YCP MLA Biyyapu: వాల్తేరు వీరయ్య థియేటర్ బుక్ చేసిన వైసీపీ ఎమ్మెల్యే.. అందరికీ ఫ్రీ షో!

YCP MLA Biyyapu Watched Waltair Veerayya: మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య సినిమా జనవరి 13వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలవగా ఒక వైసీపీ ఎమ్మెల్యే థియేటర్ మొత్తం బుక్ చేసి ఫ్రీ షో చూపించడం హాట్ టాపిక్ అయింది. ఆ వివరాలు

Written by - Chaganti Bhargav | Last Updated : Jan 16, 2023, 04:18 PM IST
YCP MLA Biyyapu: వాల్తేరు వీరయ్య థియేటర్ బుక్ చేసిన వైసీపీ ఎమ్మెల్యే.. అందరికీ ఫ్రీ షో!

YCP MLA Biyyapu MadhuSudhan Reddy Watched Waltair Veerayya: మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య సినిమా జనవరి 13వ తేదీన ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున విడుదలైంది. విడుదలైన మొదటి నుంచి సినిమాకి మంచి పాజిటివ్ టాక్ రావడంతో సినిమాకి వసూళ్ల వర్షం కురుస్తోంది. విడుదలైన మూడు రోజుల్లోనే దాదాపు 108 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసిన ఈ సినిమాని ఒక వైసీపీ ఎమ్మెల్యే చూసి ఆ విషయాన్ని సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేయడం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న పొలిటికల్ ఈక్వేషన్స్ ప్రకారం వైసీపీ అలాగే జనసేన -టీడీపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొన్నాయి.

అలాంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాని ఇప్పుడు ఆ పార్టీకి ప్రత్యర్థి పార్టీగా చెబుతున్న వైసీపీ ఎమ్మెల్యే చూడటం చూడడమే కాదు సినిమా అద్భుతంగా ఉందంటూ ప్రశంసించడమే గాక కచ్చితంగా అందరూ చూడాల్సిన సినిమా అంటూ ప్రమోట్ చేయడం ఆసక్తికరంగా మారింది. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి సంక్రాంతి సందర్భంగా వాల్తేరు వీరయ్య సినిమా వీక్షించారు, తన కుటుంబంతో కలిసి వీక్షించిన ఆయన ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు. నేను చిన్నప్పటి నుంచి మెగాస్టార్ గారి అభిమానిని సంక్రాంతి సందర్భంగా నా మిత్రులు అలాగే శ్రీకాళహస్తి వైసీపీ కుటుంబ సభ్యులందరితో కలిసి వాల్తేరు వీరయ్య సినిమాను చూడడం చాలా ఆనందంగా ఉంది, అన్నదమ్ముల అనుబంధంతో వాల్తేరు వీరయ్య చాలా బాగుంది. ప్రతి ఒక్కరూ తప్పక చూడండి అంటూ ఆయన ట్వీట్ చేయడమే గాక సోషల్ మీడియాలో తాను సినిమా వీక్షించి తర్వాత కేక్ కట్ చేస్తున్న వీడియోను కూడా పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా రాజకీయం మాట్లాడితే ఈ విషయం చాలా దూరం వెళుతుంది అంటూనే అన్నయ్యని చూసి తమ్ముడు చాలా నేర్చుకోవాలి అంటూ పవన్ కళ్యాణ్ కి చురకలు అంటించారు కూడా. అయితే ఆయన పెట్టిన పోస్ట్ కి రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. మెగాస్టార్ అభిమానుల ఓట్లు సంపాదించడానికి ఈ విధంగా పవన్ కళ్యాణ్ సోదరుడి  సినిమాని కూడా ప్రమోట్ చేస్తున్నారని కొందరు కామెంట్ చేస్తుంటే మేము అంటే మెగాస్టార్ అభిమానులం ఈసారి కచ్చితంగా జనసేనకే ఓటు వేస్తాము, అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి ఈ అంశం మీద మీ ఉద్దేశం ఏంటో కూడా కింద కామెంట్ చేయండి మరి.

Also Read: Waltair Veerayya Day 3 Collections: 'వాల్తేరు వీరయ్య' మాస్ రెండో రోజు కంటే మూడో రోజే ఎక్కువ.. 100 కొట్టేసిందిగా!

Also Read:  Veera Simha Reddy Day 4: మూడో రోజు కంటే పుంజుకున్న వీర సింహా రెడ్డి కలెక్షన్స్.. అది కలిసొచ్చిందే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

 
 

Trending News