Nani: ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండ- రష్మిక ఫోటో.. నాని రియాక్షన్ ఇదే..

Hi Nanna promotions: ఎప్పుడూ చేయనంత విభిన్నంగా తన తదుపరి సినిమా హాయ్ నాన్న ప్రమోషన్స్ ని ప్లాన్ చేస్తున్నారు నాని. కాగా ఈ నేపథ్యంలో ఈ చిత్రమే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరపగా.. ఆ ఈవెంట్ లో జరిగిన ఒక అపశృతి నాని పై తీవ్ర ప్రభావం చూపింది..  

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 3, 2023, 03:41 PM IST
Nani: ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండ- రష్మిక ఫోటో..  నాని రియాక్షన్ ఇదే..

Vijay-Rashmika: నాని హీరోగా మృనాల్ ఠాకూర్ హీరోయిన్ గా రాబోతున్న సినిమా హాయ్ నాన్న. డిసెంబర్ 7న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది.  కాగా ఈ సినిమాపై ఎన్నో అంచనాలను పెట్టుకోవున్న నాని ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుంది అనే దృఢ నమ్మకంతో ఉన్నాడు. అంతేకాదు ఇప్పటివరకు ఏ సినిమాకి చెయ్యనంత విభిన్నంగా ఈ సినిమా ప్రమోషన్స్ని ప్లాన్ చేశారు నాని. ఇందులో భాగంగా ఎన్నో ఇంటర్వ్యూలకు అటెండ్ అయ్యారు. తానే స్వయంగా మరో సినిమాల సెలబ్రిటీలను కూడా ఇంటర్వ్యూ చేశారు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ కోసం పొలిటికల్ వేషం కూడా వేసి ఒక ఫన్నీ వీడియో కూడా వదిలారు.

కాగా ఇక ఈ సినిమా మేకర్స్ ఈ మధ్యనే ఈ చిత్ర ప్రియ రిలీజ్ ఈవెంట్ ని ప్రమోషన్స్ లో భాగంగా ఘనంగా నిర్వహించారు. అయితే ఈ ఈవెంట్ లో జరిగిన ఒక చిన్న పని నానిపై తీవ్ర నెగిటివ్ ప్రభావం తీసుకొచ్చింది. అదేమిటి అంటే ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఫోటోలు చూపించి సుమా హీరోయిన్ ని ఆ ఫోటోలపై అభిప్రాయాలని చెప్పండి అని అడుగుతూ ఉండగా సడన్ గా స్క్రీన్ పైన విజయ్ దేవరకొండ ..రష్మిక మందాన ఫోటోలు ప్రత్యక్షమయ్యాయి. వీరిద్దరూ మాల్దీవ్స్ కి వెళ్ళినప్పుడు వేరువేరుగా తీసుకున్న ఫోటోలను అప్పట్లో కొంతమంది సోషల్ మీడియా యూజర్స్ కలిపి ఒక ఫోటోగా చేశారు. కాగా అలా కలిపిన ఫోటోనే ఈ స్క్రీన్ పై డిస్ప్లే అయింది. దీంతో నాని తన సినిమా ప్రమోషన్స్ కోసమే ఇది కూడా ప్లాన్ చేశారు అని విజయ్ ఇక రష్మిక అభిమానులు సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా చెయ్యడం చాలా చీప్ పబ్లిసిటీ ట్రిక్ అని ఏవేవో రాసేశారు.  కాగా ఈ విషయంపై ఫైనల్ గా నాని స్పందించారు.

ఈవెంట్ లో జరిగిన ఈ విషయం గురించి నాని మాట్లాడుతూ..’ ఒక సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ అంటే ఆ ఈవెంట్లో చాలామంది పనిచేస్తూ ఉంటాడు.. అందులో ఆ విజయ్ ..రష్మిక ఫోటో ని ఎవరు ప్లాన్ చేశారు.. అసలు ఎందుకు వేశారు.. ఏ ఎగ్జైట్మెంట్‌లో వేశారు? అన్నది నాకు తెలియలేదు.. అలా సడెన్‌గా చూసి ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా నాకు అర్థం కాలేదు.. విజయ్, రష్మిక నా ఫ్రెండ్స్.. వాళ్ల గురించి అలా పబ్లిక్‌గా ఎందుకు వేస్తాం.. ఒక వేళ ఎవరైనా బాధపడి ఉంటే.. వారికి నేను సారీ చెబుతున్నాను.. అది అసలు అలా జరిగి ఉండకూడదు.. ఈవెంట్లో ఎవరు చేశారో తెలియదు.. ఆ చేసిన వ్యక్తిని ఇప్పుడు అని ఏం లాభం లేదు.. జరగాల్సింది జరిగింది.. ఆ వ్యక్తి ఉద్యోగం పోతుందని భయపడుతూ ఉండొచ్చు.. అందుకే ఈ విషయం బయటకి చెప్పు ఉండకపోవచ్చు’అంటూ ఆ విషయం పైన క్లారిటీ ఇచ్చారు నాని. ఇక నాని ఈ విషయంపై స్పందించడంతో.. నాని చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Also read: Madhya Pradesh Election Result 2023: మధ్యప్రదేశ్ లో ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం.. ఆధిక్యంలో బీజేపీ..

 

Also Read: Animal Movie: బాక్సాఫీస్ వద్ద 'యానిమల్' ఊచకోత.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

 

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News