Garikapati Narasimha Rao Apologises to Megastar Chiranjeevi: హైదరాబాద్ లో ఘనంగా జరిగిన అలయ్ బలయ్ వేడుకలలో ఒక వివాదం హాట్ టాపిక్ గా మారిపోయింది. మెగాస్టార్ చిరంజీవి మొట్టమొదటి సరిగా ఈ కార్యక్రమానికి హాజరవుగా అదే కార్యక్రమానికి హాజరైన ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు మెగాస్టార్ చిరంజీవి మీద అసహనం వ్యక్తం చేశారు. గరికపాటి తన ప్రసంగం ప్రారంభిస్తున్న సమయంలో కార్యక్రమానికి విచ్చేసిన చాలామంది చిరంజీవితో ఫోటోలు దిగేందుకు ఆసక్తి చూపిస్తూ ఆయన ఏం చెబుతున్నారో కూడా వినిపించుకునే పరిస్థితిలో లేకపోవడంతో ఆయన కాస్త కటువుగానే మెగాస్టార్ చిరంజీవిని హెచ్చరించారు.
మీరు ఫోటో సెషన్ ఆపకపోతే తాను ప్రసంగించడం ఆపేస్తానని మైకు వదిలేసి వెళ్లిపోవడానికి తనకు ఎలాంటి మొహమాటం లేదని అన్నారు. ఈ మాటలు మొదట చిరంజీవి వినిపించుకోలేదు కానీ విషయం అర్థమైన వెంటనే ఫొటో సెషన్ ఆపేసి గరికపాటి పక్కకి వచ్చి మెగాస్టార్ కూర్చున్నారు. తర్వాత మెగాస్టార్ గరికపాటికి తాను అభిమానినని మీ అందరికీ నేను అభిమాన హీరో అయితే నాకు ఆయన అభిమాన ప్రసంగకర్త అంటూ ఆయన ఒక రకంగా పొగడ్తల వర్షం కురిపించారు.
మెగాస్టార్ @KChiruTweets గారికి క్షమాపణలు చెప్పిన ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచన కర్త గరికపాటి నరసింహారావు. #JaiChiranjeeva 🙌 pic.twitter.com/yRMqFSisVA
— SivaCherry (@sivacherry9) October 7, 2022
అయితే మెగాస్టార్ చిరంజీవి మీద గరికపాటి నరసింహారావు ఫైర్ అవడం మీద అటు మెగా అభిమానులు కానీ సినీ రంగంలో పలు వర్గాల వారు గాని ఘాటుగా స్పందిస్తున్నారు. చిరంజీవి గారి లాంటి ఉన్నత వ్యక్తిత్వం గురించి ఆయన ఎలా మాట్లాడారు అంటూ పెద్ద ఎత్తున కామెంట్ చేస్తున్నారు. అయితే ఈ విషయం మీద ఎట్టకేలకు గరికపాటి నరసింహారావు స్పందించారు. చిరంజీవి గారి లాంటి ఉన్నత వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి గురించి నేను ఆ విధంగా మాట్లాడి ఉండాల్సింది కాదని ఆయన ఒక ప్రెస్ నోట్ విడుదల చేశారు.
ఆ రోజు జరిగింది దానికి నేను సిగ్గుతో తలవంచి ఆయనకు, ఆయన అభిమానులకు క్షమాపణలు చెబుతున్నానని పేర్కొన్నారు. నా క్షమాపణలు చిరంజీవి గారు సహృదయంతో స్వీకరిస్తారని ఆశిస్తున్నానని, గరికపాటి నరసింహారావు పేర్కొన్నారు. ఇక ఇదే విషయం మీద గరికపాటి నరసింహారావుకు రాష్ట్ర చిరంజీవి యువత అధ్యక్షుడు భవాని రవిశంకర్ ఫోన్ చేయగా తాను మెగాస్టార్ చిరంజీవితో మాట్లాడతానని ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయాలని గరికపాటి పేర్కొన్నారు. ఇక ప్రస్తుతానికి గరికిపాటికి క్షమాపణలు చెప్పిన వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook