Megha Akash Marriage: పెళ్లి చేసుకున్న మేఘా ఆకాశ్.. వరుడు ఎవరంటే..!

Megha Akash Marriage: టాలీవుడ్ హీరోయిన్లు ఒక్కొక్కరుగా వివాహా బంధంలో ఒక్కటవుతున్నారు. ఈ కోవలో ప్రముఖ కథానాయిక మేఘా ఆకాశ్ తన ప్రియుడిని పెళ్లాడింది. దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

Written by - TA Kiran Kumar | Last Updated : Sep 15, 2024, 03:38 PM IST
Megha Akash Marriage: పెళ్లి చేసుకున్న మేఘా ఆకాశ్.. వరుడు ఎవరంటే..!

Megha Akash Marriage: మేఘా ఆకాశ్ ఒకింటి ఆవిడ అయింది. తాజాగా ఈమె తన ప్రియుడు సాయి విష్ణును పెళ్లాడింది. శనివారం చైన్నెలో కొంత మంది బంధు మిత్రుల సమక్షంలో వీరి వివాహాం జరిగింది. ఈ సందర్భంగా మేఘా ఆకాశ్, సాయి విష్ణు మూడు ముళ్ల బంధంతో ఏడడుగులు వేశారు.
ఈ పెళ్లి ఇరు ఫ్యామిలీలకు సంబంధించిన పెద్దలతో పాటు.. సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. అంతేకాదు నూతన వధూవరులను ఆశీర్వదించారు.

మేఘా ఆకాశ్, సాయి విష్ణు పెళ్లికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. శనివారం సాయంత్రం వెడ్డింగ్‌ రిసెప్షన్ జరిగింది. ఈ వేడుకకు తమిళనాడు ముఖ్యమంత్రి  స్టాలిన్‌ హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు. తన జీవితంలో జరిగిన మధుర ఘట్టమైన ఈ వేడుకను అభిమానులతో పంచుకోవడం ఆనందంగా ఉందన్నారు.

మేఘా ఆకాశ్ తెలుగులో ‘లై’ మూవీతో పరిచయమైంది. ఆ తర్వాత ‘చల్ మోహన్ రంగా’, పేట, కుట్టీ స్టోరీ, రాజ రాజ చోర, డియర్ మేఘా  వంటి చిత్రాలతో తెలుగు, తమిళ, మలయాళ ప్రేక్షకులను అలరించింది. మేఘా ఆకాశ్ పెళ్లి చేసుకున్న సాయి విష్ణు ఫ్యామిలీకి రాజకీయాలతో మంచి అనుబంధమే ఉంది. గత కొంత కాలంగా ప్రేమించుకున్న వీళ్లిద్దరు ఇరు కుటుంబాల అంగీకారంతో ఆగష్టులో వీరి ఉంగరాలు మార్చుకున్నారు. ఇపుడు మంచి ముహూర్తాలు లేకున్నా.. తమిళనాట ఉన్న సాంప్రదాయల అనుగుణంగా వీరి వివాహాం జరిగింది.

ఇదీ చదవండి:  పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా లెజ్నెవా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తెలుసా..!

ఇదీ చదవండి: ‘భోళా శంకర్’సహా చిరు కెరీర్ లో రాడ్ రంబోలా మూవీస్ ఇవే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News