Mahesh Babu: యాడ్ ఫిల్మ్ చిత్రీకరణలో మహేష్ బాబు

కరోనావైరస్ ( Coronavirus ) వల్ల ప్రపంచం మొత్తం లాక్ డౌన్ ( Lockdown ) మోడ్ లోకి వెళ్లిపోయింది.

Last Updated : Sep 9, 2020, 07:36 PM IST
    • కరోనావైరస్ ( Coronavirus ) వల్ల ప్రపంచం మొత్తం లాక్ డౌన్ ( Lockdown ) మోడ్ లోకి వెళ్లిపోయింది.
    • సినిమా, సీరియల్స్ షూటింగ్స్ ఎక్కడికి అక్కడే నిలిచిపోయాయి.
    • అయితే ఇటీవలే కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు పాటించి షూటింగ్స్ మొదలు పెట్టవచ్చు అని చెప్పింది.
Mahesh Babu: యాడ్ ఫిల్మ్ చిత్రీకరణలో మహేష్ బాబు

కరోనావైరస్ ( Coronavirus ) వల్ల ప్రపంచం మొత్తం లాక్ డౌన్ ( Lockdown ) మోడ్ లోకి వెళ్లిపోయింది. సినిమా, సీరియల్స్ షూటింగ్స్ ఎక్కడికి అక్కడే నిలిచిపోయాయి. అయితే ఇటీవలే కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు పాటించి షూటింగ్స్ మొదలు పెట్టవచ్చు అని చెప్పింది. దాంతో మళ్లీ పలు సినిమాలు షూటింగ్ మొదలు పెట్టాయి.

తాజాగా ప్రిన్స్ మహేష్ బాబు ( Mahesh Babu ) కూడా షూటింగ్ మోడ్ లోకి వెళ్లిపోయాడు. అయితే ఇది సినిమా షూట్ కాదు.. ఒక వాణిజ్య ప్రకటన షూటింగ్. గురువారం రోజు ఈ యాడ్ ఫిలిం షూటింగ్ జరగనుండగా సెట్స్ పైకి వెళ్లాడు ప్రిన్స్.

అన్నపూర్ణ స్టూడియోలో ( Annapurna Studios ) జరగనున్న ఈ యాడ్ ఫిలిం ( Ad Film ) షూటింగ్ ఎలా జరగనుంది.. ఎలాంటి ఏర్పాట్లు చేశారో కనుక్కోవడానికి నిర్వహకులతో మాట్లాడారు మహేష్.

షూటింగ్ లొకేషన్ లో కరోనా వ్యాప్తిని నివారించేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు నిర్వాహకులు తెలిపారు. చిత్రీకరణ సిబ్బంది పీపీఈ కిట్లు ( PPE Kits ) ధరించడం చిత్రంలో చూడవచ్చు. ఈ ఫోటోను మహేష్ బాబు టీమ్ ట్విట్టర్ ఎకౌంట్ లో పోస్ట్ చేసింది.

Trending News