Salaar: సలార్ మూవీకి టికెట్లు ఫ్రీ.. హీరో నిఖిల్ బంపర్ ఆఫర్.. ఏ థియేటర్లో అంటే..!

Nikhil Siddharth: ప్రభాస్ హీరోగా ఎన్నో అంచనాల మధ్య విడుదలవుతున్న సినిమా సలార్. కాగా ఈ సినిమాకి హీరో నిఖిల్ 100 మందికి ఉచితంగా టికెట్లు ఇస్తాను అన్నడంతో ప్రస్తుతం దానికి సంబంధించిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 16, 2023, 11:27 PM IST
Salaar: సలార్ మూవీకి టికెట్లు ఫ్రీ.. హీరో నిఖిల్ బంపర్ ఆఫర్.. ఏ థియేటర్లో అంటే..!

Salaar Free Tickets: ప్రస్తుతం ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నారు. కాగా అన్నిటిలోకి ప్రభాస్ అభిమానుల ఆశలు అన్ని సలార్ సినిమా పైన ఎక్కువగా ఉన్నాయి. అందుకు ముఖ్య కారణం ఈ సినిమాకి కేజిఎఫ్ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించడం.

రెండు భాగాలుగా తెరకెక్కనున్న ఈ చిత్రం మొదటి భాగం సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ డిసెంబర్ 22న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. బాహుబలి తర్వాత ఆ రేంజ్ హిట్ లేకపోవడంతో ప్రభాస్ అభిమానులు.. ప్రభాస్ ఈ  సినిమాతో పెద్ద హిట్ కొడతాడని ఎదురుచూస్తున్నారు. కానీ ఈ సినిమా ప్రమోషన్స్ మాత్రం ఇంకా జోరు అందుకోలేదు. త్వరలోనే రాజమౌళి ప్రభాస్ ఇంటర్వ్యూ ఒకటి విడుదలవుతుంది అని తెలుస్తుంది. అది మినహా అసలు ఈ సినిమాకి ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఉండదని టాక్ నడుస్తోంది.

ఈ నేపథ్యంలో హీరో నిఖిల్ వేసిన ట్వీట్ మాత్రం.. ప్రభాస్ అభిమానులను తెగ ఆకట్టుకుంటూ ఉంది. ముందుగా నిన్న తాను శ్రీరాములు థియేటర్లో సలార్ సినిమా మొదటి షో చూస్తాను అని ట్వీట్ పెట్టగా .. మళ్లీ అదే ట్వీట్ ని షేర్ చేస్తూ అభిమానులకు కూడా ఒక గుడ్ న్యూస్ చెప్పారు నిఖిల్.

 

ప్రభాస్ డై హార్డ్ అభిమానుల కోసం హైదరాబాద్ లోని శ్రీరాములు థియేటర్ లో డిసెంబర్ 21 అర్ధరాత్రి ఒంటి గంటకు సలార్ షో పడుతుందని క్లారిటీ ఇచ్చాడు. అంతేకాకుండా ఈ షోకి 100 మంది డై హార్డ్ ప్రభాస్ ఫ్యాన్స్ కి ఫ్రీగా టికెట్స్ ఇస్తానని, వారితో కలిసి నేను కూడా సినిమా చూస్తానని చెప్పాడు. ‘10 ఏళ్ళ క్రితం అదే థియేటర్లో రాత్రి ఒంటిగంటకు రిలీజ్ రోజు ప్రభాస్ సూపర్ హిట్ సినిమా మిర్చి సినిమా చూశాను, ఇప్పుడు హిస్టరీ మళ్ళీ రిపీట్ అవుతుంది’ అంటూ ట్వీట్ చేశాడు నిఖిల్. 

దీంతో నిఖిల్ చేసిన ట్వీట్ సోషల్ మీడియా మధ్యమాలలో వైరల్ గా మారింది. మరి ఈ వంద మంది అదృష్టవంతులు ఎవరో చూడాలి.

Also Read:  Alla Ramakrishna Reddy: వైసీపీకి బిగ్‌షాక్.. పార్టీకి, ఎమ్మెల్యే పదవికి ఆర్కే రాజీనామా

Also Read:  Allu Arjun: హాయ్ నాన్న రివ్యూ ఇచ్చేసిన అల్లు అర్జున్.. నానిపై ప్రశంసలు

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

FaceTwitterసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News