Manchu Brothers: మరోసారి బహిరంగంగా బయటపడ్డ మంచు సోదరుల మధ్య విభేదాలు..

Manchu Brothers: మంచు కుటుంబంలో విభేదాలు మరోసారి బహిరంగంగా బయటపడ్డాయి. ఆ మధ్య వీళ్లిద్దరు బహింరంగంగా బాహాబాహీకి దిగిన సంగతి తెలిసిందే కదా. అది సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ తర్వాత మరోసారి మంచు సోదరులు ఇద్దరు సోషల్ మీడియా వేదికగా త మధ్య విభేదాలను బయటపెట్టుకున్నారు.  

Written by - TA Kiran Kumar | Last Updated : Jul 9, 2024, 11:06 AM IST
Manchu Brothers: మరోసారి బహిరంగంగా బయటపడ్డ మంచు సోదరుల మధ్య విభేదాలు..

  

Add Zee News as a Preferred Source

Manchu Brothers: తెలుగు సినీ ఇండస్ట్రీలో మంచు ఫ్యామిలీకి ప్రత్యేక స్థానం ఉంది. మోహన్ బాబు ఇద్దరు కుమారులు మంచు విష్ణు, మనోజ్ ల మధ్య గత కొన్ని రోజులుగా సఖ్యత లేదన్న విషయం తెలిసిందే. అదంత టీ కప్పులో తుఫాను మాదిరి అప్పట్లో మోహన్ బాబు కొట్టి పారేసారు. కానీ మరోసారి ఈ అన్నదమ్ముల మధ్య విభేదాలు సోషల్ మీడియా వేదికగా బహిర్గతం అయ్యాయి. అప్పట్లో వీళ్లిద్దరు బహిరంగంగా ఒకరితో ఒకరు పోట్లాడుకున్న వీడియో ఒకటి వైరల్ అయింది. ఆ తర్వాత వీళ్లిద్దరు తూచ్ అంటూ మేము ఓ రియాలిటీ షో కోసం ఇలా చేసినట్టు కవరింగ్ ఇచ్చుకున్నారు. తాజాగా మంచు మనోజ్ కు  ఓ పాపకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే కదా. ఆ పాపకు దేవసేన శోభ ఎంఎం అనే పేరు పెట్టి సామాజిక మాధ్యమాల్లో ఆ నోట్ విడుదల చేసాడు. అయితే ఆ పేరు పెట్టడం వెనక ఉన్న కారణాన్ని వెల్లడిస్తూ..  సుదీర్ఘ లేఖ విడుదల చేసాడు మంచు మనోజ్. ఆ నోట్ లో తన తల్లిదండ్రులు మోహన్ బాబు, నిర్మలా దేవి, అక్క మంచు లక్ష్మీ సహా మౌనికా రెడ్డి, అక్క, తమ్ముడు గురించి కూడా ఇందులో ప్రస్తావించారు. కానీ ఈ నోట్ లో ఎక్కడా తన అన్న విష్ణు పేరు ఎక్కడా ప్రస్తావించలేదు.  కావాలనే అన్న మంచు విష్ణును మనోజ్ పక్కన పెట్టినట్టు తెలుస్తుంది.

అలాగే సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ప్రణీత్ వ్యవహారం పై వీళ్లిద్దరి మధ్య విభేదాలను బహిర్గతం చేసారు. తాజాగా సాయి ధరమ్ తేజ్.. ప్రణీత్ వ్యవహారంపై నిప్పులు చెరుగుతూ తన సోషల్ మీడియా అకౌంట్ ఎక్స్ లో ఓ పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఇలాంటి వారిపై కఠిన చర్యలకు ఉపక్రమించాలని కోరుతూ.. రెండు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రులతో పాటు పోలీస్ డిపార్ట్ మెంట్ ను ట్యాగ్ చేసాడు. అటు మంచు మనోజ్ కూడా ఇలాంటి జుగుప్సాకరమైన చర్యలకు పాల్పడిన వారిపై ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని తన సోషల్ మీడియా ఖాతా ఎక్స్ లో పోస్ట్ పెట్టాడు.

అయితే.. సాయి ధరమ్ తేజ్ చేసిన ట్యాగ్ కు మంచు విష్ణు స్పందిస్తూ.. థ్యాంక్యూ బ్రదర్ .. అంటూ  ట్యాగ్ చేసాడు. అంతేకాదు ఈ విషయంపై స్పందించిన కేసు నమోదు చేస్తామని చెప్పిన డీజీపీకి స్పెషల్ థాంక్స్ చెప్పాడు మంచు విష్ణు. కానీ ఇదే విషయమై స్పందించిన తమ్ముడు మంచు మనోజ్ పోస్ట్ పై అసలు రియాక్ట్ కాకపోవడం గమనార్హం. ఏది ఏమైనా వీళ్లిద్దరు ఒకరుకొకరు విభేదించుకుంటున్న సంగతి మరోసారి సోషల్ మీడియా వేదికగా బహిర్గతమైంది. అప్పట్లో వీళ్లిద్దరి మధ్య ఆస్తి పంపకాల విషయమై గొడవులు వచ్చినట్టు  వాళ్ల సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఏది ఏమైనా ఈ వయసులో మోహన్ బాబును వారి కుమారులిద్దరు ఇలా బహిరంగంగా సోషల్ మీడియా వేదికగా బాహాబాహీకి దిగడం నిజంగా దిగ్భ్రాంతి కలిగించే అంశమనే చెప్పాలి.

Read more: Sonu Sood: హీరో సోనూసూద్ కు బంపర్ ఆఫర్ ఇచ్చిన కుమారీ ఆంటీ.. వీడియో వైరల్..

Read more:Snakes dance: పాముల సయ్యాట.. పచ్చని పొలంలో అరుదైన ఘటన.. వైరల్ వీడియో..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

  

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News