సైకాలజీ డాక్టర్ గా సమంత‌ !

Last Updated : Dec 26, 2017, 01:58 PM IST
సైకాలజీ డాక్టర్ గా సమంత‌ !

అక్కినేని సమంత ఇప్పుడు సరికొత్త గెటప్‌లో కనిపించనుంది. తన అప్ కమ్మింగ్ తమిళ సినిమా 'ఇరుంబు తిరై'లో  సైకాలజీ డాక్టర్ పాత్రలో నటిస్తోంది. రీసెంట్ గా విశాల్ పాత్రను పరిచయం చేస్తూ ఆయన పోస్టర్ ను రిలీజ్ చేసిన చిత్ర  యునిట్ .. తాజాగా 'డాక్టర్ రతీదేవి'గా సమంత పాత్రను పరిచయం చేస్తూ ఆమె పోస్టర్‌ను పరిచయం చేశారు.

కథను మలుపు తిప్పే పాత్ర 
'ఇరుంబు తిరై' సినిమాలో సమంతది కథను మలుపు తిప్పే పాత్ర.  విశాల్ సొంత బ్యానర్ లో పి.ఎస్.మిత్రన్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా, షూటింగ్ పరంగా చివరిదశకు చేరుకుంది. జనవరి 26వ తేదీన తమిళంతో పాటు తెలుగులోను ఈ  సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.     

Trending News