Mammootty - Bramayugam: బ్లాక్ అండ్ వైట్‌లో మమ్ముట్టి కొత్త ప్రయోగం.. ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోన్న 'భ్రమయుగం' ట్రైలర్..

Mammootty - Bramayugam: మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. ఓ వైపు కమర్షియలు సినిమాలు.. మరోవైపు ప్రయోగాత్మక చిత్రాలతో తన కెరీర్‌ను లీడ్ చేస్తున్నారు. తాజాగా ఈయన బ్లాక్ అండ్ వైట్‌లో 'భ్రమయుగం' అంటూ కొత్త సినిమాతో పలకరించబోతున్నారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Feb 11, 2024, 11:57 AM IST
Mammootty - Bramayugam: బ్లాక్ అండ్ వైట్‌లో మమ్ముట్టి కొత్త ప్రయోగం.. ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోన్న 'భ్రమయుగం' ట్రైలర్..

Mammootty - Bramayugam Trailer Talk: మలయాళ అగ్ర నటుడు మమ్ముట్టి ఎపుడు ఏదో ఒక సినిమాతో బిజీగా ఉంటూ ఉంటారు. తన ఇమేజ్‌కు ఆ కథ సరిపోతుందా లేదా అనే డౌట్స్ పెట్టుకోకుండా.. కాన్సెప్ట్ నచ్చితే వెంటనే చేసేయడం మమ్ముట్టి స్టైల్. ఫ్యాన్స్ ఏమనుకుంటారో అనే డౌట్స్ కూడ పెట్టుకోకుండా తనకు తోచిన కథలను చేసుకుంటూ వెళుతూ ఉంటారు. ఈ కోవలోనే ఈయన మూడు సార్లు జాతీయ ఉత్తమ నటుడు అవార్డును అందుకున్నారు. తాజాగా ఈయన ఈ డిజిటల్ కమ్ కలర్స్ యుగంలో 'భ్రమయుగం' అంటూ బ్లాక్ అండ్ వైట్  సినిమాతో ఆడియన్స్‌ ముందుకు రాబోతున్నాడు.

ఈ సినిమాను రాహుల్ సదాశివన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో మమ్ముట్టితో పాటు అర్జున్ అశోకన్, సిద్ధార్ధ భరతన్, అమల్డా లిజ్ ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ సినిమా మొత్తం ఓ అడవిలో ఉండే కుగ్రామం నేపథ్యంలో డిఫరెంట్ కాన్సెప్టతో  ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా ట్రైలర్, అందులో డైలాగ్స్, సీన్స్ అన్ని డిఫరెంట్‌గా ఉన్నాయి. ఈ సినిమా ఈ నెల 15న ప్యాన్ ఇండియా లెవల్లో విడుదల కానుంది.

మమ్మట్టి విషయానికొస్తే.. ఆ మధ్య తెలుగులో 'యాత్ర' మూవీతో పలకరించారు. ఇందులో దివంగత ఏపీ ముఖ్యమంత్రి వై.యస్.రాజశేఖర్ రెడ్డి పాత్రలో నటించారు. రీసెంట్‌గా 'యాత్ర 2'లో అదే పాత్రను చేసారు. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. కానీ అందుకు తగ్గ వసూళ్లను రాబట్టడంలో విఫలమైంది. మరి ఇపుడు రాబోతున్న 'భ్రమయుగం' మూవీతో మమ్ముట్టి బాక్సాఫీస్‌ను షేక్ చేస్తాడా లేదా అనేది చూడాలి.

Also Read: Bir Billing Dog Loyal: కన్నీటి గాథ.. యజమాని బాడీ వద్ద 48 గంటలు కాపలా కాసిన పెంపుడు కుక్క

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News