Ram Charan Birthday Celebrations: డల్లాస్‌లో మెగాఫ్యాన్స్ ఆధ్వర్యంలో ఘనంగా రామ్ చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్..

Ram Charan Birthday Celebrations: రామ్ చరణ్‌ బర్త్ డే వేడుకలు.. తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరిగాయి. అటు మన దేశంలోని వివిధ నగరాలతో పాటు అమెరికాలోని డల్లాస్, టెక్సాస్ రాష్ట్రాల్లో మెగా ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి.

Written by - TA Kiran Kumar | Last Updated : Mar 28, 2024, 03:26 PM IST
Ram Charan Birthday Celebrations: డల్లాస్‌లో మెగాఫ్యాన్స్ ఆధ్వర్యంలో ఘనంగా రామ్ చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్..

Ram Charan Birthday Celebrations: రామ్ చరణ్ తన 39వ పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నారు. ఉదయమే వీఐపీ విరామ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత హైదరాబాదా శిల్పాకళావేదికలో ఈయన బర్త్ డే సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. అటు దేశ వ్యాప్తంగా వివిధ నగరాలతో పాటు విదేశాల్లోకూడా రామ్ చరణ్‌ పుట్టినరోజు వేడుకలను మెగా ఫ్యాన్స్ ఘనంగా నిర్వహించారు. రామ్ చరణ్ మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి .. ఆ తర్వాత తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అటు చిరు తనయడు నుంచి మెగా పవర్ స్టార్‌గా ఎదిగాడు. అంతేకాదు ప్యాన్ ఇండియా హీరోల్లో టాప్ లీగ్‌లో ఉన్నారు. ఇపుడు ౠయన హీరోగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో 'గేమ్ ఛేంజర్' మూవీ చేస్తున్నారు. ఈ సినిమా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నారు. అటు బుచ్చిబాబు సన దర్శకత్వంలో సినిమాకు కొబ్బరికాయ కొట్టారు. అటు సుకుమార్ దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ అనౌన్స్ చేసాడు.

ఈ బర్త్ డే రామ్ చరణ్‌కు ఎంతో ప్రత్యేకమనే చెప్పాలి. కూతురు క్లీంకార పుట్టిన తర్వాత చరణ్‌కు తొలి బర్త్ డే. ఈ సందర్భంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బృందం డల్లాస్‌లోని స్పైస్ రాక్ రెస్టారెంట్‌లో రామ్ చరణ్‌ బర్త్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు.

మెగాస్టార్ చిరంజీవి భారతీయ సినీ ఇండస్ట్రీలో లెజెండ్‌గా తనదైన ముద్ర వేశారు. ఆయన వారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసి వారసత్వాన్ని కొనసాగించటం అంత ఈజీ కాదు. అయితే చరణ్ ఎంతో బాధ్యతతో తనపై ఉన్న నమ్మకాన్ని నిజం చేస్తూ అగ్రకథానాయకుడిగా దూసుకుపోతున్నారు. రంగస్థలం, ఆర్ఆర్ఆర్ వంటి చిత్రాల్లో నటించి నటుడిగా సత్తా చాటారు.  కేవలం సినిమాలకే పరిమితం కాకుండా తండ్రి బాటలోనే నడుస్తూ అనేక సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ తరం యువ హీరోలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ సందర్భంగా  రామ్ చరణ్ బర్త్ డే వేడుకలకు హాజరైన అందరూ చరణ్‌ ఎదుగుదలను ఆకాంక్షిస్తూ బర్త్ డే విషెష్ తెలియజేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా చిట్టి ముత్యాల, ఏపీటీఏ మాజీ అధ్యక్షుడు నటరాజ్ యెల్లూరి, డల్లాస్ బాబీ మరియు రాజేష్ కళ్లేపల్లిలతో పాటు శ్రీరామ్ మత్తి, సురేశ్ లింగినేని, కిషోర్ అనిశెట్టి, కిషోర్ గుగ్గిలపు, నరసింహ సత్తి తదితరులు హాజరయ్యారు.  వెల్నాటి, సునీల్ తోట, సుధాకర్ అందే ఆప్త, నాగేశ్వర్ చందన, రత్నాకర్ జొన్నకూటి, అనిల్ చలమలశెట్టి తదితరులు కేక్ కటింగ్ కార్యక్రమాలను నిర్వహించారు.

Also Read: Pawan Kalyan: జనసేనకు పవన్‌ కల్యాణ్‌ భారీ విరాళం.. ఇకపై ఏపీలో రణరంగమే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News