Megastar Chiranjeevi Rare Photo: ప్రతి ఒక్కరికి తమ జీవితంలో ఒకరోజు కచ్చితంగా స్పెషల్ డే గా మారుతుంది. అయితే ఈరోజు చిరంజీవి జీవితంలో మరిచిపోలేని రోజట . మరి చిరంజీవి జీవితంలో ఈరోజు ఎందుకు అంత స్పెషల్ అని తెలుసుకోవడానికి అభిమానుల సైతం తెగ ఆసక్తి చూపిస్తున్నారు.అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం.
మెగాస్టార్ చిరంజీవి.. ఈ పేరుకు సినీ రంగుల ప్రపంచంలో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాలలో స్థానం సంపాదించుకున్న ఈయన ప్రస్తుతం వశిష్ట మల్లిడి దర్శకత్వంలో విశ్వంభర అనే సినిమాలో నటిస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఈరోజు ఒక పోస్ట్ పెట్టారు మెగాస్టార్ చిరంజీవి.
ఈ మేరకు తాజాగా ఈయన చేసిన పోస్టు 50 సంవత్సరాల క్రితం జరిగినది. చిరంజీవి హీరోగా తొలిసారి పునాదిరాళ్లు అనే సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు. అయితే డిగ్రీ రెండవ సంవత్సరం చదువుకునే సమయంలోనే 'రాజీనామా 'అనే నాటకాన్ని వేశారు. ఈ నాటకానికి గానూ చిరంజీవికి బెస్ట్ యాక్టర్ ఆఫ్ కాలేజ్ గా అవార్డు కూడా లభించింది.
ఈ విషయాన్ని ఇప్పుడు గుర్తు చేసుకుంటూ ఆ ఫోటోని షేర్ చేశారు చిరంజీవి. 1974 - 75 సంవత్సర సమయంలో..YNM కాలేజీ నర్సాపూర్ లో రంగస్థలం మీద తొలి నాటకం రాజీనామా. కోన గోవిందరావు గారి రచన నాకు తొలి నటుడిగా గుర్తింపును అందించింది. అది కూడా నాకు బెస్ట్ యాక్టర్ అవార్డు రావడంతో ఆయన లేని ప్రోత్సాహాన్ని నేను మర్చిపోలేక పోతున్నాను 50 సంవత్సరాల నట ప్రస్థానం ఎనలేని ఆనందం అంటూ చిరంజీవి రాసుకొచ్చారు.
ఇక ప్రస్తుతం చిరంజీవి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు..ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ సెలవులు సందర్భంగా విడుదల కాబోతున్నట్లు సమాచారం. ఏదిఏమైనా నటన రంగంలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకుని..నేపథ్యంలో చిరంజీవికి పలువురు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
Also read: Diwali Rangoli Designs: దీపావళికి మీ ఇంటిని అందంగా అలంకరించుకునే రంగోళి డిజైన్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.