Family Star Trailer: అదిరిపోయిన ఫ్యామిలీ స్టార్ ట్రైలర్.. విజయ్ దేవరకొండ మార్క్.. ఓ రేంజ్‌లో డైలాగ్స్..!

Vijay Devarakonda Family Star Trailer: ఫ్యామిలీ స్టార్ మూవీ ట్రైలర్ వచ్చేసింది. విజయ్ దేవరకొండ ఫ్యామిలీ మెన్‌గా అదిరిపోయే డైలాగ్స్‌తో దుమ్ములేపాడు. మృణాల్ ఠాకూర్ తన క్యూట్ యాక్టింగ్‌తో ఆకట్టుకుంది. మొత్తానికి ఫ్యామిలీ స్టార్ మూవీ ట్రైలర్‌తో మరింత అంచనాలను పెంచేసింది. మీరూ ఓ లుక్కేయండి.  

Written by - Ashok Krindinti | Last Updated : Mar 28, 2024, 12:44 PM IST
Family Star Trailer: అదిరిపోయిన ఫ్యామిలీ స్టార్ ట్రైలర్.. విజయ్ దేవరకొండ మార్క్.. ఓ రేంజ్‌లో డైలాగ్స్..!

Vijay Devarakonda Family Star Trailer: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న మూవీ ఫ్యామిలీ స్టార్. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా.. ఏప్రిల్ 5న ఆడియన్స్‌ ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. వరుసగా డిజాస్టర్స్‌లో ఉన్న విజయ్.. ఈ చిత్రంతో హిట్ కొడతాడని ఫ్యాన్స్ నమ్మకంతో ఉన్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో తాజాగా ఫ్యామిలీ స్టార్ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. కె.యు.మోహనన్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తుండగా.. ఎడిటింగ్ బాధ్యతలు మార్తాండ్ కె.వెంకటేష్ చూసుకుంటున్నారు. ట్రైలర్‌ను విషయానికి వస్తే.. విజయ్ దేవరకొండ మధ్యతరగతి కుటుంబానికి చెందిన యువకుడిగా నటించాడు. ఆర్కిటెక్ట్ పాత్రలో కనిపించాడు.  

 

"స్వామి నాకు కొత్త లైఫ్‌లో బ్రేక్‌లు ఇవ్వాల్సిన పన్లేదు. ఉన్నదాన్ని మాత్రం చెడగొట్టకు.." అంటూ విజయ్ చెప్పే డైలాగ్‌తో ట్రైలర్‌ను స్టార్ట్ చేశారు. "లిఫ్టులు ఉన్నాయని ఎక్కేసి.. సిగరేట్లు ఉన్నాయని తాగేసి.. మందు ఉందని తాగిస్తే.. హెల్త్ మొత్తం.." అంటూ చిన్న మెసేజ్ ఇస్తూనే.. వెంటనే ఫుల్ బాటిల్ దించకుండా తాగే సీన్‌ను చూపించారు. "నాక్కూడా అలానే ఉంటేనే ఇష్టమండి. సంతోషంగా.. సరదాగా.. వాళ్లందరితో కలిసిపోవచ్చు..", "ఓమై గాడ్.. నేనైతే ఫుల్‌గా పడిపోయనండి మీకు.." అంటూ మృణాల్ చెప్పిన డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. 

"మై ఫుట్..", "బుర్ర బద్ధలైపొద్ది కొడకా..", "భయపడిలిరా.. ఇంకోసారి ఎవడైనా చులకనగా మాట్లాడాలంటే..", నా గురించి మీకు ఇంకా తెలియదండి.. తప్పు నాదైనప్పుడు నలుగురిలో కాళ్లు పట్టేసుకున్న రోజులు కూడా ఉన్నాయి..", "కోపం తీరిపోతుందంటే నన్ను కొట్టవే బాబు.." అంటూ విజయ్ దేవరకొండ చెప్పే డైలాగ్స్‌కు థియేటర్స్‌లో విజిల్స్ పడటం ఖాయంగా కనిపిస్తోంది. ట్రైలర్‌తో రౌడీ స్టార్ ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీగా అవుతున్నారు. 

Trending News