Mega Vs Manchu fans : ఆచార్యపై ట్రోల్స్.. మంచు ఫ్యాన్స్‌పై మెగా అభిమానుల ఫైర్

Mega Vs Manchu fans : మెగాస్టార్, మెగా పవర్ స్టార్‌ల మల్టీస్టారర్ చిత్రం ఆచార్యకు మిక్స్‌డ్‌ టాక్ వస్తోంది. సోషల్ మీడియాలో ఆచార్యపై ట్రోల్స్ కూడా ఎక్కువయ్యాయి. అయితే ఈ ట్రోల్స్ మోహన్ బాబు అభిమానుల నుంచే వస్తున్నాయని మెగా అభిమానులు అభిప్రాయ పడుతున్నారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 29, 2022, 07:07 PM IST
  • ఆచార్యకు మిక్స్‌డ్‌ టాక్
  • సోషల్ మీడియాలో ఆచార్యపై ట్రోల్స్
  • మోహన‌్‌ బాబు అభిమానులపై మెగా అభిమానుల ఫైర్
Mega Vs Manchu fans : ఆచార్యపై ట్రోల్స్.. మంచు ఫ్యాన్స్‌పై మెగా అభిమానుల ఫైర్

Mega Vs Manchu fans : మెగాస్టార్, మెగా పవర్ స్టార్‌ల మల్టీస్టారర్ చిత్రం ఆచార్యకు మిక్స్‌డ్‌ టాక్ వస్తోంది. సోషల్ మీడియాలో ఆచార్యపై ట్రోల్స్ కూడా ఎక్కువయ్యాయి. అయితే ఈ ట్రోల్స్ మోహన్ బాబు అభిమానుల నుంచే వస్తున్నాయని మెగా అభిమానులు అభిప్రాయ పడుతున్నారు. మెగా అభిమానులకు, మంచు అభిమానులకు వైరం ఈ నాటిది కాదు. తెలుగు సినీ పరిశ్రమ వజ్రోత్సవాలు జరిగినప్పటి నుంచి ఈ ఇద్దరు హీరోల బేధాభిప్రాయాలు బహిర్గతమయ్యాయి. మెగా వర్సెస్ మంచు ఫ్యామిలీ అలా మొదలై ఇప్పటికీ పలు సందర్భాల్లో విబేధాలు బహిర్గతం అవుతూనే ఉన్నాయి. ఈ వైరానికి అభిమానుల సోషల్ మీడియా వార్ మరింత ఆజ్యం పోస్తోంది.

సోషల్ మీడియాలో మన సినీ అభిమానుల వర్డ్స్ వార్ చూస్తే నిజంగా పైట్ కూడా అంత భీకరంగా జరగదనిపిస్తూ ఉంటుంది. గతంలో అనేక సందర్భాల్లో మెగా అభిమానులు మంచు కుటుంబీకులపై ట్రోల్స్ చేశారు. అటు మంచు అభిమానులు మెగా హీరోలపై విమర్శలు చేశారు. 

ఇటీవల మోహన్ బాబు నటించిన సన్నాఫ్ ఇండియా సినిమాకు ఆన్‌లైన్‌లో కేవలం ఒకే ఒక్క టికెట్ బుక్ కావటాన్ని హైలైట్ చేస్తూ నెట్టింట తెగ ట్రోల్స్ వైరల్ అయ్యాయి. ఇలాంటి పనుల వెనుక మెగా హీరోల హస్తం ఉందంటూ మోహన్‌బాబు ఫ్యామిలీ బహిరంగంగానే విమర్శించారు.

తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య మూవీ రిలీజ్ అయింది. ఇందులో రామ్ చరణ్‌ కూడా కీలక పాత్రలో నటించారు. ఈ మూవీ మిక్స్‌డ్‌ టాక్‌ దక్కించుకుంది. రిచ్ వేల్యూస్‌తో ఆచార్య మూవీని తెరకెక్కించినా.. కథ రొటీన్‌గా అనిపించడం, కథలో పస లేకపోవడంతో మూవీ అనుకున్నంతగా లేదనే టాక్ వినిపిస్తోంది. కొన్ని సీన్స్‌ అత్యంత దారుణంగా ఉన్నాయంటూ ట్రోల్స్ కూడా విపరీతంగా వస్తున్నాయి. టార్గెట్ ఆడియెన్స్ ఎవరు అనేది తేల్చుకోలేకపోయారంటూ సోషల్ మీడియాలో తెగ ట్రోల్స్ వస్తున్నాయి. ఈ ట్రోల్స్ మంచు ఫ్యామిలీ చేయిస్తున్నవేనని, చిరంజీవి సినిమాకు ఇలాంటి పబ్లిసిటీ చేయటం హాస్యాస్పదమని మెగా అభిమానులు విమర్శిస్తున్నారు.

Also Read: Tax On Petrol Diesel : ధరల పాపం మీదంటే మీదంటున్న నేతలు..కేంద్రం - రాష్ట్రాల మధ్య పెట్రోల్‌ మంట..!

Also Read:Acharya Movie : ఆచార్య కొరటాలకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వలేదా..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News