No Time To Die: దుమ్మురేపుతున్న జేమ్స్‌బాండ్ సరికొత్త ట్రైలర్

జేమ్స్ బాండ్.. ఈ పేరు వింటే చాలు ఆ సినిమాల్లో ఉండే ఊహకందని యాక్షన్ సీన్లు, ఇన్వెస్టిగషన్.. క్రైం, థ్రిల్లింగ్, ఎమోషన్స్ అన్నీ గుర్తుకువస్తాయి. హాలీవుడ్‌లో నిర్మితమయ్యే ఈ జేమ్స్ బాండ్ సిరీస్ చిత్రాలకు ప్రపంచవ్యాప్తంగా మంచి గిరాకీ ఉంటుంది. ఈ బాండ్ చిత్రం ఎప్పుడొచ్చినా ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటుంది. తెలుగులోనూ జేమ్స్ బాండ్ చిత్రాలు డబ్బింగ్ అవుతాయి.

Last Updated : Sep 4, 2020, 08:54 AM IST
No Time To Die: దుమ్మురేపుతున్న జేమ్స్‌బాండ్ సరికొత్త ట్రైలర్

James Bond Movie No Time To Die trailer: జేమ్స్ బాండ్.. ఈ పేరు వింటే చాలు ఆ సినిమాల్లో ఉండే ఊహకందని యాక్షన్ సీన్లు, ఇన్వెస్టిగషన్.. క్రైం, థ్రిల్లింగ్, ఎమోషన్స్ అన్నీ గుర్తుకువస్తాయి. హాలీవుడ్‌లో నిర్మితమయ్యే ఈ జేమ్స్ బాండ్ సిరీస్ చిత్రాలకు ప్రపంచవ్యాప్తంగా మంచి గిరాకీ ఉంటుంది. ఈ బాండ్ చిత్రం ఎప్పుడొచ్చినా ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటుంది. తెలుగులోనూ జేమ్స్ బాండ్ చిత్రాలు డబ్బింగ్ అవుతాయి. తాజాగా నిర్మించే ఈ జేమ్స్ బాండ్ చిత్రం కరోనావైరస్ కారణంగా ఆలస్యమైన సంగతి తెలసిందే. అయితే ఇప్పుడు ఈ చిత్రం గురించి అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమాను నవంబరులో విడుదల చేయనున్నట్లు ఈ చిత్రయూనిట్ ఇటీలనే ప్రకటించింది. ఈ క్రమంలో తాజాగా మరో ట్రైలర్‌ను సైతం విడుదల చేసింది. No Time to Die పేరుతో వస్తున్న జేమ్స్ బాండ్ చిత్రం ట్రైలర్ తాజాగా మరొకటి విడుదలై సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది. Also read: చావడానికి సమయం లేదు మిత్రమా..!!

No Time to Die జేమ్స్ బాండ్ చిత్రానికి క్యారీ జోజి ఫుకునగ దర్శకత్వం వహించగా.. జేమ్స్ బాండ్‌గా ఈ సినిమాలో డేనియల్ క్రేగ్ నటిస్తున్నారు. ఆయన చివరి చిత్రం కూడా ఇదే కానుంది. ఈ క్రమంలో జేమ్స్ బాండ్ సినిమాపై హాలీవుడ్ ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి నెలకొంది. సినిమాలో జేమ్స్ బాండ్ పాత్రను చంపేస్తారా..? లేదా అతనికి రిటైర్మెంట్ ఇస్తారా..? లేదా అతను చనిపోవడాన్ని ఫేక్ అని చూపిస్తారా..? ఇలాంటి ప్రశ్నలు సామాన్య ప్రేక్షకుల్లో రేకెత్తుతున్నాయి. ఈ క్రమంలో సినిమాలో ఏం చూపిస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. Also read: Nani Bollywood debut: బాలీవుడ్ ఎంట్రీపై నాని రియాక్షన్

Trending News