Jr NTR: ఎన్టీఆర్ పెద్ద స్కెచ్.. బాలీవుడ్ లో హవా కొనసాగించనున్న తారక్

War 2 Update: రెండు తెలుగురాష్ట్రాల్లో కోట్లాదిమంది అభిమానులను గెలుచుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఇప్పుడు బాలీవుడ్ లో కూడా తన సత్తా చాటడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. బాలీవుడ్ లో పట్టు సాధించడంకోసం ఎన్టీఆర్ స్ట్రాటజీ ప్రకారం వెళుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.  

Written by - Vishnupriya Chowdhary | Last Updated : May 12, 2024, 08:20 PM IST
Jr NTR: ఎన్టీఆర్ పెద్ద స్కెచ్.. బాలీవుడ్ లో హవా కొనసాగించనున్న తారక్

Jr NTR Upcoming Hindi Movies : ఆర్ఆర్ఆర్ సినిమాతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేరు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాక ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగిపోతుంది. ఈ ఒక్క సినిమాతో ఎన్టీఆర్ కి ప్యాన్ ఇండియా స్టేటస్ వచ్చేసింది. ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమాల కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు కళ్ళు కాయలుకాచేలా ఎదురుచూస్తున్నారు. 

ప్రస్తుతం టాలీవుడ్ లో కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాతో బిజీగా ఉన్నారు తారక్. 300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాతో ప్యాన్ ఇండియా లెవెల్ లో ఎన్టీఆర్ మరొక బ్లాక్ బస్టర్ అందుకుంటారని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ సినిమాని పక్కన పెడితే, బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్న వార్ 2 సినిమాలో కూడా కీలకపాత్ర పోషిస్తున్నారు. 

ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలింస్ వారు ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. అయాన్ ముఖర్జీ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఇది కూడా పాన్ ఇండియా లెవెల్ లో విడుదలకి సిద్ధం అవుతుంది. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరొక భారీ బడ్జెట్ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 

అంతేకాకుండా ఎన్టీఆర్ సోలో హీరోగా ఎస్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ లోనే ఒక స్పై థ్రిల్లర్ సినిమా కూడా లైన్లో పెట్టినట్లు టాక్ వినిపిస్తోంది. సినిమాలతో పాటు తన ప్రమోషన్స్ కోసం ఎన్టీఆర్ బాలీవుడ్ లో ఒక ప్రత్యేకమైన ఏజెన్సీని నియమించుకున్నారట. 

ఎన్టీఆర్ కి సంబంధించిన కమర్షియల్ యాడ్స్, బాలీవుడ్ సినిమా ఆఫర్లు అన్నీ ఆ ఏజెన్సీ వారు చూసుకుంటున్నారట. బాలీవుడ్ లో కూడా మంచి పట్టు సాధించడానికి ఎన్టీఆర్ అక్కడ కూడా ప్లాన్ ప్రకారం ఏజెన్సీని నియమించుకున్నారని, త్వరలో ఎన్టీఆర్ బాలీవుడ్ లో కూడా స్టార్ హీరోగా అవ్వాలని అనుకుంటున్నారని తెలుస్తోంది. ఈ మూడు సినిమాలు మంచి హిట్లయితే ఎన్టీఆర్ కి మరిన్ని బాలీవుడ్ ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. మంచి కథలను కూడా ఎంపిక చేసుకుంటూ ముందుకు వెళ్తే ఎన్టీఆర్ బాలీవుడ్ లో కూడా తన బ్రాండ్ క్రియేట్ చేసుకునే అవకాశం లేకపోలేదు.

Also Read: IPL GT vs CSK: చెన్నైకి షాక్‌... గిల్‌, సాయి సుదర్శన్‌ భారీ సెంచరీలతో గుజరాత్‌కు అనూహ్య విజయం

Also Read: IPL SRH vs LSG: ఉప్పల్‌లో హైదరాబాద్‌ అదుర్స్‌.. 10 ఓవర్లలోనే 10 వికెట్ల తేడాతో తిరుగులేని విజయం

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News