Family Star - Parasuram Petla: ఫ్యామిలీ స్టార్ సక్సెస్ పై ఫుల్ కాన్ఫిడెన్స్‌గా ఉన్నాము.. దర్శకుడు పరశురామ్ పెట్ల..

Family Star - Director Parasuram Petla: ఈ సమ్మర్‌లో ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న మూవీ 'ఫ్యామిలీ స్టార్'. విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ హీరో, హీరోయిన్స్‌గా నటించారు. దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మించారు. ఇక 'సర్కారు వారి పాట' తర్వాత పరశురామ్ పెట్ల దర్శకత్వం వహిస్తున్న  చిత్రమిది. ఈ సందర్భంగా పరశురామ్ ఈ సినిమాపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Mar 29, 2024, 06:12 PM IST
Family Star - Parasuram Petla: ఫ్యామిలీ స్టార్ సక్సెస్ పై ఫుల్ కాన్ఫిడెన్స్‌గా ఉన్నాము.. దర్శకుడు పరశురామ్ పెట్ల..

Family Star - Director Parasuram Petla: పరశురామ్ పెట్ల తెలుగులో 'సోలో', శ్రీరస్తు శుభమస్తు, గీత గోవిందం లాంటి చిన్న చిన్న సినిమాలతో కెరీర్ ప్రారంభించి.. ఇపుడు స్టార్ డైరెక్టర్‌గా సత్తా చాటుతున్నాడు. ఇక విజయ్ దేవరకొండతో 'గీతా గోవిందం' మూవీతో ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్‌గా సత్తా చాటారు. ఆ తర్వాత మహేష్ బాబు హీరోగా 'సర్కారు వారి పాట' సినిమాతో ఓ మోస్తరు విజయం సాధించారు.  
విజయ్ దేవరకొండ హీరోగా నటించిన కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'ఫ్యామిలీ స్టార్'. ఈ సినిమా రీసెంట్‌గా రిలీజైన ట్రైలర్‌తో ఈ సినిమాపై అంచనాలు పెంచేలా చేసాయి.
ట్రైలర్‌ను ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. పరశురామ్ పెట్ల తనదైన హీరో క్యారెక్టరైజేషన్, మేకింగ్ స్టైల్ ను 'ఫ్యామిలీ స్టార్'లో మరోసారి చూపించారు. ఈ సినిమా సక్సెస్ పై సూపర్ కాన్ఫిడెంట్‌గా ఉన్నారు పరశురామ్ పెట్ల. అందుకే ఆయన ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో ' ఐ ఫీస్ట్ లాంటి 'ఫ్యామిలీ స్టార్' సినిమాలో హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ను ప్రతి తెలుగు ప్రేక్షకుడు, ప్రతి తెలుగు కుటుంబం కొన్నేళ్ల పాటు గుర్తుంచుకుంటారన్నారు. వేసవిలో సకుటుంబంగా ప్రేక్షకులు చూసి ఎంజాయ్ చేసే మూవీ 'ఫ్యామిలీ స్టార్'అని కాన్ఫిడెంట్‌గా వినిపించారు.
'ఫ్యామిలీ స్టార్‌'  సినిమాను ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో స్టార్ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. "ఫ్యామిలీ స్టార్" సినిమాకు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వాసు వర్మ వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాను ఏప్రిల్ 5వ తేదీన గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకురాబోతున్నారు.

నటీనటులు: విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ తదితరులు
టెక్నికల్ టీమ్
సినిమాటోగ్రఫీ : కేయూ మోహనన్
సంగీతం : గోపీసుందర్
ఆర్ట్ డైరెక్టర్ : ఏ ఎస్ ప్రకాష్
ఎడిటర్ : మార్తాండ్ కె వెంకటేష్
పీ ఆర్ ఓ : జి.యస్.కే మీడియా, వంశీ కాక
క్రియేటివ్ ప్రొడ్యూసర్ : వాసు వర్మ
నిర్మాతలు : రాజు - శిరీష్
రచన, దర్శకత్వం - పరశురామ్ పెట్ల

Trending News