Mem Famous: నిర్మాతలకి కాసుల వర్షం కురిపిస్తున్న మేం ఫేమస్

Mem Famous high returns: బలగం సినిమా చిన్న బడ్జెట్ తో తెరకెక్కి రిలీజ్ అయి భారీ లాభాలు తెచ్చి పెడితే ఇప్పుడు మేము ఫేమస్ సినిమా కూడా అదే బాటలో పయనిస్తూ భారీ లాభాలు తెచ్చిపెట్టింది.   

Written by - Chaganti Bhargav | Last Updated : Jun 4, 2023, 06:41 PM IST
Mem Famous: నిర్మాతలకి కాసుల వర్షం కురిపిస్తున్న మేం ఫేమస్

Mem Famous high returns for producers: ఈ మధ్యకాలంలో టాలీవుడ్ లో చిన్న బడ్జెట్ సినిమాలే భారీ లాభాలు అందుకుంటున్న పరిస్థితి ఆసక్తికరంగా మారుతుంది. ఇప్పటికే బలగం సినిమా చిన్న బడ్జెట్ తో తెరకెక్కి రిలీజ్ అయి భారీ లాభాలు తెచ్చి పెడితే ఇప్పుడు మేము ఫేమస్ సినిమా కూడా అదే బాటలో పయనిస్తోందని తెలుస్తోంది.

ఈ సినిమాని చాయ్ బిస్కెట్ ఫిలిం సంస్థ లహరి ఫిలిమ్స్ సంస్థలతో కలిసి నిర్మించింది, సుమంత్ ప్రభాస్ హీరోగా నటిస్తూనే ఈ సినిమాని డైరెక్ట్ చేయగా మణి, మౌర్య చౌదరి, సిరి రాశి, సార్యా వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటించారు. తెలంగాణ నేపథ్యంలోనే ఒక పల్లె ప్రాంతంలో జరిగిన చిన్న సంఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించారు.

Also Read: Sharwanand Reception: పెళ్లైంది..ఇక టాలీవుడ్ జనానికి భారీ రిసెప్షన్ ప్లాన్ చేసిన శర్వా!

సినిమా కథ,కథనాలు అంత అద్భుతంగా లేకపోయినా యూత్ కి కనెక్ట్ అవ్వడంతో సినిమాకి వసూళ్ల వర్షం కురుస్తోంది. ఇక ఈ సినిమా మొదటి వీకెండ్లో 3 కోట్ల 10 లక్షల గ్రాస్ రాబట్టడమే కాదు వీక్ డేస్ లో కూడా మంచి వసూళ్లను రాబడుతోంది. మొత్తం ఆరు రోజుల్లో సినిమా ఏకంగా ఐదు కోట్ల గ్రాస్ ప్రపంచవ్యాప్తంగా రాబట్టిందంటే మామూలు విషయం కాదు. ఇక చాలా ప్రాంతాలలో ఈ సినిమా ప్రాఫిట్ జోన్ లోకి ఎంటర్ అయిందని తెలుస్తోంది. ఈ సినిమాకి సినిమా నిర్మాణ సంస్థ ప్రింట్ పబ్లిసిటీతో కలిపి నాలుగు కోట్ల బడ్జెట్ అయిందని చెబుతోంది.

కానీ అంత కూడా అయి ఉండదని విశ్లేషకులు వాదన. ఇక ఈ సినిమా నాన్ థియేట్రికల్ బిజినెస్ ఒక్కటే దాదాపుగా 5 కోట్ల రూపాయలు తెచ్చి పెట్టింది ఇక ఇప్పుడు జరుగుతున్న థియేట్రికల్ వసూళ్లన్నీ సినిమాకి బోనస్ గానే చెబుతున్నారు. ఈరోజుల్లో సినిమాలో కంటెంట్ ఎంత బాగుందనే దానికంటే సినిమాను ఎంతలా ప్రమోట్ చేస్తున్నామనేది ఎక్కువగా వర్కౌట్ అవుతుంది. ఈ సినిమా విషయంలో కూడా ప్రమోషన్స్ బాగా వర్క్ అవుట్ అయ్యాయి అని ట్రేడ్ వర్గాల వారు చెబుతున్నారు.

Also Read: Bandla Ganesh: ఇంతకంటే ఏం కావాలి దరిద్రం..చంద్రబాబుపై బండ్ల సంచలనం

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK

 

Trending News