Lakshmi Parvathi Comments on Jr NTR: ఎలా అయినా వచ్చే ఎన్నికల్లో గెలిచి తీరాలని తెలుగుదేశం పార్టీ అనేక ప్రయత్నాలు చేస్తోంది, 2024 ఎన్నికల్లో గెలిచి మరోసారి అధికారంలోకి రావాలని జగన్ భావిస్తుంటే ఇదే తనకు చివరి అవకాశం అని చెబుతూ చంద్రబాబు ఎన్నికల్లో దిగుతున్నారు. అయితే టీడీపీలోని ఒక వర్గం మాత్రం జూనియర్ ఎన్టీఆర్ వచ్చే వరకు పార్టీకి ఇబ్బందే అనే ఉద్దేశంలో ఉన్నారు. అయితే అలాంటి వారి కోసం ఇప్పుడు లక్ష్మీపార్వతి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.
తాజాగా గుంటూరులో మీడియాతో మాట్లాడిన లక్ష్మీపార్వతి తెలుగుదేశం పార్టీలోకి జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడా వచ్చినా లాభం లేదని కామెంట్ చేశారు. ప్రస్తుతానికి చాలా లేట్ అయిందని జగన్ లాగా ప్రజల్లో ఉంటే ఐదేళ్ల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కి అవకాశం ఉండవచ్చు అని ఆమె కామెంట్ చేశారు. నిజానికి జూనియర్ ఎన్టీఆర్ 2009 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ కోసం ప్రచారం చేశారు. అప్పట్లో ఉమ్మడి రాష్ట్రం కావడంతో దాదాపు 294 నియోజకవర్గాలకు ఆయన ప్రచారం చేయడానికి ప్రయత్నించారు. అయితే రోడ్డు ప్రమాదం కావడంతో ఆయన మళ్ళీ ప్రచారానికి దూరమయ్యారు. తర్వాత తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో ఓడిపోవడంతో ఆయన మళ్ళి రాజకీయాల వైపు ఆసక్తి చూపించలేదు.
రాష్ట్ర విభజన నేపథ్యంలో 2014లో తెలుగుదేశం పార్టీ ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత మధ్య మధ్యలో జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశాన్ని హస్తగతం చేసుకోవాలి అంటూ ఆయన అభిమానులు అప్పుడప్పుడు కామెంట్లు చేస్తూ వచ్చారు. గతంలో ఎన్టీఆర్ అభిమానులుగా చెప్పుకుని పార్టీలో ఉన్న కొడాలి నాని వంటి వారు పార్టీ బయటకు వెళ్లాక ఇదే రకమైన డిమాండ్ చేస్తూ వచ్చారు. మధ్య మధ్యలో నందమూరి లక్ష్మీపార్వతి కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు ఆమె స్వయంగా ఎన్టీఆర్ వచ్చినా లాభం లేదని కామెంట్ చేయడం ఆసక్తికరంగా మారింది. ఇక తాజా ప్రెస్ మీట్ లో లక్ష్మీపార్వతి మాట్లాడుతూ వివేకానంద రెడ్డి హత్య కేసులో విచారణ చేస్తున్న సీబీఐ అధికారులు టిడిపి మద్దతుదారులుగా ఉన్నారని కామెంట్స్ చేశారు.
ఇక కోటంరెడ్డి ప్రస్తావన తీసుకు వచ్చిన ఆమె ఎన్నికల ముందు అసమ్మతులు ఉండడం సాధారణమని వైసీపీ ఎమ్మెల్యేగా ఉండి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలుగుదేశం పార్టీతో సంబంధం పెట్టుకున్నాడని ఆమె విమర్శించారు. రాజధాని రైతుల పేరుతో టీడీపీ చేయించిన పాదయాత్రకు కోటంరెడ్డి సాయం చేశారని అది జగన్ కు ఆయన చేసిన నమ్మక ద్రోహం కాదా అని ఆమె ప్రశ్నించారు. ఇక నారా లోకేష్ పాదయాత్ర నవ్వులాటలా ఉందని కామెంట్ చేసిన లక్ష్మీపార్వతి నారా లోకేష్ రాజకీయ నాయకుడు కాలేడని సరిగ్గా మాట్లాడటం తెలియని వ్యక్తి ప్రజలను ఎలా పాలిస్తాడని ప్రశ్నించారు. ఈ సారి అన్ని పార్టీలు కలిసి గుంపుగా వచ్చినా జగన్ ఒంటరిగానే పోటీ చేస్తాడని ప్రజల ఆశీస్సులతో మళ్ళీ గెలుస్తాడని ఆమె జోస్యం చెప్పారు. ఇక ప్రస్తుతానికి నందమూరి లక్ష్మీపార్వతి తెలుగు అకాడమీ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. ఏపీకి సంబంధించి ఆమె ఈ బాధ్యతలు ప్రస్తుతానికి నిర్వర్తిస్తున్నారు. జగన్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న ఆమెను వైసీపీ నాయకురాలుగానే ప్రస్తుతానికి సంబోధిస్తున్నారు.
Also Read: Butta Bomma Movie Review: అనిఖా సురేంద్రన్- అర్జున్ దాస్ 'బుట్టబొమ్మ' రివ్యూ... హిట్ కొట్టారా?
Also Read: NTR 30 Update : డెడ్ లైన్ పెట్టిన ఎన్టీఆర్.. సిద్దంగా ఉన్న కొరటాల
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.