James bond: బాండ్.. జేమ్స్ బాండ్ అంటూ వెండితెరపై అతను చేసే సాహాసాలకు అందరు ఫిదా అవ్వాల్సిందే. ఏదైనా గుట్టు రట్టు చేయాలంటే అతనికతడే సాటి మేటి. ట్రిగ్గర్ పై వేలు పెట్టాడంటే నరాలు తెగే ఉత్కంఠ. ఇవన్ని జేమ్స్ బాండ్ కు సంబంధించిన కొన్ని మచ్చు తునకలు.. గత 6 దశాబ్దాలకు పైగా జేమ్స్ బాండ్ పాత్రను ప్రేక్షకులు ఆదిరిస్తూనే ఉన్నారు. తెలుగు సహా వివిధ సినిమా ఇండస్ట్రీస్‌లో కూడా జేమ్స్ బాండ్ తరహా చిత్రాలు వచ్చి ప్రేక్షకాదరణ పొందాయి. తాజాగా ఈ సిరీస్‌లో రాబోతున్న 26వ చిత్రంలో కొత్త జేమ్స్ బాండ్ పరిచయం కాబోతున్నాడు. బ్రిటన్‌కు చెందిన ఆరోన్ టేలర్ కొత్త జేమ్స్ బాండ్ పాత్రలో ఇకపై కనిపించబోతున్నాడట. గాడ్జిల్లా, అవెంజర్స్ వంటి సినిమాల్లో ఇతను యాక్ట్ చేసాడు. ఇప్పటి వరకు జేమ్స్ బాండ్‌గా మెప్పించిన డేనియల్ క్రేగ్.. వయసు రీత్యా ఇకపై యాక్షన్ అడ్వెంచరెస్తో కూడిన జేమ్స్ బాండ్ పాత్రలో నటించకూడంటూ నిర్ణయం తీసుకున్నాడు. ఈ నేపథ్యంలో కొత్త బాండ్‌గా ఆరోన్ టేలర్‌ను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. తాజాగా తెరకెక్కబోతున్న జేమ్స్ బాండ్ మూవీని క్రిస్టోఫర్ నోలన్ డైరెక్ట్ చేయనున్నారు.
ఇక జేమ్స్ బాండ్ సినిమాల విషయానికొస్తే.. హాలీవువ్ సినిమాలనేవి అమెరికాకు చెందినవి. కానీ బాండ్ మూవీస్ మాత్రం బ్రిటిష్‌కు చెందినవి. జేమ్స్ బాండ్ అంటే బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్. మొత్తంగా సిల్వర్ స్క్రీన్ పై జేమ్స్ బాండ్ అనేది ఓ బ్రాండ్‌గా మారిందనే చెప్పాలి. మన నాటక రంగంలో ఒకటో కృష్ణుడు.. రెండు కృష్ణుడు అంటూ పలు పాత్రలుంటాయి. అదే తరహాలో సీన్ కానరీ నుంచి మొదలు పెడితే..రోజర్ మూర్ .. తిమోతి డాల్టన్, ప్రియర్స్ బ్రాస్నన్, డేనియల్ క్రేగ్ వరకు అర డజను పైగా హీరోలు ఈ బాండ్ పాత్రల్లో ఇరగదీసారు.
సాధారణంగా ఏదైనా సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ అంటే 5 లేదా 6 మించి తీయడం కష్టం. తెరకెక్కించినా ప్రేక్షకులు చూడడానికి ఇష్టపడరు. కానీ జేమ్స్ బాండ్ సినిమాల్లో ఇప్పటి వరకు 25 చిత్రాలు ప్రేక్షకాదరణ పొందాయి. ఈ సిరీస్‌లో కొత్త నటుడితో 26వ బాండ్ చిత్రం ప్రేక్షకులు ముందు రాబోతుంది. మరి కొత్త బాండ్‌గా ఆరోన్ టేలర్ ఏ మేరకు ప్రేక్షకులను అలరిస్తాడనేది చూడాలి.
ఇదీ చదవండి: పరగడుపున తులసి నీరు తాగితే ఈ సమస్యలు అన్ని పరార్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter