Meenakshi Chowdhary: శ్రీలీల ప్లేస్ లో మీనాక్షి చౌదరి.. వరస ఆఫర్లు అందుకుంటున్న బ్యూటీ.

Meenakshi Chowdhary Upcoming Movies: మొన్న సంక్రాంతికి వచ్చిన మహేష్ గుంటూరు కారం చిత్రంలో మెయిన్ హీరోయిన్ శ్రీ లీల అయినప్పటికీ.. అందరి అటెన్షన్ తన వైపు తిప్పుకుంది మీనాక్షి చౌదరి. మంచి అమ్మాయిని ఓ సైడ్ క్యారెక్టర్ కి పరిమితం చేశాడు త్రివిక్రమ్ అని ఈ సినిమా చూసి ఎందరో బాధపడ్డారు కూడా. అయితే ప్రస్తుతం ఈ బ్యూటీ లక్ మారుతోంది అని టాక్.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 5, 2024, 07:27 PM IST
Meenakshi Chowdhary: శ్రీలీల ప్లేస్ లో మీనాక్షి చౌదరి.. వరస ఆఫర్లు అందుకుంటున్న బ్యూటీ.

Venkatesh 76: అందం ..అంతకు మించిన అభినయం ఉన్నప్పటికీ సరియైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న నటి హన్సిక మీనాక్షి చౌదరి. ఇటీవల మహేష్ బాబు నటించిన గుంటూరు కారం చిత్రంలో మహేష్ కు మరదలుగా నటించింది. ఈ మూవీలో ఆమె క్యారెక్టర్ చిన్నదైనప్పటికీ ప్రేక్షకులలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే కేవలం హీరోను, డైరెక్టర్ ను చూసి గుడ్డిగా ప్రతి క్యారెక్టర్ కి ఒప్పుకోకూడదు అని ఈ బ్యూటీ ఫిక్స్ అయినట్లు కనిపిస్తోంది. అందుకే ప్రస్తుతం తన కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోందట ఈ హీరోయిన్. మీనాక్షి చేతిలో వరుణ్ తేజ్ మట్కా, దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ తో పాటు విజయ్ గోట్ చిత్రాలు ఉన్నాయి.

ప్రస్తుతం సెట్స్ పైన ఉన్న ఈ మూడు చిత్రాలు కాకుండా అనిల్ రావిపూడి, వెంకటేష్ కాంబోలో ..’సంక్రాంతికి వస్తున్నాం’ అనే ప్రచార టైటిల్ కలిగిన మూవీలో హీరోయిన్ గా మీనాక్షిని తీసుకునే అవకాశం ఉందని టాక్ గట్టిగా నడుస్తోంది. మరోపక్క చిరంజీవి మోస్ట్ ప్రెస్టీజియస్ విశ్వంభరా మూవీ ఆఫర్ కు కూడా ఈ బ్యూటీ ఓకే చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. క్రేజీ చిత్రాలతో వరుసగా అన్ని సినిమా పోస్టర్లపై కనిపించిన శ్రీలీల ఖాతాలో భగవంత్ కేసరి మినహాయించి యావరేజ్ సినిమాలు.. డిజాస్టర్లు తప్ప ఏమీ లేవు. ఈ నేపథ్యంలో డైరెక్టర్లు కొత్త ఆప్షన్ల కోసం చూడడం మొదలుపెట్టారు.

ఈ నేపథ్యంలో మీనాక్షి చౌదరి లాంటి కొత్త హీరోయిన్లు ఈ స్పేస్ ను తమకు అనుకూలంగా మలుచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న కుర్ర హీరోయిన్స్ లో చేతిలో నాలుగైదు సినిమాలు ఉన్న హీరోయిన్ మీనాక్షి అనే చెప్పొచ్చు. విశ్వక్ తో గత ఎడాది ఒక సినిమా మొదలైంది .కానీ ఇంకా ఆ మూవీ కి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాలేదు. ప్రస్తుతం ఉన్న చిత్రాలలో ఒక రెండు మూడు హిట్లు మీనాక్షి ఖాతాలో పడితే ఇక ఆమె మార్కెట్ కు డోకా ఉండదు. పొలిటికల్ ఎంట్రీ కి ముందు విజయ్ నటిస్తున్న గోట్..ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం మూవీలో ఛాన్స్ దక్కడం మీనాక్షికి మంచి పాపులారిటీ తెచ్చిందనే చెప్పాలి. ఈ చిత్రం వర్క్ అవుట్ అయితే మాత్రం ఇటు తెలుగుతో పాటు అటు తమిళ్ ఇండస్ట్రీలో కూడా ఆమె పేరు మారుమోగడం కన్ఫామ్.

Read More: Insulin: ఇన్సులిన్ ఉత్పత్తి తక్కువగా ఉందా? ఈ 3 ఆకులను నమిలండి చాలు.. షుగర్ కంట్రోల్ అవుతుంది..!

Read More: Pooja Hegde: పొట్లంకట్టిన బిర్యానికి బొట్టు బిళ్ళ పెట్టినట్టు.. ఆకట్టుకుంటున్న పూజా హెగ్డే ఫోటోలు

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News