చోటే ఈవెంట్లను సిద్దం చేసుకుంటోంది చిత్రయూనిట్. ఇప్పుడు వాల్తేరు వీరయ్య ఈవెంట్‌కు సంబంధించిన అప్డేట్ వచ్చింది.

వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ పనులకు లైన్ క్లియర్ అయింది. ఈనెల 8న విశాఖ ఆర్కే బీచ్‌లో జరగాల్సి ఉన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక మారింది. ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు సూచించారు. దీంతో ఈవెంట్‌ను కాలేజ్ గ్రౌండ్‌కు మార్చేశారు. ఇక తాజాగా మైత్రీ మూవీస్ ఓ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ఇందులో ట్రైలర్ రిలీజ్ అప్డేట్, మాస్ ఈవెంట్ అప్డేట్ ఇచ్చారు.

 

వాల్తేరు వీరయ్య సినిమా ట్రైలర్‌ను రేపు హైద్రాబాద్‌లో నిర్వహించబోతోన్నారు. ఈ ఈవెంట్‌ను సైతం గ్రాండ్‌గానే రిలీజ్ చేయబోతోన్నారు. అయితే ఆదివారం జరగబోతోన్న మాస్ ఈవెంట్‌ను భారీ ఎత్తున ప్లాన్ చేశారని టాక్. ఈ ఈవెంట్‌కు ఏపీ మంత్రులు కూడా హాజరుకానున్నారని టాక్. అలా చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా ప్రమోషన్స్‌ పీక్స్‌కు చేరుతున్నాయి.

మరో వైపు సంక్రాంతి బరిలో చిరు వర్సెస్ బాలయ్య నడుస్తూ ఉంటే.. ఇంకో వైపు అజిత్ వర్సెస్ విజయ్ అన్నట్టుగా సాగుతోంది. జనవరి 11న అజిత్ తెగింపు రాబోతోంది. అదే రోజున విజయ్ వారసుడు కూడా రాబోతోంది. కానీ తెలుగులో మాత్రం బాలయ్య వీర సింహా రెడ్డి ముందు వస్తున్నాడు. ఆ తరువాత చిరు వాల్తేరు వీరయ్య వస్తుంది. జనవరి 13న పూనకాలు లోడింగ్ వాల్తేరు వీరయ్య టీం సందడి చేస్తూనే ఉంది.

Also Read: Thala Ajith Family : అజిత్ ఫ్యామిలీ ఫోటోలు.. ఆయన కూతురు ఎలా ఉందో చూశారా?

Also Read: Yash 19 : యష్ బర్త్ డేకి కూడా అప్డేట్ రాదట.. అర్థం చేసుకోండంటోన్న రాకీ భాయ్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News