indian 2 Shoot in Tirupati : తిరుపతిలో ఇండియన్ 2 షూటింగ్.. సిద్దార్థ్ ఎంట్రీ కూడా అక్కడే

indian 2 Movie Shoot ఇండియన్ 2 మూవీ షూటింగ్‌కు సంబంధించిన అప్డేట్ వచ్చింది. కమల్ హాసన్, శంకర్ తీస్తోన్న ఈ చిత్రం మీద నేషనల్ వైడ్‌గా అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. మధ్యలో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయి మళ్లీ ప్రారంభించిన సంగతి తెలిసిందే.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 21, 2023, 06:43 PM IST
  • కమల్ హాసన్ ఇండియన్ 2 అప్డేట్
  • తిరుపతిలో షెడ్యూల్ ప్లాన్ చేసిన శంకర్
  • తిరుపతిలో సిద్దార్థ్ ఎంట్రీ ఫిక్స్
indian 2 Shoot in Tirupati : తిరుపతిలో ఇండియన్ 2 షూటింగ్.. సిద్దార్థ్ ఎంట్రీ కూడా అక్కడే

Kamal Haasan indian 2 Movie Shoot శంకర్ తెరకెక్కించే సినిమాలు ఎంత గ్రాండియర్‌గా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే శంకర్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఎక్కువగా క్లిక్ అవ్వలేదు. కానీ శంకర్ సినిమాలకు ఉండే క్రేజ్ మాత్రం ఎప్పుడూ తగ్గలేదు. ఒకప్పుడు కమల్ హాసన్‌తో చేసిన ఇండియన్ సినిమా నేషనల్ వైడ్‌గా క్లిక్ అయింది. ఆ సినిమాకు సీక్వెల్ అంటూ ఇండియన్ 2ను కరోనా కంటే ముందు మొదలుపెట్టేశారు. కానీ సినిమా షూటింగ్ సమయంలో ప్రమాదం జరగడం, టెక్నీషియన్స్ చనిపోవడంతో సినిమాను పక్కన పెట్టేశారు.

ఆ తరువాత శంకర్ తెలుగులో సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు. దిల్ రాజు నిర్మాణంలో రామ్ చరణ్‌ హీరోగా శంకర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా దాదాపుగా పూర్తి కావొస్తుంది. ఇప్పుడు శంకర్ నెలలో సగం రోజులు రామ్ చరణ్ కోసం, కమల్ హాసన్ కోసం మిగిలిన సగం రోజులు కేటాయిస్తున్నాడు.

తాజాగా ఇండియన్ 2 మూవీ షూటింగ్‌ అప్డేట్ వచ్చింది. ఈ మూవీ షూటింగ్‌ను తిరుపతిలో ప్రారంభించారట. ఈ షెడ్యూల్‌లోనే సిద్దార్థ్ఎంట్రీ ఇవ్వబోతోన్నట్టుగా తెలుస్తోంది. ఈ చిత్రంలో కాజల్‌ అగర్వాల్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్లుగా నటిస్తున్న విషయం తెలిసిందే. లైకా ప్రొడక్షన్స్‌, రెడ్‌ జెయింట్‌ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. 

ఇప్పుడు కాస్త గ్యాప్ తరువాత ఈ చిత్రం షూటింగ్‌ను ప్రారంభించారు. ఈ సినిమాలోని కీలక సన్నివేశాలను ఆదివారం నుంచి తిరుపతి పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించనున్నారు. శంకర్ ఈ రెండు చిత్రాలను ఒకే సారి షూటింగ్ చేస్తుండటం, రెండు సినిమాలను పాన్ ఇండియన్‌ స్థాయిలోనే తెరకెక్కిస్తున్నాడు.

Also Read:  Pathaan Advance Booking : పఠాన్ మేనియా.. ఫస్ట్ డే ఎన్ని కోట్లంటే.. కింగ్ ఖాన్ కమ్ బ్యాక్ ఇచ్చినట్టేనా?

Also Read: Mahesh Babu Son : గౌతమ్ మొదటి సారి ఆ పని చేయబోతోన్నాడు.. నమ్రత పోస్ట్ వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News