Nagababu tweets on jani master rape case: ప్రస్తుతం రెండు తెలుగు స్టేట్స్ లలో కూడా జానీ మాస్టర్ ఘటన హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే జానీ మాస్టర్ పై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అంతేకాకుండా.. ఆయనపై నాన్ బెయిలెబుల్ కింద కేసులను సైతం నమోదు చేశారు. అయితే.. పోలీసులు జానీమాస్టర్ గోవాలో ఉన్నట్లు తెలిసింది. దీంతో సైబారాబాద్ కు చెంది ఎస్ఓటీ పోలీసులు రంగంలోకి దిగి జానీ మాస్టర్ ను గోవాలో అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా.. ఆయను హైదరబాద్ కు తరలిస్తున్నారు.
No person can be considered guilty of a crime until he or she has been found guilty of that crime by a court of law.
:- Sir William Garrow— Naga Babu Konidela (@NagaBabuOffl) September 19, 2024
దీంతో తెలుగు స్టేట్స్ లలో రాజకీయంగా, టాలీవుడ్ లో కూడా ఈ ఘటన మాత్రం హాట్ టాపిక్ గా మారింది. జానీ మాస్టర్ పై కఠిన చర్యలు తీసుకొవాలని రాజీకీయ పార్టీలు, మహిళ సంఘాల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ లు వెల్లువెత్తుతున్నాయి. ఏకంగా తెలంగాణ మహిళ కమిషన్ రంగంలోకి దిగి.. బాధితు యువతికి సెక్యురిటీ ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది. ఈ నేపథ్యంలో తాజాగా, నాగ బాబు చేసిన ట్విట్ మాత్రం ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది.
నాగ బాబు తన ట్విట్ లో.. నేరం రుజువయ్యే వరకు కూడా ఎవరు నేరస్థుడు కాదని కూడా ఇన్ డైరెక్ట్ గా ట్విట్ చేశారు. దీనికి ఒక ఫెమస్ కొటేషన్ ను క్యాప్షన్ గా పెట్టాడు. సర్ విలియం గ్యారోవ్.. కొటెషన్ ను జతపర్చారు. న్యాయస్థానం ద్వారా నేరం రుజువయ్యే వరకు ఏ వ్యక్తిని నేరానికి పాల్పడినట్లుగా పరిగణించకూడదని ఇన్ డైరెక్ట్ గా అన్నారు. అదే విధంగా.. ప్రతి స్టోరీలోను మూడు వెర్షన్ లు ఉంటాయని, ఏదైన విన్నంతనే నమ్మోద్దని అన్నారు.
Read more: Romance Video: బస్సులో రెచ్చిపోయిన లవర్స్.. సీక్రెట్ గా రొమాన్స్ చేసుకుంటూ హల్ చల్.. వీడియో వైరల్..
ప్రస్తుతం తెలుగు స్టేట్స్ లలో జానీ మాస్టర్ ఘటన హాట్ టాపిక్ గా మారింది.ఈ క్రమలో నాగబాబు చేసిన ట్విట్ జానీ మాస్టర్ కోసమే నంటూ కూడా ప్రచారం నడుస్తోంది. మరోవైపు జానీ మాస్టర్ ను ఇటీవల జనసేన పార్టీ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో నాగబాబు.. ఇన్ డైరెక్ట్ గా.. జానీ మాస్టర్ ను సపోర్ట్ చేస్తున్నట్లు చేసిన ట్విట్ మాత్రం వివాదాస్పదంగా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.