Venkaiah Naidu: ఎం. వెంకయ్య నాయుడు గారికి పద్మ విభూషణ్.. కారణాలు ఇవే

Padma Vibhushan: పద్మ విభూషణ్ అవార్డులు ప్రకటించిన దగ్గర నుంచి.. సినీ హీరోల్లో మెగాస్టార్ చిరంజీవికి…రాజకీయ నాయకుల్లో వెంకయ్య నాయుడు గారికి ఎన్నో ప్రశంసలు దక్కుతున్నాయి..

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 28, 2024, 12:15 PM IST
Venkaiah Naidu: ఎం. వెంకయ్య నాయుడు గారికి పద్మ విభూషణ్.. కారణాలు ఇవే

Venkaiah Naidu: పద్మ విభీషణ అవార్డులు ఈ మధ్యనే ప్రకటించిన సంగతి తెలిసిందే. భారత మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ ఎం. వెంకయ్య నాయుడు గారికి పద్మ విభూషణ్ వచ్చిన సందర్భంగా FNCC ప్రెసిడెంట్ జి. ఆదిశేషగిరిరావు, వైస్ ప్రెసిడెంట్ టి. రంగారావు, సెక్రటరీ ముళ్ళపూడి మోహన్, జాయింట్ సెక్రెటరీ వి. వి. ఎస్. ఎస్. పెద్దిరాజు, ట్రెజరర్ బి. రాజశేఖర్ రెడ్డి మరియు కమిటీ మెంబర్స్ కాజా సూర్యనారాయణ, జే. బాలరాజు, ఏ. గోపాలరావు గార్లు వెంకయ్య నాయుడు గారిని కలిసి అభినందించి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ నేపథ్యంలో FNCC ప్రెసిడెంట్ జి. ఆదిశేషగిరిరావు గారు మాట్లాడుతూ ఆయనకు ఇలాంటి సత్కారాలు లభించడానికి కారణాలు ఏవో తెలియజేశారు.’ గతంలో వెంకయ్య నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే గా, ఎంపీ గా మరియు వివిధ శాఖల మంత్రి గా అలాగే మాజీ ఉపరాష్ట్రపతి గా రాష్ట్రానికి ఎన్నో సేవలు అందించారు. వెంకయ్య నాయుడు గారు చెప్పే విషయాలు చాలా విలువైనవిగా ఉంటాయి. ఆయన మాటల్ని అందరూ స్ఫూర్తిగా తీసుకుంటారు. అలాంటి ఉన్నత వ్యక్తికి పద్మ విభూషణం రావడం చాలా ఆనందాన్ని కలిగిస్తోంది. అలాగే సినిమా ఇండస్ట్రీ కి కూడా ఎంతో సన్నిహితంగా ఉంటారు’ అని చెప్పుకొచ్చారు.

FNCC సెక్రటరీ మోహన్ ముళ్ళపూడి గారు మాట్లాడుతూ : ‘ఈ రోజున వెంకయ్య నాయుడు గారి లాంటి ఉన్నత వ్యక్తికి పద్మ విభూషన్ రావడం అనేది చాలా ఆనందకరమైన విషయం. తెలుగువారిగా ఉపరాష్ట్రపతి స్థానానికి ఎదిగిన వ్యక్తి. తెలుగు సంప్రదాయ కార్యక్రమాలాకు హాజరవుతూ ప్రోత్సహించడంలో ముందుంటారు. అలాంటి వ్యక్తికి భారతరత్న  రావాలని నా అభిప్రాయం అని తెలియజేశారు. మాకు సమయాన్ని కేటాయించినందుకు వెంకయ్య నాయుడు గారికి ధన్యవాదాలు’ అని తెలియజేశారు.

ప్రస్తుతం ఈవెంట్ అలానే వీరి మాటలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా ఎంతో మంది వెంకయ్య నాయుడుకి అభినందనలు తెలుపుతున్నారు.

 

Also Read: KTR Auto Journey: ఆటోలో ప్రయాణించిన కేటీఆర్‌.. కాంగ్రెస్‌ను ఓడించాలని పిలుపు

Also Read Niharika Vs Chaitanya: నిహారిక ఇంటర్యూపై మాజీ భర్త చైతన్య స్పందన.. తనను నిందించొద్దని హితవు

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News