Kiran Abbavaram Meter : రవితేజతో పోటీ అవసరమా?.. కిరణ్‌ అబ్బవరంను నిలదీసిన నెటిజన్

Meter Release Date కిరణ్ అబ్బవరం ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. రెండు నెలల క్రితమే ఓ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. మళ్లీ ఇప్పుడు మరో సినిమాతో రెడీ అయ్యాడు. మీటర్ సినిమా రేపు విడుదల కాబోతోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 6, 2023, 09:58 AM IST
  • ఈ వారం బాక్సాఫీస్ వద్ద సందడి
  • మీటర్‌తో కిరణ్ అబ్బవరం
  • రావణాసురతో రవితేజ రెడీ
Kiran Abbavaram Meter : రవితేజతో పోటీ అవసరమా?.. కిరణ్‌ అబ్బవరంను నిలదీసిన నెటిజన్

Kiran Abbavaram Meter కిరణ్ అబ్బవరం రేపు (ఏప్రిల్ 7) మీటర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నాడు. రవితేజ తన రావణాసురుడు సినిమాతోనూ రంగంలోకి దిగబోతోన్నాడు. అయితే ఈ రెండు సినిమాలకు పోటీ అని కూడా అనలేం. ఎందుకంటే రవితేజ స్థాయి, స్టామినా వేరు.. కిరణ్‌ అబ్బవరం అంటే నిన్నా మొన్నా వచ్చిన హీరో. ఈ ఇద్దరి చిత్రాల మధ్య పోటీ అని కూడా అనలేం. ఇదే విషయాన్ని నెటిజన్లు కూడా అడిగేశారు.

మీటర్‌ సినిమాను కిరణ్ అబ్బవరం తన భుజానికి ఎత్తుకుని ప్రమోషన్స్ చేస్తూనే ఉన్నాడు. ఈక్రమంలోనే ట్విట్టర్‌లో చిట్ చాట్ ప్రోగ్రాంను పెట్టాడు. నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ వెళ్లాడు. రవితేజ ఫ్యాన్స్ సైతం కిరణ్ అబ్బవరంకు ఆల్ ది బెస్ట్ తెలిపారు. అయితే కొందరు మాత్రం నీకు పోటీ అవసరమా? పోటీగా దిగుతున్నావా? అని అడిగేశారు.

రవితేజ సినిమాకు పోటీగా దించుతున్నావా? అని ఓ నెటిజన్ అడిగితే.. కాదు అని రిప్లై ఇచ్చాడు. రవితేజతో నీకు అవసరమా? అని మరో నెటిజన్ నిలదీస్తే.. అనుకోకుండా ఇది జరిగింది.. నేను కూడా ఇది ఊహించలేదు అని అన్నాడు కిరణ్ అబ్బవరం.

కిరణ్‌ అబ్బవరం మీద నెటిజన్లు జోకులు వేస్తూనే వస్తున్నారు. ఈ ఏడాది ఇంకో పది సినిమాలు రిలీజ్ చేస్తావా? అని అడిగారు. లేదు బ్రో.. ఏడాదికి మూడు సినిమాలు చేయగలనంతే అని కిరణ్ రిప్లై ఇచ్చాడు. ఇందులోనూ పీకే రిఫరెన్స్‌ ఉంటుందా? అని అడిగితే.. ఉంటుంది అని ఆన్సర్ చెప్పాడు. రామ్ చరణ్‌తో ఈవెంట్‌ ఏదో ప్లాన్ చేసినట్టున్నారు.. కానీ అది మిస్ అయిందట. అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు పిలుద్దామని అనుకున్నారేమో గానీ.. రామ్ చరణ్‌, ఉపాసనలు ఇద్దరూ కూడా దుబాయ్‌కి వెళ్లిన సంగతి తెలిసిందే.

Also Read:  Devi Sri Prasad Marriage : ఇన్నాళ్లకు పెళ్లి చేసుకోబోతోన్న దేవీ శ్రీ ప్రసాద్.. ఎంత ఏజ్ గ్యాప్ అంటే?

Also Read: Samantha Ruth Prabhu : నాగ చైతన్య అంటే మరీ అంత ద్వేషమా?.. అతడికి ఐలవ్యూ చెప్పిన సమంత

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News