Karthi: ఎవరికైనా ఆ ఉద్దేశం ఉంటే.. నాని ఇంటికి వెళ్ళండి.. హీరో కార్తీ ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు..

Nani: స్వయంకృషితో తెలుగులో గొప్ప పేరు తెచ్చుకున్న హీరోల్లో నాని ఒకరు. సినిమాలలో క్లాప్ బాయ్ గా చేస్తూ ఆ తరువాత చిన్న చిన్న సినిమాలు చేస్తూ ప్రస్తుతం పాన్ ఇండియా హీరో లెవెల్ కి చేరుకున్నారు ఈ హీరో. అలాంటి నాని గురించి తమిళ హీరో కార్తీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నాయి. మరి ఆయన ఏమి అన్నారు ఒకసారి చూద్దాం..  

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 4, 2023, 10:41 AM IST
Karthi: ఎవరికైనా ఆ ఉద్దేశం ఉంటే.. నాని ఇంటికి వెళ్ళండి.. హీరో కార్తీ ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు..

Japan Pre-release event: తమిళ హీరో అయినా కానీ కార్తీకి తెలుగులో కూడా ఎంతోమంది అభిమానులు ఉన్నారు. అసలు కార్తీని తమిళ హీరో లాగా చూదరు మన తెలుగు ప్రేక్షకులు. ఆవారా సినిమా నుంచి తెలుగులో స్టార్ హీరోగా మారిన కార్తీ.. ఈ మధ్య వరస విజయాలతో దూసుకుపోతున్నారు. ఖైదీ, సర్దార్ లాంటి సినిమాలతో సూపర్ హిట్లు అందుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆయన నవంబర్ 10వ తేదీన జపాన్ సినిమాతో మరోసారి ప్రేక్షకులను అల్లరించడానికి సిద్ధమైపోయారు.

కార్తీ 25వ సినిమా గా వస్తున్న ఈ చిత్రాన్ని రాజు మురుగన్ దర్శకత్వం వహించగా, డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్ ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు నిర్మించారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం సమకూర్చారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు చిత్ర మేకర్స్. ఈ ఈవెంట్‌కు నేచురల్ స్టార్ నాని ముఖ్య అతిథిగా విచ్చేశారు.

ఈ ఈవెంట్ లో నాని గురించి మాట్లాడుతూ కార్తీ ఆయన పైన ప్రశంసల జల్లు కురిపించారు. ఈ ఈవెంట్‌లో కార్తి మాట్లాడుతూ.. 'హైదరాబాద్ వస్తే అందరూ ఖైదీ 2 ఎప్పుడు అని అడుగుతున్నారు ఈ సినిమా త్వరలోనే ప్రారంభం అవుతుంది' అని తెలియజేశారు. ఆ తరువాత ఈ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా వచ్చిన నాని గురించి మాట్లాడుతూ ‘మనం ఎక్కడి నుంచి మొదలవుతాము అనేది ముఖ్యం కాదు. నిజాయతీగా పనిచేసి మన ప్రతిభను పెంచుకుంటూ వెళ్తే ఎంత ఎత్తుకైనా ఎదగొచ్చి. ఇది చెప్పడానికి నాని మొదట ఉదాహరణ. ఒక అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ మొదలుపెట్టి.. ఎన్నో వైవిధ్యమైన క్యారెక్టర్లు చేసి.. కొత్త కొత్త డైరెక్టర్లను ప్రోత్సహించారు. ఎంతో మంది ప్రతిభావంతులను వెలుగులోకి తీసుకొచ్చారు. అంతేకాదు ఇదే నాని అనుకున్న ప్రతిసారి డిఫరెంట్‌గా వేరే సినిమా చేసి మనకు మళ్లీ ఆయనలోని మరో కోణాన్ని చూపిస్తారు. ఆయన ప్రతి సినిమా ఒక సర్ప్రైజ్. శ్యామ్ సింగ రాయ్ కానీ, దసరా కానీ.. అసలు దసరాలో నానీ ఏం చేశారు! అలా ఆయన్ని నేనెప్పుడూ చూడలేదు. ఆ సినిమాలో ఆయన ఎంతో అద్భుతంగా నటించాడు

ఏ దర్శకుడు అయినా సరే..ఒక కొత్త స్క్రిప్ట్ ఉంది.. .. కానీ డిఫరెంట్‌గా ఉంది అంటే.. ఒక డోర్ ఉంది.. అది నాని ఇల్లు.. స్క్రిప్ట్ తీసుకొని అక్కడికి వెళ్లొచ్చు.. మీ కోసం తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి’ అని కొత్త టాలెంట్‌ను నాని ఎంకరేజ్ చేసే తీరును చెప్పుకొచ్చారు హీరో కార్తి. అంతేకాదు తనకు నానికి ఎన్నో పోలికలు ఉన్నాయి అని.. నానీ గురించి ఎంతసేపైనా మాట్లాడగలనని చెప్పుకొచ్చారు ఈ హీరో.

కాగా నాని సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈ హీరో ప్రస్తుతం హాయ్ నాన్న సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రంలో సీతా రామమ్ తో మనల్ని మెష్మ రైస్ చేసిన మృనాల్ ఠాకూర్ హీరోయిన్ గా చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది.

Also Read: Lava Blaze 2 5G Price: Lava నుంచి మార్కెట్‌లో అరుదైన మొబైల్‌..ఫీచర్స్‌ చూస్తే ఆశ్చర్యపోతారు!

Also Read: Zebronics Juke Bar 9750 Pro: డెడ్‌ చీప్‌ ధరకే JBL సౌండ్‌ బార్‌ను మించిన Zebronics Juke బార్‌..ధర, ఫీచర్స్‌ వివరాలు ఇవే!  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News