KA Collections: కిరణ్ అబ్బవరం క మొదటి రోజు కలెక్షన్స్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Kiran Abbavaram KA collections Day 1: రాజు వారు రాణి వారు.. చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరో కిరణ్ అబ్బవరం. ఇక తన మొదటి సినిమాలో చేసిన హీరోయిన్ ని ఈమధ్య పెళ్లి చేసుకున్నారు ఈ హీరో. కాగా పెళ్లయిన తరువాత కిరణ్ అమ్మవరం నటించిన మొదటి చిత్రం క. దీపావళి సందర్భంగా అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది ఈ చిత్రం. మరి ఈ సినిమా కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. 

Written by - Vishnupriya | Last Updated : Nov 1, 2024, 12:56 PM IST
KA Collections: కిరణ్ అబ్బవరం క మొదటి రోజు కలెక్షన్స్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Kiran Abbavaram KA day 1 collections: కిరణ్ అబ్బవరం గురించి.. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. హిట్లు..ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నారు ఈ హీరో.  ఇక ఈ మధ్యనే ఈ హీరో తన మొదటి సినిమా హీరోయిన్ ని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా కిరణ్ అబ్బవరం పెళ్లి తర్వాత వచ్చిన మొదటి చిత్రం క. దీపావళి సందర్భంగా ఈ సినిమా అక్టోబర్ 31వ విడుదలైంది. 

Add Zee News as a Preferred Source

పీరియాడిక్ థ్రిల్లర్ మూవీ క.. డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తోంది అని ఈ సినిమా విడుదల ముందు నుంచే ప్రచారం సాగింది. ఇక ఆ తర్వాత విడుదలైన ఈ చిత్రం  ట్రైలర్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో.. ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ చిత్రంలో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్స్‌గా నటించారు. దర్శక ద్వయం సుజీత్, సందీప్ ఈ మూవీని విలేజ్ బ్యాక్ డ్రాప్ తో.. ఆధ్యాంతం సస్పెన్స్ తో సాగే యాక్షన్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కించారు. శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై.. ఈ సినిమాని గోపాలకృష్ణ రెడ్డి నిర్మించారు. 

ఈ సినిమా దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్, శివ కార్తికేయన్ అమరన్ సినిమాలతో పోటీపడింది. అయితే ఈ సినిమాకి ప్రీ బుకింగ్ తక్కువగా జరిగినప్పటికీ.. సినిమా విడుదలైన తరువాత మంచి టాక్ రావడంతో.. కలెక్షన్స్ పరంగా ప్రస్తుతం దూసుకుపోతోంది.
ఈ చిత్రం ఎవరూ ఊహించని విధంగా కలెక్షన్లు వసూల్ చేసింది. ముఖ్యంగా ఈ సినిమా కిరణ్ అబ్బవరం కెరియర్ లోనే.. బిగ్గెస్ట్ హిట్ అయ్యేలా కనిపిస్తోంది. 

ఇక ఈ సినిమా ఆకుపెన్సి విషయానికి వస్తే.. మొదటిరోజు మార్నింగ్ షో 54%, మధ్యాహ్నం షో 75%, సాయంత్రం షో 62%, నైట్ షో 75% ఆక్యుపెన్సీ సాధించింది. మరో పక్క కలెక్షన్స్ పరంగా.. ఈ చిత్రం మొదటి రోజు రూ. 3.8 కోట్ల కలెక్షన్లు అందుకుంది అని తెలుస్తోంది. ఓ వైపు పండుగ, మరోవైపు.. వరుసగా హలీడేస్ ఉండటంతో.. ఇక రెండు మూడు రోజుల వరకు ఈ చిత్రం ఇలానే మంచి కలెక్షన్ సాధించేలా కనిపిస్తోంది.

 

Also Read: Viral Video: ఇదేక్కడి న్యాయం..?.. కండక్టర్ డ్యాన్స్‌కు మంత్రి ఫిదా.. ఉద్యోగం ఊడగొట్టిన ఏపీఎస్ఆర్టీసీ..స్టోరీ ఏంటంటే..?

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Vishnupriya

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.

...Read More

Trending News