How is that for a Monday : రిలీస్ కి ముందే శేఖర్ కమ్ముల ప్రశంసలు అందుకున్న 'హౌ ఇస్ దట్ ఫర్ ఏ మండే'

Tollywood News : మంచి సినిమాలు అలానే ఫీల్ గుడ్ సినిమాలు తీయడంలో.. ప్రస్తుతం ఉన్న డైరెక్టర్లు శేఖర్ కమ్ముల మొదటి స్థానంలో ఉంటారు అన్నడం లో సందేహం లేదు. ఆనంద్, గోదావరి, హ్యాపీ డేస్ లాంటి ఎన్నో మరిచిపోలేని చిత్రాలను అందించారు ఈ డైరెక్టర్. ఇక సినిమాలు తీయడంలోనే కాదు మంచి సినిమాలు ఆదరించడంలో కూడా ఈయన ముందుంటారు. ఇక ప్రస్తుతం ఈ డైరెక్టర్ ప్రశంసించిన ఒక సినిమా ఏంటో చూద్దాం..  

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 27, 2023, 10:40 AM IST
How is that for a Monday : రిలీస్ కి ముందే శేఖర్ కమ్ముల ప్రశంసలు అందుకున్న 'హౌ ఇస్ దట్ ఫర్ ఏ మండే'

Sekhar Kammula : ఏ ఉద్యోగి కైనా సరే సోమవారం అంటే అదేదో ఒక ఫోబియా ఉంటుంది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఇంజినీర్లకి వీకెండ్ తర్వాత వచ్చే సోమవారం అంటే మళ్లీ పని మొదలైపోయింది రా బాబు అనే ఫీలింగ్ కలుగుతుంది. అటువంటి ఒక మండే ఊహకందని మార్పులు చోటు చేసుకుంటే? ప్రియురాలితో గొడవతో మొదలై, అప్పులిచ్చిన వారి బెదిరింపులు, తనకేమాత్రం సంబంధం లేని ఒక క్రైమ్ లో ఇరుక్కోని, అంతేకాదు అన్నీ చేకూరి దాదాపు ప్రాణాల మీదకు వచ్చే సిచువేషన్ వరకు వెళితే. ఇలా ఊహకందకుండా శ్యామ్ కుమార్ అనే ఒక ఎన్.ఆర్.ఐ. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ జీవితం లోని ఒక సోమవారము అమెరికాలోని సమకాలీన సామాజిక, ఆర్ధిక వ్యవహారాలతో ముడిపెడుతూ ఆద్యంతం ఆసక్తిగా సాగేలా తీసిన మంచి ఎంటర్టైన్మెంట్ సినిమానే "హౌ ఈస్ థట్ ఫర్ ఏ  మండే".

ఈ చిత్రాన్ని నైజాం టాకీస్, మినర్వా పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో  మెన్ టూ, బ్రోచేవారెవరురా తదితర చిత్రాలలో నటించిన కౌశిక్ ఘంటసాల హీరోగా, ప్రముఖ అమెరికన్ నటులు క్యాండిడో కార్టర్, ఎలిస్టర్ ల్యాథం, మేగన్ బార్లో సహా నటులుగా నటించారు. సాయి ప్రణీత్ గౌరవరాజు సహ రచయితగా, ఎమ్మీ అవార్డు విజేత స్కాట్ వుల్ఫ్ శబ్దగ్రాహకుడిగా పని చేసారు.

అంతే కాదు ఈ చిత్రానికి మలయాళీ మ్యూజిక్ డైరెక్టర్ డాన్ విన్సెన్ట్ నేపధ్య సంగీతం, మల్లేశం చిత్ర ఫెమ్ రాఘవేందర్ ఉప్పుగంటి కూర్పు సమకూర్చగా, హాలీవుడ్ లో శిక్షణ పొందిన శ్రీపాల్ సామా ఈ సినిమా కథ రచించడమే కాకుండా  దర్శకత్వం వహించారు.  
ఇక ఈ సినిమా గురించి చెప్పుకోదక్క విషయం ఏమిటి అంటే ఈ చిత్రం పలు ఫిలిం ఫెస్టివల్స్ కి ఎంపిక కావడమే కాదు శేఖర్ కమ్ముల దగ్గర నుంచి కూడా ప్రశంసలు అందుకుంది.

ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల ఈ సినిమాని ఎంతో ప్రశంసించారు. ఆయన మాట్లాడుతూ ‘సినిమాను చూశాను.. చాలా బాగా వచ్చింది.. చిన్న క్యూట్ ఫిల్మ్. షార్ట్ అండ్ స్వీట్‌గా ఉంది. థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో పాటు ఈ సినిమాలో సోషల్ మెసెజ్ కూడా ఇచ్చారు. కౌశిక్ ఈ చిత్రం బాగా నటించాడు. డైరెక్టర్ శ్రీపాల్ అద్భుతంగా తీశాడు. టీం అందరికీ ఆల్ ది బెస్ట్’ అని అన్నారు. ఇక ఈ సినిమా ఇంగ్లీష్ - తెలుగు భాషల్లో ఈ చిత్రం ఈ నెల 27న విడుదల కాబోతోంది.‌

Also Read: Fixed Deposit Rates 2023: గుడ్‌న్యూస్ చెప్పిన బ్యాంక్.. ఎఫ్‌డీలపై వడ్డీరేట్లు పెంపు   

Also Read: Tirumala Temple: తిరుమల భక్తులకు అలర్ట్.. ఆ రోజు ఆలయం మూసివేత  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News