Grammy Awards: గ్రామీ అవార్డుల్లో సత్తా చాటిన భారతీయులు.. ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేస్తోన్న భారతీయులు..

Grammy Awards: సినీ రంగంలో ఆస్కార్ అవార్డులు ఎలాగో.. సంగీత రంగంలో గ్రామీ అవార్డులకు అత్యంత ప్రాధాన్యత ఉంది. ఈ అవార్డు అందుకోవాలని ప్రతి ఒక్క సంగీత కళాకారుడు కోరుకుంటాడు. తాజాగా ఈ ఇంటర్నేషనల్ అవార్డును ఇద్దరు భారతీయులు అందుకున్నారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Feb 5, 2024, 03:51 PM IST
Grammy Awards: గ్రామీ అవార్డుల్లో సత్తా చాటిన భారతీయులు.. ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేస్తోన్న భారతీయులు..

Grammy Awards: మ్యూజిక్ రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మక అవార్డుగా గ్రామీ అవార్డులకు పేరుంది. ఈ యేడాదిగాను ఈ అవార్డుల కార్యక్రమం అమెరికా దేశంలోని లాస్ ఏంజెల్స్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రపంచ దేశాలకు చెందిన సినీ ప్రముఖులు పాల్గొని ఈ పాటలతో ఉర్రూతలూగారు. ఈ ఇంటర్నేషనల్ డయాస్ పై మన దేశపు సంగీత కళాకారులైన జాకీర్ హుస్సేన్ (Zakir Hussain), శంకర్ మహదేవన్ (Shankar Mahadevan) సత్తా చాటారు.

వీళ్లిద్దరు కలిసి సంయుక్తంగా కంపోజ్ చసిన 'దిస్ మూమెంట్' బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్‌గా అవార్డును గెలిచుకుంది (Grammy Awards 2024). ఈ పాటను జాన్ మెక్‌లాఫ్లిన్ (గిటార్), జాకిర్ హుస్సేన్ (తబలా), శంకర్ మహదేవన్ (సింగర్), గణేష్ రాజగోపాలన్ (వయోలిన్) వంటి టాలెంటెడ్ మ్యూజిక్ పీపుల్ కలిసి 'శక్తి' బ్యాండ్ పేరిట కంపోజ్ చేశారు. వరల్డ్ వైడ్‌గా పోటిని ఎదుర్కొని 'శక్తి' విన్నర్‌గా నిలవడంతో ఇంటర్నేషనల్ లెవల్లో వీళ్లను ప్రశంసలతో వెల్లువెత్తుతున్నాయి.

ఈ సందర్భంగా శంకర్ మహదేవన్ మాట్లాడుతూ.. నాకు ప్రతి విషయంలో ఎంకరేజ్ చేసిన నా భార్యకు ఈ అవార్డును అంకితం చేస్తున్నాను. ఈ విజయంలో నాకు తోడ్పాటు అందించిన ప్రతి ఒక్కరికీ మనస్పూర్తిగా థాంక్య్ చెబుతున్నట్టు మీడియాకు తెలిపారు.

ఇక గ్రామీ అవార్డు విన్నర్స్‌కు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేసారు. మ్యూజిక్ పై మీకున్న అంకితభావంతో నేడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాది అభిమానుల హృదయాలను కొల్లగొట్టారు. మిమ్మల్ని చూసి దేశం అంతా గర్విస్తోంది. ఈ విజయం ఒక్కరోజులో వచ్చింది కాదు. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చుకుంటే కానీ ఈ విజయం దక్కదు అంటూ ఒకింత భావోద్వేగమైన పోస్ట్ చేసారు. ఈ రంగంలో కొత్తగా వచ్చేవారికి మీకు వచ్చిన అవార్డులతో వారిలో స్పూర్తినింపారని కొనియాడారు.

2024 గ్రామీ విన్నర్స్ లిస్ట్..

బెస్ట్ ర్యాప్ ఆల్బమ్ - మెఖైల్ (కిల్లర్ మైక్)
బెస్ట్ ఆఫ్రికన్ సంగీత ప్రదర్శన - టైలా (వాటర్)
బెస్ట్ క్లాసికల్ సోలో వోకల్ ఆల్బమ్ - జూలియా బూల్లక్, సోలోయిస్ట్ (వాకింగ్ ఇన్ ద డార్క్)
బెస్ట్ మ్యూజిక్ వీడియో - జోనథన్ క్లైడ్ ఎమ్ కూపర్ (ఐయామ్ ఓన్లీ స్లీపింగ్)
బెస్ట్ రాక్ ఆల్బమ్ - పారామోర్ (దిస్ ఇజ్ వై)
బెస్ట్ రాక్ సాంగ్.. -బాయ్ జేనియస్ (నాట్ స్ట్రాంగ్ ఎనఫ్)
బెస్ట్ కామెడీ ఆల్బమ్ - డేవ్ చాపెల్ (వాట్స్ ఇన్ ఏ నేమ్)
గ్లోబల్ మ్యూజిక్ ప్రదర్శన - జాకిర్ హుస్సేన్, బెలా ఫెక్ (పష్టో)
గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్ - శక్తి (దిస్ మూమెంట్‌)
బెస్ట్ కంట్రీ సాంగ్, సోలో - క్రిష్ స్టేప్లెటన్ (వైట్ హార్స్)

Also Read: Revanth Vs Harish Rao: తెలంగాణలో జల యుద్ధం.. రేవంత్‌ కాస్కో అంటూ సవాల్‌ విసిరిన హరీశ్‌ రావు

Also Read: CM Revanth Reddy: ఒక్క నిమిషం కూడా మైక్ కట్ చేయం.. కేసీఆర్, కేటీఆర్ లకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News