God Father Teaser Review: అంచనాలు పెంచేస్తున్న గాడ్ ఫాదర్ టీజర్

Megastar Chiranjeevi's God Father Teaser Review: మెగాస్టార్ పుట్టినరోజు సంధర్భంగా గాడ్ ఫాదర్ మూవీ నుంచి టీజర్ రిలీజ్ చేశారు. ఆ వివరాలు

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 22, 2022, 09:02 AM IST
 God Father Teaser Review: అంచనాలు పెంచేస్తున్న గాడ్ ఫాదర్ టీజర్

Megastar Chiranjeevi's God Father Teaser Review: మరికొద్ది గంటల్లో మెగాస్టార్ పుట్టినరోజు సంబరాలు ఘనంగా ప్రారంభం కాబోతున్నాయి. అయితే మెగాస్టార్ పుట్టినరోజు వేడుకలను ఒక రోజు ముందుగానే తీసుకువచ్చేందుకు ఆయన నటిస్తున్న గాడ్ ఫాదర్ మూవీ టీమ్ సిద్ధమైంది. మలయాళం లో సూపర్ హిట్ గా నిలిచిన లూసిఫర్ అనే సినిమాని తెలుగులో గాడ్ ఫాదర్ పేరుతో రీమేక్ చేస్తున్నారు. తెలుగులో హనుమాన్ జంక్షన్ లాంటి సినిమాలు చేసి తర్వాత తమిళంలో డైరెక్టర్ గా సెటిలైన మోహన్ రాజా డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది.  

ఈ సినిమాను ఆర్బి చౌదరి, రామ్ చరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మలయాళంలో మోహన్ లాల్ నటించిన పాత్రలో మెగాస్టార్ చిరంజీవి, మంజు వారియర్ నటించిన పాత్రలో నయనతార, వివేక్ ఒబెరాయ్ నటించిన పాత్రలో సత్యదేవ్, పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన పాత్రలో సల్మాన్ ఖాన్ నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో సునీల్ మెగాస్టార్ చిరంజీవి అనుచరుడి పాత్రలో నటిస్తుండగా ఒక కీలకమైన జర్నలిస్ట్ పాత్రలో డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కనిపించబోతున్నారు.

ఇక ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవికి హీరోయిన్ ట్రాక్ అనేది ఉండదు. ఒక మాఫియా డాన్ పాత్రలో మెగాస్టార్ చిరంజీవి కనిపించబోతున్నారు ఇక పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంది. నిమిషం 33 సెకండ్ల నిడివిగల ఈ టీజర్ జాతీయ జెండా చుట్టూ జనం మోగిన షార్ట్ తో ప్రారంభమవుతుంది. 20 ఏళ్లు ఎక్కడికి వెళ్లాడో ఎవరికీ తెలియదు, కానీ సడన్గా తిరిగి వచ్చిన ఆరేడేళ్లలోనే జనాల్లో మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు అంటూ మురళి శర్మ వాయిస్ ఓవర్ తో ప్రారంభమైన టీజర్ సినిమాపై అంచనాలు పెంచే విధంగా ఉంది.

ఇక్కడికి ఎవరు వచ్చినా పట్టించుకోను కానీ అతను మాత్రం రాకూడదు అంటూ నయనతార చెబుతున్న డైలాగ్, సత్యదేవ్, సముద్రఖని ఎంట్రీ సినిమాపై మరింత అంచనాల పెంచే విధంగా మారింది. తరువాత ఆయన గాడ్ ఆఫ్ ది మాస్ గాడ్ ఫాదర్ అంటూ మెగాస్టార్ చిరంజీవి పాత్రకు ఎలివేషన్ ఇచ్చిన తీరు ఆయన ఎంట్రీ కూడా ఆకట్టుకుంది.

తర్వాత మెగాస్టార్ చిరంజీవి సల్మాన్ ఖాన్ కలిసి ఒక జీప్ లో ఎంట్రీ ఇచ్చిన షాట్ కూడా ఆకట్టుకుంది. కానీ అది విఎఫ్ఎక్స్ షాట్ అనేది ఈజీగా అర్థమయిపోయే విధంగా ఉంది. టీజర్ తో సినిమాపై అంచనాలు పెంచేసిన ఈ సినిమా యూనిట్, సినిమాను దసరా సందర్భంగా అక్టోబర్ 10వ తేదీన విడుదల చేయబోతున్నట్లుగా  ప్రకటించింది. సినిమా టీజర్ మొత్తానికి తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ మరింత ప్రాణం పోసిందని చెప్పాలి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News