Prabhas: సైఫ్‌ అలీఖాన్‌ ఫ్యామిలీకి బిర్యానీ పంపిణీ ప్రభాస్..థాంక్స్ చెప్పిన కరీనా

Prabhas: పాన్‌ఇండియా స్టార్‌ ప్రభాస్‌ బాలీవుడ్‌ స్టార్‌ హీరో సైఫ్‌ అలీఖాన్‌ ఇంటికి బిర్యానీ పంపించారు. దీనిపై స్పందించిన కరీనా..బాహుబలికి కృతజ్ఞతలు తెలిపింది.

Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 26, 2021, 04:00 PM IST
Prabhas:  సైఫ్‌ అలీఖాన్‌ ఫ్యామిలీకి బిర్యానీ పంపిణీ ప్రభాస్..థాంక్స్ చెప్పిన కరీనా

Prabhas:  బాలీవుడ్‌ స్టార్‌హీరో సైఫ్‌ అలీఖాన్‌ కుటుంబానికి పాన్‌ఇండియా స్టార్‌ ప్రభాస్‌ స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. ఈ విషయాన్ని తాజాగా కరీనాకపూర్‌ బయటపెట్టారు. ప్రభాస్ (Prabhas)కథానాయకుడిగా నటిస్తున్న ‘ఆదిపురుష్‌’ (Adipurush)సినిమాలో సైఫ్‌ అలీఖాన్‌ కీలకపాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే. 

ప్రస్తుతం ముంబయిలో ఉంటున్న ప్రభాస్‌ తాజాగా తన కోస్టార్‌ సైఫ్‌ కుటుంబానికి భోజనాన్ని పంపించారు. స్పెషల్‌గా బిర్యానీ, నాన్‌వెజ్‌ కర్రీ, ఖీర్‌ సిద్ధం చేయించి అందించారు. ప్రభాస్‌ చూపించిన అభిమానం పట్ల కరీనా ఆనందం వ్యక్తం చేశారు. ‘బాహుబలే బిర్యానీ పంపిస్తే.. అది ది బెస్ట్‌ ఫుడ్ అనే చెప్పాలి. రుచికరమైన భోజనాన్ని పంపించినందుకు థ్యాంక్యూ ప్రభాస్‌’ అని కరీనా(Kareena kapoor) పోస్ట్ పెట్టారు. సాధారణంగా ప్రభాస్‌ భోజన ప్రియుడనే విషయం అందరికీ తెలిసిందే. తనతో వర్క్‌ చేసే కోస్టార్స్‌కి ఆయన వివిధ రకాలైన వంటకాలను రుచి చూపిస్తుంటారు. ఇటీవల నటి భాగ్యశ్రీకి సైతం ప్రభాస్‌ పూతరేకులు గిఫ్ట్‌గా పంపించారు.

Also Read: Maha Samudram trailer: ప్రభాస్ మెచ్చిన మహా సముద్రం ట్రైలర్

ఇక ‘ఆదిపురుష్‌’ విషయానికి వస్తే.. బాలీవుడ్‌(Bollywood) దర్శకుడు ఓంరౌత్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రామాయణాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో.. సైఫ్‌(Saif Alikhan) రావణుడి పాత్రలో సందడి చేయనున్నారు. ప్రభాస్‌(Prabhas)కు జోడీగా సీతమ్మ పాత్రలో నటి కృతిసనన్‌ కనిపించనున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందనున్న ఈ సినిమా టీసిరీస్‌ బ్యానర్‌పై తెరకెక్కనుంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News