NTR Birthday: అభిమానులకు ఎన్టీఆర్ విన్నపం, కావాలంటే అప్పుడు వేడుక చేసుకుందామని ట్వీట్

Jr NTR Birthday Celebrations | ఇదివరకే ఆన్‌లైన్‌లో జైఎన్టీఆర్ అని ట్యాగ్ ట్రెండింగ్ అవుతోంది. ఈ నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ హీరో జూనియర్ ఎన్టీఆర్ తన అభిమానులకు విన్నపం చేశారు. ఈ మేరకు ట్విట్టర్‌లో అభిమానులకు విన్నపం అంటూ ఓ లేఖ విడుదల చేశారు.

Written by - Shankar Dukanam | Last Updated : May 19, 2021, 02:44 PM IST
NTR Birthday: అభిమానులకు ఎన్టీఆర్ విన్నపం, కావాలంటే అప్పుడు వేడుక చేసుకుందామని ట్వీట్

Happy Birthday NTR: టాలీవుడ్ యంగ్ టైగర్ పుట్టినరోజు అనగానే అభిమానులు సెలబ్రేషన్స్‌కు సిద్ధమవుతారు. ఇదివరకే ఆన్‌లైన్‌లో జైఎన్టీఆర్ అని ట్యాగ్ ట్రెండింగ్ అవుతోంది. ఈ నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ (RRR) హీరో జూనియర్ ఎన్టీఆర్ తన అభిమానులకు విన్నపం చేశారు. ప్రస్తుతం ఇది ఎలాంటి వేడుకలు జరుపుకునే సమయం కాదని, ప్రతి ఒక్కరూ లాక్‌డౌన్ నియమాలు, కర్ఫూ నిబంధనలు పాటించి, ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. 

దేశమంతా కనిపించని శత్రువుతో యుద్ధం చేస్తున్న సమయంలో తన పుట్టినరోజు వేడకలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు ట్విట్టర్‌లో అభిమానులకు విన్నపం అంటూ టాలీవుడ్ అగ్ర నటుడు జూనియర్ ఎన్టీఆర్ (Actor Jr NTR) ఓ లేఖ విడుదల చేశారు. ‘నా అభిమానులందరికీ పేరుపేరునా కృత‌జ్ఞతలు తెలుపుకుంటున్నాను. గత కొద్దిరోజులుగా మీరు పంపుతున్న సందేశాలు, వీడియోలు చూస్తున్నాను. మీ ఆశీస్సులు నాకెంతో ఊరట కలిగించాయి. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను. ప్రస్తుతం నేను బాగున్నాను. త్వరలో పూర్తిగా కోలుకుని, కోవిడ్19ను జయిస్తానని ఆశిస్తున్నాను.

Also Read: Pushpa Part 1, Part 2 titles: పుష్ప సినిమా పార్ట్ 1, పార్ట్ 2 కి వేర్వేరు టైటిల్స్

ప్రతి ఏడాది మీరు నా పుట్టినరోజున చూపే ప్రేమ, చేసే కార్యక్రమాలు ఆశీర్వచనంగా భావిస్తాను. కానీ ఈ ఏడాది మీరు ఇంటివద్దే ఉంటూ లాక్‌డౌన్, కర్ఫ్యూ నియమాలను పాటిస్తూ జాగ్రత్తగా ఉంటారని ఆశిస్తున్నాను. ఇదే ఈ ఏడాది మీరు నాకు ఇచ్చే అతిపెద్ద కానుక. దేశం కరోనాతో యుద్ధం చేస్తుంది. ఇది వేడుకలు (Jr NTR Birthday Celebrations) చేసుకునే సమయం కాదు. కనిపించని శత్రువుతో అలుపెరగని పోరాటం చేస్తున్న మన డాక్టర్లు, నర్సులు మరియు ఇతర ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు మనం సంఘీభావం తెలపాలి. ఎందరో తమ ప్రాణాలను, జీవనోపాధిని కోల్పోయారు ఆ కుటుంబాలకు కుదిరితే అండగా నిలవాలి.

Also Read: Bigg Boss Telugu 4: బిగ్‌బాస్ భామ Divi Vadthya క్యాబ్ స్టోరీస్ రిలీజ్ డేట్ వచ్చేసింది

మీ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోండి. మీరు జాగ్రత్తగా ఉండండి. ఒకరికి ఒకరు పరస్పరం సహాయం చేసుకుంటూ చేతనైన ఉపకారం చేయండి. త్వరలో మన దేశం ఈ కరోనా మహమ్మారిని జయిస్తుందని నమ్ముతున్నాను. ఆ రోజున మనం అందరం కలిసి వేడుక చేసుకుందాం. అప్పటివరకూ ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ముఖానికి మాస్క్ ధరించండి. జాగ్రత్తగా ఉండండి. నా విన్నపాన్ని మన్నిస్తారని ఆశిస్తున్నానంటూ’ టాలీవుడ్ (Tollywood) నటుడు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు విన్నపం చేశారు. 

Also Read: Ariana Grande Wedding: లవ్ మ్యారేజ్ చేసుకున్న పాప్ స్టార్ అరియానా గ్రాండే, హాలీవుడ్‌లో ట్రెండింగ్ 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News