Viral Video: మట్టిలో మాణిక్యాలు.. వీళ్ల డాన్స్ కు ఫిదా అయిన బాహుబలి భామ

ఈ ముగ్గురు అమ్మాయిల డ్యాన్స్ కు ఏకంగా బాహుబలి భామ కూడా ఫిదా అయింది.. వీళ్ల డ్యాన్స్ లో పెర్ఫార్మెన్స్ కు నెటిజన్లు తెగ ఫిదా అయిపోతున్నారు.. మరేందుకు ఆలస్యం ఆ వైరల్ వీడియో మీరే చూసేయండి.   

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 14, 2021, 06:58 PM IST
  • ఈ అమ్మాయిల డాన్స్ చూసి ఫిదా అయిన బాలీవుడ్ భామ
  • షేర్ చేసిన కాసేపటికే వైరల్ అయిన డాన్స్ వీడియో
  • ఈ ముగ్గురు స్లం అమ్మాయిలు ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా ఫేమస్
Viral Video: మట్టిలో మాణిక్యాలు.. వీళ్ల డాన్స్ కు ఫిదా అయిన బాహుబలి భామ

  Viral Dance Video: టాలెంట్ ఏ ఒక్కరి సొంతం  కాదు.. ప్రతిభ ఉన్న వారిని ఎవరిని అడ్డుకోలేరు.. అవును ఇది నిజం.. ప్రస్తుతం నెట్టింట్లో ఒక వీడియో తెగ వైరల్ అవుతుంది. ముగ్గురు అమ్మాయిలు ఒక పూరి గుడిసె ముందు బాలీవుడ్ సాంగ్ కు డ్యాన్స్ చేసిన తీరు అందరిని ఆకట్టుకుంటుంది. అంతెందుకు మన బాహుబలి భామ ఏకంగా వీరి వీడియోని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిందంటే... వారు ఏ రేంజ్ లో డ్యాన్స్ చేశారో ఊహించుకోండి. 

వివరాల్లోకి వెళ్తే.. ముగ్గురు అమ్మాయిలు.. బాలీవుడ్ పాటలకు, పంజాబీ పాటలను చక్కగా డ్యాన్స్ చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ.. మిలియన్ల వ్యూస్ కొట్టేస్తున్నారు. ఏకంగా మన బాలీవుడ్ భామ నోరా ఫతేహి తన ఇన్‌స్టాగ్రామ్‌లో ముగ్గురు అమ్మాయిల వీడియోను షేర్ చేసింది.

Also Read: Samantha in Holywood: విడాకుల తరువాత 'తగ్గేదేలే' అంటున్న సమంత..

వీడియో షేర్ చేసిన బాలీవుడ్ నటి 

బాలీవుడ్ చిత్రం 'సత్యమేవ జయతే 2' (Satyameva Jayate 2) లోని 'కుసు కుసు' (Kusu Kusu) పాటకు ముగ్గురు అమ్మాయిలు డ్యాన్స్ చేసిన వీడియో ఇంటర్నెట్‌లో తెగ వైరల్‌గా మారింది. నిజానికి ఒరిజినల్ సాంగ్‌లో పెర్ఫార్మెన్స్ ఇచ్చిన 'నోరా ఫతేహి'ని (Nora Fatehi) కూడా ఈ అమ్మాయిలు తమ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ ఆకర్షించారు. నోరా తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో వీరి డ్యాన్స్ వీడియోని షేర్ చెయ్యగా.. వీరి డ్యాన్స్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ ముగ్గురు అమ్మాయిలు డ్యాన్స్ చేసే ప్రతి వీడియో కూడా మురికివాడ కావటం విశేషం. వీళ్ల డ్యాన్స్ చూసిన ప్రతి ఒక్కరూ 'ఫుల్ టాలెంటెడ్ గర్ల్స్' అని కాంప్లిమెంట్ అని చెప్పకుండా ఉండలేరు. 

ఈ ముగ్గురు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫుల్ పాపులర్

'డాన్స్ దీవానే సీజన్ 3' కంటెస్టెంట్ ఉదయ్ సింగ్ షేర్ చేసిన ఒరిజినల్ క్లిప్‌ను నోరా ఫతేహి రీపోస్ట్ చేసింది. వీడియోలో, 'కుసు కుసు' పాటకు ముగ్గురు అమ్మాయిలు జోష్ ఉన్న స్టెప్స్ చేశారు. పోస్ట్‌కి 700 వేలకు పైగా లైక్‌లు రాగా.. అనేక కామెంట్‌లు వచ్చాయి. ముగ్గురు అమ్మాయిలు చూపిన పర్ఫెక్ట్ మూవ్స్ చూసి జనాలు ఆశ్చర్యపోయారు. నోరా షేర్ చేసిన ఈ వీడియోను యూజర్లు మెచ్చుకున్నారు. 'OMG, ఇది చాలా అందంగా ఉంది! మీరు చాలా అద్భుతంగా డాన్స్ చేస్తున్నారని' ఒక యూసర్ కామెంట్ చేసాడు. 

Also Read: Chandra Grahanam 2021: నవంబర్ 19న కార్తీక పౌర్ణమి.. ఆ రోజే చివరి చంద్ర గ్రహణం.. ఆ రాశిపై ప్రభావం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News