Tiger Nageswara Rao: ఏప్రిల్ 2న రవితేజ "టైగర్ నాగేశ్వరరావు" గ్రాండ్ ప్రీ లుక్

మాస్ మహారాజా రవితేజ తన మొట్టమొదటి పాన్ ఇండియా ప్రాజెక్ట్ `టైగర్ నాగేశ్వరరావు` చిత్రాన్ని చేస్తున్నాడు. దీనికి వంశీ దర్శకత్వం వహిస్తుండగా.. ఉగాది నాడు మధ్యాహ్నం 12:06 గంటలకు సినిమా ప్రీ లుక్ విడుదల చేయనున్నారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 31, 2022, 04:26 PM IST
  • రవితేజ మొట్టమొదటి పాన్ ఇండియా ప్రాజెక్ట్ `టైగర్ నాగేశ్వరరావు
  • టైగర్ నాగేశ్వరరావు ఒక పీరియాడిక్ సినిమా.
  • 1970వ దశకంలో పేరుమోసిన సాహసోపేతమైన స్టువర్ట్పురం నాగేశ్వరరావు కథ ఇది
Tiger Nageswara Rao: ఏప్రిల్ 2న రవితేజ "టైగర్ నాగేశ్వరరావు" గ్రాండ్ ప్రీ లుక్

Tiger Nageswara Rao: మాస్ మహారాజా రవితేజ తన మొట్టమొదటి పాన్ ఇండియా ప్రాజెక్ట్ `టైగర్ నాగేశ్వరరావు` చిత్రాన్ని చేస్తున్నాడు. దీనికి వంశీ దర్శకత్వం వహిస్తున్నాడు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా, తేజ్ నారాయణ్ అగర్వాల్ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. రవితేజ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రమిది.

ఉగాది రోజున (ఏప్రిల్ 2న) మాదాపూర్ లోని నోవాటెల్లో (హెచ్ఐసిసిలో) టైగర్ నాగేశ్వరరావు చిత్ర ప్రధాన బృందం సమక్షంలో గ్రాండ్ లాంఛింగ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు. ఉగాది నాడు మధ్యాహ్నం 12:06 గంటలకు సినిమా ప్రీ లుక్ విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ పోస్టర్ ద్వారా గురువారం నాడు తెలియజేసింది. పాన్ ఇండియా చిత్రం 'ది కాశ్మీర్ ఫైల్స్'తో బాలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన నిర్మాత అభిషేక్ అగర్వాల్ కి ఇది డ్రీమ్ ప్రాజెక్ట్.

టైగర్ నాగేశ్వరరావు పీరియాడిక్ సినిమా. 1970వ దశకంలో దక్షిణ భారతదేశంలోనే పేరుమోసిన, సాహసోపేతమైన స్టువర్ట్పురం నాగేశ్వరరావు కథ.  అక్కడ జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందించబడిన చిత్రం. పవర్ ఫుల్ పాత్రలో నటించేందుకు రవితేజ పూర్తిగా తనను తాను మలుచుకోనున్నాడు.  అందుకు తగిన బాడీ లాంగ్వేజ్, డిక్షన్, గెటప్ పూర్తి భిన్నంగా ఉండబోతున్నాయి.. ఇంతకు ముందు ఎప్పుడూ చేయని పాత్రలో రవితేజ కనబడనున్నాడు.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Abhishek Agarwal Arts (@aaartsofficial)

దర్శకుడు వంశీ డ్రీమ్ ప్రాజెక్ట్ గా కథను సిద్ధం చేసుకున్నాడు. ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషలలో రూపొందుతోంది. 'టైగర్ నాగేశ్వరరావు' జీవిత కథ రవితేజకు పర్ఫెక్ట్ సినిమా. మాస్ ఆధారిత పాత్రలు పోషించడంలో ఆయన ప్రత్యేకతను సంతరించుకున్నాడు.

ఈ సినిమా టైటిల్ పోస్టర్ భారీ రెస్పాన్స్ సంపాదించి ఒక్కసారిగా క్యూరియాసిటీని పెంచింది.  హై ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్లతో నిండిన ఈ సినిమాపై ఇప్పటికే క్రేజ్ ఏర్పడింది. 1970 నాటి కథ కావడంతో ఈ ప్రాజెక్ట్ లో భాగంగా ప్రముఖ సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు.

ఇది విజువల్ గా చాలా అద్భుతంగా ఉండేలా ఆర్. మది ISC కెమెరా బాధ్యతలు చేపట్టారు. GV ప్రకాష్ కుమార్ తన సంగీతంతో అలరించనున్నారు.  ప్రొడక్షన్ డిజైనర్ గా అవినాష్ కొల్లా వ్యవహరించనున్నారు. శ్రీకాంత్ విస్సా డైలాగ్ రైటర్, మయాంక్ సింఘానియా సహ నిర్మాత. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన ఇతర వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

Also Read: KGF 2 Dialogues: 'కేజీఎఫ్ 2' సినిమాకు డైలాగ్స్ రాసిన స్టార్ హీరో!

Also Read: Samantha Ruth Prabhu: సిద్ధంగా ఉండండి.. ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చిన సమంత!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News