KTR Counter to Gangavva: మహేష్ బాబులా ఉన్నారన్న గంగవ్వ... కళ్లు చూపించుకో మహేష్ ఫీలవుతాడు అంటూ కేటీఆర్ కౌంటర్!

KTR Interesting Comments on Gangavva : తనను మహేష్ బాబులా ఉన్నారని కామెంట్ చేసిన గంగవ్వపై కేటీఆర్ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. ఆ వివరాల్లోకి వెళితే 

Written by - Chaganti Bhargav | Last Updated : Oct 3, 2022, 01:54 PM IST
  • మహేష్ బాబులా ఉన్నారన్న గంగవ్వ...
  • కళ్లు చూపించుకో మహేష్ ఫీలవుతాడు అంటూ కేటీఆర్ కౌంటర్
  • కరీంనగర్ కళోత్సవాలలో ఆసక్తికర ఘటన
KTR Counter to Gangavva: మహేష్ బాబులా ఉన్నారన్న గంగవ్వ... కళ్లు చూపించుకో మహేష్ ఫీలవుతాడు అంటూ కేటీఆర్ కౌంటర్!

KTR Interesting Comments on Gangavva Who called him looking like Mahesh Babu: సోషల్ మీడియాలో మై విలేజ్ షో ద్వారా పాపులారిటీ దక్కించుకున్న గంగవ్వ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సుమారు 60 ఏళ్ల వయసులో కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ తెచ్చుకోవడమే కాక ఏకంగా బిగ్ బాస్ లో పాల్గొనే అవకాశం కూడా దక్కించుకొని అలరించింది. అయితే తాజాగా గంగవ్వ కేటీఆర్ ను మహేష్ బాబు అంటూ కామెంట్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ మారింది. అసలు విషయం ఏమిటంటే కరీంనగర్ కళోత్సవాలు పేరుతో కరీంనగర్ లో ఒక భారీ ఈవెంట్ నిర్వహించారు. అంబేద్కర్ స్టేడియం వేదికగా మూడు రోజులుగా ఈ కళోత్సవాలు ఘనంగా జరిగాయి.

కళోత్సవాలు  ఆఖరు రోజున అంటే ఆదివారం నాడు నిర్వహించిన కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. వీరు కాకుండా కరీంనగర్ జిల్లాకు చెందిన అనేక మంది ప్రజా ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. వీరు కాకుండా సినీ పరిశ్రమ నుంచి నటుడు- మిమిక్రీ ఆర్టిస్ట్ శివారెడ్డి, సింగర్ మధుప్రియ, వందేమాతరం శ్రీనివాస్, యూట్యూబర్ అనిల్ జీల, జబర్దస్త్ కొమురక్క, బిగ్ బాస్ సోహెల్ వంటి వారు కూడా హాజరయ్యారు.

అయితే ఈ సభ సందర్భంగా గంగవ్వ కేటీఆర్ మహేష్ బాబులా ఉన్నాడు అంటూ ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది. ఆ తర్వాత మైక్ అందుకున్న కేటీఆర్ ఈ కళోత్సవాలలో గొప్ప గొప్ప కళాకారులను నేరుగా కలిసే అవకాశం దొరికిందని చెప్పుకొచ్చారు. గ్రామీణ ప్రాంతానికి చెందిన గంగవ్వ ఈ వయసులో కూడా తన ప్రజలతో మంచి గుర్తింపు తెచ్చుకుందని ఆయన పేర్కొన్నారు. అంతేకాక గంగవ్వను  ప్రత్యేకంగా వేదికపై పిలిపించుకొని నవ్వుతూ మాట్లాడుతూ నన్ను మహేష్ బాబు లాగా ఉన్నావు అని అన్నావు కానీ నాకేం ప్రాబ్లం లేదు అయితే ఈ మాట వింటే మహేష్ బాబు ఫీలవుతారు అంటూ సరదాగా కామెంట్ చేశారు.  

నన్ను చూసి మహేష్ బాబు అంటున్నావ్ అంటే నువ్వు కళ్ళు చెక్ చేయించుకోవాలి అంటూ కామెంట్ చేసి అక్కడ ఒకసారిగా వాతావరణం తేలికపరిచే ప్రయత్నం చేశారు. అంతేకాక నేను మీకు మాట ఇచ్చిన విధంగానే మై విలేజ్ షోలో కచ్చితంగా పాల్గొంటానని, నాలుగు మంచి విషయాలు నేర్చుకోవడమే గాక నాకు తెలిసిన నాలుగు మంచి విషయాలు అందరికీ చెబుతానని చెప్పకొచ్చారు. అలాగే గంగవ్వను ఎప్పుడూ యూట్యూబ్ వీడియోలలో సినిమాలలో చూడడమే కానీ నేరుగా కలవడం ఇదే మొదటిసారి అని కేటీఆర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. మొత్తం మీద కేటీఆర్ మహేష్ బాబు కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి అని చెప్పక తప్పదు.

Also Read: Dasara 2022 Movies Ticket Rates: దసరాకు గాడ్ ఫాదర్, ది ఘోస్ట్. స్వాతి ముత్యం.. టికెట్ రేట్లు ఇవే!

Also Read: Bandla Ganesh on TV Channel: ఛానల్ పై ఓపెన్ కామెంట్స్.. అడుక్కుతింటున్నారా? అంటూ ఘాటు కౌంటర్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter Facebook

Trending News