మూవీ రివ్యూ: 'భీమా'(Bheema)
నటీనటులు: గోపీచంద్, మాళవిక శర్మ, ప్రియా భవానీ శంకర్, వెన్నెల కిషోర్, నరేష్, పూర్ణ, నాజర్, ముఖేష్ తివారి తదితరులు..
సినిమాటోగ్రఫీ: స్వామి జే గౌడ
మ్యూజిక్: రవి బస్రూర్
ఎడిటింగ్: తమ్మి రాజు
నిర్మాత: కేకే రాధా మోహన్
దర్శకత్వం: ఏ. హర్ష
Bhimaa Movie Review: గోపీచంద్ హీరోగా ఒక హిట్ అందుకుంటే .. వరుసగా మూడు ఫ్లాపులు పలకరిస్తున్నాయి. కెరీరర్ పరంగా వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నాడు. మాస్ హీరో కటౌట్ ఉన్న.. అందుకు తగ్గ కంటెంట్ మాత్రం పటడం లేదు. ఈ సారి కూడా 'భీమా' అంటూ తన మార్క్ మాస్ హీరోయిజంతో కన్నడ దర్శకుడు ఏ. హర్ష దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ సినిమాతో గోపీచంద్ హీరోగా బ్యాక్ బౌన్స్ అయ్యాడా ? లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
కథ విషయానికొస్తే..
భీమా (గోపీచంద్) సముద్ర తీర పట్టణమైన మహేంద్రగిరికి సీఐగా వస్తాడు. అక్కడ యథావిధిగా దుండుగులను భరతం పడుతుంతాడు. ఈ క్రమంలో అతినికి శత్రువులు పెరుగుతారు. అదే మహేంద్రగిరిని భవాని (ముఖేష్ తివారి) ఏలుతుంటాడు. ఈ క్రమంలో అక్కడ స్కూల్ టీచర్‌గా పనిచేస్తోన్న విద్యతో ప్రేమలో పడతాడు. ఈ క్రమంలో ఆ ఊర్లో ఆయుర్వేద వైద్యం చేస్తోన్న రవీంద్ర వర్మ (నాజర్) పరిచయం అవుతాడు. ఆ క్రమంలో ఊరిని పట్టి పీడిస్తోన్న దుండుగులను ఎలా అడ్డుకొన్నాడు. ఈ క్రమంలో చోటు చేసుకున్న పరిణామాలేమిటనేదే ఈ మూవీ స్టోరీ.
కథనం, టెక్నికల్ విషయానికొస్తే..
ఈ మూవీని దర్శకుడు హర్ష యాక్షన్ మూవీగా తెరకెక్కిస్తూనే మన పరశురాముడికి సంబంధించిన పురాణ సంబంధ విషయాలను ప్రస్తావిస్తూ సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు. మహేంద్రగిరిలో ఉండే శివాలయంలో కోరికలు తీరని ప్రేతాత్మలు తమ రక్త సంబంధీకుల ద్వారా తమ కోరికలను తీర్చుకుంటాయనే కాన్సెప్ట్ కూడా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. మొత్తంగా మొదటి అరగంట సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన దర్శకుడు.. ఆ తర్వాత అన్ని పోలీస్ సినిమాల్లో మాదిరిగానే రొటిన్ సీన్స్ పెట్టి ప్రేక్షకులను విసిగించాడు. హీరోను పోలీస్ ఆఫీసర్‌గా ఉత్తముడిగా చూపిస్తూనే.. హీరోయిన్‌ను చూడగానే చొంగ కార్చుకునే టైపు తరహాలో చూపించడం కాస్త ఇబ్బందిగా ఉంటుంది. మరోవైపు ఇంటర్వెల్ ట్విస్ట్ ఈ సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేలా చేసాడు. సెండాఫ్‌లో వచ్చే ప్రీ క్లైమాక్స్ సీన్స్ బాగున్నాయి. మరోవైపు హీరో ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు ఏమంత ఎఫెక్టివ్‌గా లేవు. మరోవైపు అన్నను చంపిన వాళ్లపై తమ్ముడు పగ తీర్చుకోవడం అనే రొటిన్ క్లైమాక్స్ ఉన్నా.. ఆయా సన్నివేశాలను చివరకు ప్రేక్షకులను ఎంగేజ్ అయ్యేలా చేసాడు. ఇందులో మరో ఆసక్తికరమైన ట్విస్ట్ ఉంది. అది సినిమా చూస్తేనే తెలుస్తోంది. అక్కడక్కడ 'సోగ్గాడే చిన్నినాయనా' సినిమా తాలూకు ఛాయలు కూడా కనిపిస్తాయి. సినిమాకు రవి బస్రూర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. స్వామి జే గౌడ సినిమాటోగ్రఫీ రిచ్‌గా ఉంది. ఎడిటర్.. ఫస్టాఫ్‌లో వచ్చే అనవసరమైన సీన్స్ కత్తిరించి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
నటీనటుల విషయానికొస్తే..
'భీమా'లో గోపీచంద్ మరోసారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో తనదైన కటౌట్‌తో మెప్పించారు. మరోవైపు నాజర్, హీరోయిన్స్‌గా నటించిన మాళవిక శర్మ, ప్రియా భవానీ శంకర్ ఉన్నంతలో పర్వాలేదనిపించారు. మిగతా పాత్రల్లో నటించిన నటీనటులు తమ పరిధి మేరకు రాణించారు.
ప్లస్ పాయింట్స్..
నిర్మాణ విలువలు
ఇంటర్వెల్ బ్యాంగ్
బ్యాక్ గ్రౌండ్ స్కోర్
మైనస్ పాయింట్స్
ఫస్టాఫ్
రొటీన్ యాక్షన్
ఎడిటింగ్
చివరి మాట.. 'భీమా'.. మాస్ యాక్షన్ అభిమానులకు మాత్రమే..
రేటింగ్: 2.5/5
Also Read: Gaami Twitter Review: గామి ట్విట్టర్ రివ్యూ.. విజువల్ వండర్.. ఫిక్స్ అయిపోండి.. పక్కా హిట్..!
Also Read: Indiramma Housing Scheme: ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షలు.. ఎప్పుడు.. ఎంతిస్తారంటే..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter