Kalki Telugu Version 1st week Collectons: ప్రభాస్ ‘కల్కి’ ఫస్ట్ వీక్ తెలుగు వెర్షన్ కలెక్షన్స్.. మొత్తం వసూళ్లు ఎంతంటే.. !

Kalki Telugu Version 1st week Collectons: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘కల్కి 2898 AD’. గత నెల 27న విడుదలైన ఈ సినిమా నిన్నటితో బాక్సాఫీస్ దగ్గర మొదటి వారం పూర్తి చేసుకుంది. ఇప్పటికే పలు రికార్డులను తన పేరిట రాసుకున్న కల్కి మూవీ తెలుగు వెర్షన్ వసూళ్ల విషయానికొస్తే..

Written by - TA Kiran Kumar | Last Updated : Jul 4, 2024, 02:01 PM IST
Kalki Telugu Version 1st week Collectons: ప్రభాస్ ‘కల్కి’ ఫస్ట్ వీక్ తెలుగు వెర్షన్ కలెక్షన్స్.. మొత్తం వసూళ్లు ఎంతంటే.. !

Kalki Telugu Version 1st week Collectons: ప్రభాస్ హీరోగా వైజయంతి మూవీస్ పతాకంపై సి.అశ్వినీదత్ నిర్మాణంలో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కల్కి 2898 AD’. ఈ సినిమా తొలి రోజే పలు రికార్డులను నమోదు చేసింది. అంతేకాదు నిన్నటితో బాక్సాఫీస్ దగ్గర మొదటి వారం పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఫస్ట్ వీక్ ఓన్లీ తెలుగు వెర్షన్ ఎంత వసూళ్లు రాబట్టిందటే..

ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో మొదటి వారంలో దాదాపు రూ. 70 కోట్లకు పైగా షేర్ రాబట్టింది. మరోవైపు ఆంధ్ర ప్రదేశ్, రాయలసీమ లో కలిపి దాదాపు రూ. 70 కోట్ల షేర్ రాబట్టింది. మొత్తంగా రెండు తెలంగాణ, ఏపీల్లో ఓన్లీ తెలుగు వెర్షన్ కలిపి రూ. 140 కోట్ల షేర్ (రూ. 230 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు కర్ణాటక + మిగిలిన భారత్ లో తెలుగు వెర్షన్ లో దాదాపు రూ. 23 కోట్లకు షేర్ (రూ. 50 కోట్ల గ్రాస్) రాబట్టింది. ఓవర్సీస్  కల్కి తెలుగు వెర్షన్ రూ. 70 కోట్ల షేర్ (రూ. 120 కోట్ల గ్రాస్) వసూళ్లు..
మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా కల్కి తెలుగు వెర్షన్ కలిపి రూ. 233 కోట్ల షేర్ (రూ. 405 కోట్ల గ్రాస్) రాబట్టినట్టు ట్రేడ్ పండితులు చెబుతున్నారు.
 
తెలుగులో ఈ సినిమా రూ. 248 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. దాదాపు రూ. 250 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలో దిగిన ఈ సినిమా మరో రూ. 17 కోట్ల షేర్ రాబడితే హిట్ స్టేటస్ అందుకుంటుంది. '

ఇక ప్రపంచ వ్యాప్తంగా తమిళం, కన్నడ, హిందీ, మలయాళంతో పాటు ఓవర్సీస్ లో ఇతర భాషల్లో కలిపి దాదాపు రూ. 360 కోట్లకు పైగా షేర్ (రూ. 712 కోట్ల గ్రాస్) రాబట్టింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 370 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. రూ. 372 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలో దిగిన ‘కల్కి 2898 AD’ మరో రూ. 12 కోట్లు రాబడితే లాభాల్లోకి వస్తుంది. ఇప్పటికే ఓవర్సీస్ లో $14 మిలియన్ యూఎస్ డాలర్స్ కలెక్ట్ చేయడంతో పాటు.. హైదరాబాద్ ప్రసాద్ ఐమాక్స్ థియేటర్స్ లోనే ఈ సినిమా రూ. కోటి గ్రాస్ వసూళ్లను రాబట్టడం విశేషం. టోటల్ బిజినెస్ లో దాదాపు రూ. 94 శాతం రికవరీ పూర్తైయింది.  మొత్తంగా సెకండ్ వీక్ లో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏ మేరకు మాయ చేస్తుందో చూడాలి.

Read more: Lightning strikes: బాప్ రే.. వర్షంలో మైరచిపోయి యువతి రీల్స్ .. పక్కనే పిడుగు పాటు.. వీడియో వైరల్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News