My Dear Donga Premiers: ఏప్రిల్ 19 నుంచి ఆహాలో 'మై డియర్ దొంగ' ప్రీమియర్స్..

My Dear Donga Premiers:భారత దేవపు ప్రీమియర్ లోకల్ ఓటీటీ ఫ్లాట్‌ఫార్మ్ ఆహా ఎప్పటికపుడు కొత్త కంటెంట్‌తో ప్రేక్షకులను అలరిస్తోంది. తాజాగా ఈ ఓటీటీలో అభివన్ గోమఠం ముఖ్యపాత్రలో 'మై డియర్ దొంగ' ప్రీమియర్స్‌కు రెడీ అవుతోంది.

Last Updated : Apr 5, 2024, 09:58 PM IST
My Dear Donga Premiers: ఏప్రిల్ 19 నుంచి ఆహాలో 'మై డియర్ దొంగ' ప్రీమియర్స్..

My Dear Donga Premiers: అభిన‌వ్ గోమ‌టం, షాలిని కొండేపూడి, దివ్య శ్రీపాద లీడ్ రోల్లో యాక్ట్ చేసిన రొమాంటిక్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్ 'మై డియర్ దొంగ'. ఈ చిత్రాన్ని ఆహా, కేమ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ కలిసి సంయుక్తంగా నిర్మించాయి. షాలిని కొండేపూడి ర‌చనలో  బి.ఎస్‌.స‌ర్వ‌జ్ఞ‌కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. సెల్ప్ డిస్క‌వ‌రీ, ఎంప‌వ‌ర్‌మెంట్ ప్ర‌ధానంగా సాగే సినిమా ఇది సాగుతోంది. ఆహా విషయానికొస్తే..భార‌త‌దేశ‌పు ప్రీమియ‌ర్ లోక‌ల్ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ ఆహా... అల్టిమేట్ రొమాంటిక్ కామెడీ సినిమా 'మై డియ‌ర్ దొంగ' ప్రీమియ‌ర్ డేట్‌ని అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. ఈ ప్ర‌క‌ట‌న‌తో మై డియ‌ర్ దొంగ విడుద‌ల ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినీ అభిమానుల్లో నూత‌న ఉత్తేజాన్ని నింపేసింది. ఈనె  ఏప్రిల్ 19 నుంచి  ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది.

ఒటీవ‌ల విడుద‌లైన 'మై డియర్ దొంగ' టీజ‌ర్‌కి అద్భుత‌మైన స్పందన వ‌చ్చింది. మై డియ‌ర్ దొంగ గురించి కూలంకుషంగా ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం చేసింది టీజ‌ర్‌. అభిన‌వ్ గోమ‌టం పాత్ర‌కు ప్రేక్షకాభిమానుల నుంచి మంచి స్పంద‌న వ‌స్తోంది. షాలిని కొండేపూడి కేర‌క్ట‌ర్ అభిన‌వ్‌ని దొంగ అని ప్రేమ‌గా పిల‌వ‌డం... ప్రేక్ష‌కుల ప్రశంసలు పొందింది. ఇటీవ‌ల ఏర్పాటు చేసిన ప్రైవేట్ స్క్రీనింగ్‌కి అపూర్వ‌మైన స్పంద‌న వ‌చ్చింది. సినిమా విడుద‌ల ఎప్పుడెప్పుడా అని మిగిలిన వారు ఆతృత‌గా ఎదురుచూసేంత‌లా ఉన్నాయి.
అల్టిమేట్ లాఫ‌ర్ థెర‌పీ అందివ్వ‌డానికి తుది మెరుగులు దిద్దుకుంటోంది మై డియ‌ర్ దొంగ‌. అభిన‌వ్‌, షాలిని కొండేపూడి క‌లిసి క‌డుపుబ్బ న‌వ్వించ‌డానికి రెడీ అవుతున్నారు. ఈ న‌వ్వుల వినోదాన్ని ఆడియన్స్ ఏప్రిల్ 19 నుంచి ఆహాలో ఆస్వాదించ‌వ‌చ్చు.

Also Read: Amanchi Krishna Mohan: వైఎస్ జగన్‌కు భారీ షాక్‌.. వైసీపీకి ఆమంచి కృష్ణ మోహన్‌ రాజీనామా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News