Allu Arjun: మొదటిసారి పవన్ కళ్యాణ్ గురించి నోరు విప్పిన అల్లు అర్జున్.. బాలకృష్ణతో ఏమన్నారంటే..!

Allu Arjun about Pawan Kalyan: బాలకృష్ణ అన్ స్టాపబుల్ షో ఆహా బుల్లితెర పైన.. ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో అందరికీ తెలిసిన విషయమే. ఈ షో ఇప్పటికే మూడు సీజన్లు.. సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుంది. ప్రస్తుతం ఈ షో కి సంబంధించిన నాలుగో సీజన్ స్ట్రీమింగ్ అవుతోంది. ఇక ఈ సీజన్లో భాగంగా అల్లు అర్జున్ గెస్ట్ గా వచ్చారు. ఈ క్రమంలో అల్లు అర్జున్..పవన్ కళ్యాణ్ గురించి.. చెప్పిన మాటలపైన అందరి దృష్టి పడింది..   

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Nov 14, 2024, 05:44 PM IST
Allu Arjun: మొదటిసారి పవన్ కళ్యాణ్ గురించి నోరు విప్పిన అల్లు అర్జున్.. బాలకృష్ణతో ఏమన్నారంటే..!

Allu Arjun in Unstoppable with NBK: ఒకప్పుడు పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ ఇద్దరూ కూడా ఒకే కుటుంబం కి చెందిన వారిలా అభిమానులు స్వీకరించేవారు. కానీ ఆ తర్వాత జరిగిన కొన్ని సంఘటనల వల్ల.. ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం అల్లు ఫ్యామిలి వర్సెస్ మెగా ఫ్యామిలీ అంటూ చర్చ జరుగుతోంది. ముఖ్యంగా అల్లు అర్జున్ అభిమానులకు.. పవన్ కళ్యాణ్ అభిమానులకు అస్సలు పడడం లేదు. 

గత ఎలక్షన్స్ లో అల్లు అర్జున్.. తన ఫ్రెండ్ వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే కి సపోర్ట్ చేయడంతో.. ఇక అదే టైంలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కూడా.. టిడిపి తో కలిసి ఎలక్షన్స్ తో పోటీ చేయడంతో.. వీరి అభిమానుల మధ్య గొడవ మరి ఎక్కువైంది. ఈ సంఘటన జరిగిన తరువాత.. ఇప్పటివరకు ఎక్కడా కూడా అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడలేదు. ట్విట్టర్లో కంగ్రాట్యులేషన్స్ మెసేజెస్ పెట్టిన సందర్భాలు ఉన్నాయి కానీ.. డైరెక్ట్ గా ఆయన గురించి ప్రస్తావించిన.. సందర్భాలు మాత్రం లేవు. 

ఈ క్రమంలో ఇప్పుడు బాలకృష్ణ షోలో.. అల్లు అర్జున్ మొదటిసారి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడబోతున్నారు. అన్ స్టాపబుల్ స్టోర్ లో బాలకృష్ణ వరసగా హీరోల ఫోటోలు వేసి.. వారి గురించి ప్రశ్నలు అడగగా.. ముందుగా అల్లు అర్జున్ ప్రభాస్ ని ఆరడుగుల బంగారం అంటూ చెప్పుకొచ్చారు. ఇక ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఫోటో కూడా వేశారు. కానీ పవన్ కళ్యాణ్ గురించి అల్లు అర్జున్ ఏమి చెప్పారు అనేది ఈ మధ్య విడుదలైన ప్రోమోలో తెలియచేయలేదు. అంటే అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్పారో తెలియాలంటే.. ఈ ఎపిసోడ్ విడుదల వరకు వేచి చూడాలి.

కాగా విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం.. అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ తో తనకున్న అనుబంధం గురించి మాట్లాడినట్టు తెలుస్తోంది. మొత్తం పైన అల్లు అర్జున్ ఏమన్నారు తెలియాలి అంటే.. నవంబర్ 15 వరకు వేచి చూడాల్సిందే.

 

Also Read : Balayya Heroine: ఎఫైర్స్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన బాలయ్య భామ.. మైండ్ బ్లాంక్ చేస్తోన్న హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్..

Also Read : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

Trending News