Shyamala Devi About Venu Swamy: నాగచైతన్య, సమంత విడాకులు తీసుకుంటారు అని చెప్పి.. అది నిజమైన దగ్గర నుంచి ఫేమస్ అవ్వ సాగారు వేణు స్వామి. దానికి తగ్గట్టే ఆ తరువాత రష్మిక మందాన, నిధి అగర్వాల్ లాంటి హీరోయిన్స్ దగ్గర పూజలు చేయిస్తూ ఈ జ్యోతిష్కుడు కనిపించడంతో సోషల్ మీడియాలో మరింత పాపులారిటీ తెచ్చుకున్నారు. ఏదో లక్కుకొద్ది ఈయన చెప్పిన కొన్ని మాటలు నిజంగానే నిజం అవుతూ వచ్చాయి. దాంతో ఈయన ఆ తరువాత ఎన్నో జరగని విషయాలు చెప్పినా.. జరిగిన విషయాల గురించే కొన్ని సోషల్ మీడియా పేజెస్ షేర్ చేస్తూ ఆయన్ని ఫేమస్ చేశాయి.
ఈ నేపథ్యంలో వేణు స్వామి ఎక్కువగా ప్రభాస్ మీద నెగిటివ్ జాతకం చెబుతూ మరింత ఫేమస్ అయ్యాడు. ప్రభాస్ కి అసలు సూపర్ హిట్లు రావు అని ప్రభాస్ ని నమ్ముకున్న ప్రొడ్యూసర్లు నాశనం అయిపోతారు అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. అంతేకాదు ఆయనకు పెళ్లవ్వదని పెళ్లి అయినా విడిపోతారని చెప్పుకొచ్చారు. ఇక ఇవే కాకుండా ప్రభాస్ ఆరోగ్యం కూడా సరిగా ఉండదు అంటూ తన నోటికి వచ్చిన వ్యాఖ్యలు అన్నీ చేశారు ఈ జ్యోతిష్కుడు.
ఈ విషయాల గురించి ప్రభాస్ ఫ్యాన్స్ తీవ్రంగా నిరసన వ్యక్తం చేసిన ప్రభాస్ ఎప్పుడు స్పందించలేదు. ఈ నేపథ్యంలో ఆయన మీద మందిపడ్డారూ ప్రభాస్ పెద్దమ్మ, కృష్ణంరాజు గారి భార్య శ్యామలాదేవి.
సలార్ రిలీజ్ తరువాత వేణు స్వామిని ప్రభాస్ అభిమానులు తీవ్రంగా విమర్శించిన సంగతి తెలిసిందే. ప్రభాస్ సినిమాలు హిట్టవ్వవు అని అన్నారుగా.. మరి ఇదేంటి? అంటూ అంతా నిలదీశారు. ఇక ఇప్పుడు ఆయన ప్రభాస్ ఆరోగ్యం గురించి పెళ్లి గురించి చేసిన వ్యాఖ్యలపై అసహనం వ్యక్తం చేశారు శ్యామలాదేవి.
‘ప్రభాస్ జాతకం వాళ్ల అమ్మకి మాత్రమే తెలుసు.. మాక్కూడా తెలియదు.. అలాంటి వేణు స్వామికి ఎలా తెలుస్తుంది? ఆయన చెప్పేది అంతా అవాస్తవమే.. అవన్నీ అసత్యాలే.. ఆయన చెప్పే మాటలు మాకు బాధను కలిగిస్తున్నాయి.. ఎవ్వరూ కూడా వాటిని నమ్మాల్సిన పని లేదు’ అని శ్యామలా దేవీ చెప్పుకొచ్చాడు.
కృష్ణం రాజు జయంతి సందర్భంగా మొగల్తూరులో వైద్య శిబిరం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో శ్యామలా దేవీ మీడియా ముందుకు వచ్చి.. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇక ఇంటర్వ్యూలో వేణు స్వామి గురించి ఈ వ్యాఖ్యలు చేశారు శ్యామలాదేవి.
Slipper shot to venu Swamy pic.twitter.com/qjLq0YjyxG
— Venky (@VenkyDHFPB) January 23, 2024
Also Read: Bike Buys with Coins: పూజారి "చిల్లర ప్రేమ" కథ వినండి.. వీరి ప్రేమకు ఫిదా అవ్వాల్సిందే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook