Nayanthara Viral post: కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నయనతార లేడీ సూపర్ స్టార్ గా ఎదిగిన తీరును ఉదాహరణగా తీసుకొని ఆమె జీవితంపై ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ ఫిలిం విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోని హీరో ధనుష్ నిర్మించిన నానుమ్ రౌడీధాన్ సినిమా నుంచి కొన్ని క్లిప్పులు తీసుకోవడానికి ధనుష్ ను అడిగింది నయనతార. మూడు సెకండ్ల నిడివి ఉన్న క్లిప్స్ పొందడానికి ధనుష్ రూ.10 కోట్లు అడిగారు. ఈ మేరకు ఆమె మండిపడుతూ ఒక బహిరంగ లేఖ వదిలింది.
నయనతార తన పోస్టులో.. ధనుష్ మీరు మీ తండ్రి, సోదరుడి సహాయంతో ఇండస్ట్రీలో ఎదిగారు. కానీ నేను మాత్రం నా రెక్కల కష్టంతోనే పైకి ఎదిగాను. ఈ నేపథ్యంలోనే నెట్ ఫ్లిక్స్ నా జీవితం పై డాక్యుమెంటరీ చేస్తోంది. ఇక మీరు నిర్మించి నేను నటించిన నానుమ్ రౌడీదాన్ సినిమా నుంచి మూడు సెకండ్ల క్లిప్పు డాక్యుమెంటరీ ట్రైలర్లో తీసుకున్నాను. నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ అడిగితే మీరు అంగీకరించలేదు ఇప్పుడు మీ అనుమతి లేకుండా తీసుకున్నానని, రూ.10 కోట్లు కావాలని డిమాండ్ చేస్తూ లీగల్ నోటీసులు పంపారు.. ఇదెక్కడి న్యాయం అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఒక పోస్ట్ వదిలింది నయనతార. ప్రస్తుతం నయనతార చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు సంచలనంగా మారింది.
ఇక నయనతార విషయానికి వస్తే.. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఎన్నో విమర్శలు ఎదుర్కొని ,ఆ తర్వాత నటిగా సెటిల్ అయ్యింది. ఇక వరుస సినిమాలు చేస్తూ భారీ పాపులారిటీ అందుకున్న ఈ ముద్దుగుమ్మ సౌత్ సినీ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా ఎదిగి సౌత్ సినీ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషకం తీసుకుంటున్న నటిగా కూడా పేరు దక్కించుకుంది.
ఇకపోతే తాజాగా నయనతార డాక్యుమెంటరీ ట్రైలర్ విడుదలైన నేపథ్యంలో ధనుష్ నయనతారకు లీగల్ నోటీసులు పంపారు. తన సినిమాలోని కొన్ని క్లిప్స్ ను అనధికారికంగా ఉపయోగించినందుకు పరిహారంగా రూ .10కోట్లు కోరుతూ నయనతారకు ధనుష్ లీగల్ నోటీసులు పంపారు.
ఆ నయనతార ఈ ఆరోపణలను ఖండిస్తూ సుదీర్ఘమైన ఇంస్టాగ్రామ్ పోస్ట్ వదిలింది. ఇకపోతే 2015లో నానుమ్ రౌడీధాన్ సినిమాలోని పాటల వినియోగానికి సంబంధించి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఆమోదించడానికి నిరాకరించడం పట్ల ఆమె నిరాశ వ్యక్తం చేస్తూ మూడు పేజీలు పొడవైన నోటును బహిరంగంగా పంచుకుంది.
నా నెట్ ఫ్లిక్స్ డాక్యుమెంటరీ విడుదల కోసం నాతోపాటు నా అభిమానులు శ్రేయోభిలాషులు కూడా ఎదురు చూస్తున్నారు. మాకు ఎదురైన అన్ని ఇబ్బందులను అధిగమించడానికి సహకారులు అలాగే సినీ స్నేహితుల బృందం మొత్తం ఈ ప్రాజెక్టును తీయడానికి సహాయం చేస్తుంది. కానీ మీరు మాత్రం నాపై వ్యతిరేకంగా ప్రతీకారం తీర్చుకోవడం ఏమాత్రం సమంజసంగా లేదు అంటూ తెలిపింది.
Read more: Amrapali Kata: ఏపీ సర్కారుకు బిగ్ ట్విస్ట్.. సెలవులపై వెళ్లిపోయిన ఆమ్రపాలీ కాట.. ఎందుకో తెలుసా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.