దర్శకుడు దశరథ్ చేతుల మీదుగా విడుదలైన 'సందేహం' మూవీ 'చచ్చినా చావని ప్రేమిది' లిరికల్ సాంగ్

కుమారి 21f సినిమాతో మంచి మార్కులు కొట్టేసింది హీరోయిన్ హెబ్బా పటేల్. ఇపుడు మరో త్రిల్లర్ సినిమాతో ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. సుమన్ వూటుకూరు హీరోగా ఊరికి ఉత్తరాన సినిమా ఫేమ్ సతీష్ పరమవేద దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 29, 2023, 02:58 PM IST
దర్శకుడు దశరథ్ చేతుల మీదుగా విడుదలైన 'సందేహం' మూవీ 'చచ్చినా చావని ప్రేమిది' లిరికల్ సాంగ్

విష్ణు వర్షిణి క్రియేషన్స్ బ్యానర్ పై హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా 'సందేహం'. 'షి బిలీవ్డ్' అనేది ట్యాగ్ లైన్. సత్యనారాయణ పర్చా నిర్మాతగా లవ్ అండ్ ఎంగేజింగ్ థ్రిల్లర్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఊరికి ఉత్తరాన సినిమా ఫేమ్ సతీష్ పరమవేద దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో సుమన్ వూటుకూరు హీరోగా నటిస్తున్నారు.

ప్ర‌స్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటోంది.  ఈ సినిమా నుంచి మేక‌ర్స్ 'చచ్చినా చావని ప్రేమిది' అనే లిరిక‌ల్ సాంగ్ రిలీజ్ చేశారు. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ద‌శ‌ర‌థ్ చేతుల మీదుగా ఈ పాట రిలీజైంది. ఈ కార్య‌క్ర‌మంలో ద‌శ‌రథ్‌తో పాటు మ‌న చౌద‌రి, చిత్ర యూనిట్ త‌దిత‌రులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ..

డైరెక్ట‌ర్ ద‌శ‌ర‌థ్ మాట్లాడుతూ.. 'డైరెక్టర్ సతీష్ పరమదేవగారితో చాలా కాలంగా మంచి అనుబంధం ఉంది. ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో రానున్న 'సందేహం' మూవీ లిరిక‌ల్ సాంగ్‌ను విడుద‌ల చేయ‌టం చాలా హ్యాపీగా ఉంది. పూర్ణాచారిగారు పాట‌ను అద్భుతంగా రాశారు. పాట వింటుంటే చాలా క్యాచీగా ఉంది. నిర్మాత స‌త్య‌నారాయ‌ణ‌గారు, హీరో సుమ‌న్‌, హెబ్బా ప‌టేల్ ఎంటైర్ టీమ్‌కు అభినంద‌న‌లు' అన్నారు. 

Also Read: Facebook Love: ఎల్లలు దాటిన ప్రేమ.. ఫేస్‌బుక్‌లో ప్రేమ.. శ్రీలంక నుంచి ఏపీకి వచ్చిన యువతి  

మ‌న చౌదరి మాట్లాడుతూ.. 'సందేహం' సినిమా నుంచి రిలీజైన 'చచ్చినా చావని ప్రేమిది' పాట చాలా బావుంది. ఈ సినిమా ఓపెనింగ్ నుంచి నాకు తెలుసు. ఎంటైర్ టీమ్ ఎంతో క‌ష్ట‌ప‌డి అనుకున్న స‌మ‌యంలో సినిమాను పూర్తి చేశారు. సినిమా మంచి విజ‌యాన్ని సాధించాల‌ని మ‌నస్ఫూర్తిగా కోరుకుంటున్నాను' అన్నారు. 

సుభాష్ ఆనంద్ సంగీతం అందిస్తోన్న ఈ పాట‌ను పూర్ణాచారి రాశారు. ఈ సినిమాలో గతంలో ఎప్పుడూ చూడని డిఫరెంట్ పాత్ర పోషిస్తోంది హెబ్బా పటేల్.   శ్వేతా వర్మ, రాశిక శెట్టి, శుభ శ్రీ రాయగురు, శ్రీనివాస్ భోగిరెడ్డి, సుందర్ రావు పర్చా, చంద్రశేఖర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రవీణ్ వనమాలి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా సురేష్ దుర్గం ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Also Read: Bandi Sanjay: లోక్‌సభ ఎన్నికలకు బీజేపీ టీమ్ రెడీ.. బండి సంజయ్‌కు ప్రమోషన్  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News