Nindha Movie: స్నేహితుడికి సపోర్ట్‌గా నిఖిల్ సిద్దార్థ్.. వరుణ్ సందేశ్‌కు 'నింద' మైల్ స్టోన్‌ కావాలి

Nindha Movie Pre Release Event: వరుణ్ సందేశ్ నింద మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. హీరో నిఖిల్ సిద్దార్థ్ స్నేహితుడికి సపోర్ట్‌గా నిలిచారు. ఈ మూవీ వరుణ్ కెరీర్‌లో మైల్ స్టోన్‌లా మారాలని ఆకాంక్షించారు. ఆడియన్స్ పెద్ద హిట్ చేయాలని కోరారు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 17, 2024, 04:47 PM IST
Nindha Movie: స్నేహితుడికి సపోర్ట్‌గా నిఖిల్ సిద్దార్థ్.. వరుణ్ సందేశ్‌కు 'నింద' మైల్ స్టోన్‌ కావాలి

Nindha Movie Pre Release Event: నింద మూవీతో టాలీవుడ్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు హీరో వరుణ్ సందేశ్. ది ఫెర్వెంట్ ఇండీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజేష్ జగన్నాధం స్వయంగా నిర్మిస్తూ.. దర్శకత్వం వహించారు. కాండ్రకోట మిస్టరీ అనే క్యాప్షన్‌తో నిజ జీవితంలో జరిగిన సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. జూన్ 21న ఆడియన్స్‌ ముందుకు రానుండగా.. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. హీరో నిఖిల్ సిద్ధార్థ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నింద సినిమాను ప్రేక్షకులు ముందుకు తీసుకువెళ్లాలని కోరారు. తన కెరీర్‌లో స్వామిరారా, కార్తికేయ సినిమాల మాదిరి.. నింద మూవీ వరుణ్ కెరీర్‌కు ఓ మైల్ స్టోన్‌లా మారాలని అన్నారు. ఈ చిత్రంతో వరుణ్ సందేశ్‌కు హిట్ రాబోతోందని.. రాజేష్ చాలా క్వాలిటీతో తెరకెక్కించారని మెచ్చుకున్నారు. జూన్ 21న నింద మూవీని అందరూ చూసి పెద్ద సక్సెస్ చేయాలని కోరారు. 

Also Read: Lava Yuva 5G Price: అబ్బా ఏమి ఆఫర్‌ గురూ.. రూ.7999కే దిమ్మతిరే ఫీచర్స్‌ 5G ఫోన్‌.. 

హీరో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ.. నిఖిల్ ఎదుగుదలను చూస్తే తనకు ఎంతో గర్వంగా ఉంటుందన్నారు. నిఖిల్, తాను కలిసి 2007లో హ్యాపీడేస్ మూవీ చేశామని.. అప్పుడు తన వయసు 17 ఏళ్లు అని గుర్తు చేసుకున్నారు. మళ్లీ ఇన్నేళ్ల తరువాత ఇలా ఒకే స్టేజ్ మీదకు వచ్చామన్నారు. గత ఏడేళ్లుగా తన భార్య వితిక అండగా ఉంటూ వచ్చిందని.. ఆమెకు నేను ఎంత చేసినా.. ఏం చేసినా తక్కువే అవుతుందని చెప్పుకొచ్చారు. ఈ సినిమా తన మనసుకు ఎంతో దగ్గరైందని.. ఇప్పటివరకు ఎన్నో సినిమాలు చేసినా ఎప్పుడూ ఇలా అనిపించలేదన్నారు. రాజేష్ తన ఫ్యాషన్‌తో ఈ సినిమాను నిర్మించి, దర్శకత్వం వహించారని.. ఎంతో గట్స్, కాన్ఫిడెన్స్‌తో తీశారని చెప్పారు. మైత్రీ వారు తమ మూవీని విడుదల చేస్తుండడం సంతోషంగా ఉందన్నారు. హ్యాపీ డేస్, కొత్త బంగారు లోకం, ఏమైంది ఈవేళ.. నెక్స్ట్ నింద సినిమా అని గర్వంగా చెప్పుకోగలనని చెప్పుకొచ్చారు. అందరూ చూసి ఆదరించాలన్నారు.

వితిక షెరు మాట్లాడుతూ.. తన భర్త వరుణ్ ఫెయిల్యూర్ యాక్టర్ కాదని.. ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి గత 17 ఏళ్లుగా సినిమాలు చేస్తూనే ఉన్నారని అన్నారు. ఆయన ఏ సినిమా చేసినా వంద శాతం కష్టపడతారని.. ఏదొక రోజు గట్టిగా కొడతారని చెప్పారు. నింద సినిమా పెద్ద హిట్ అవ్వాలని.. నిఖిల్ ఈ ఈవెంట్‌కు రావడం ఆనందంగా ఉందన్నారు. 

డైరెక్టర్, ప్రొడ్యూసర్ రాజేష్ జగన్నాథం మాట్లాడుతూ.. తన తల్లిదండ్రులు, భార్య వల్లే ఈ రోజు ఇక్కడి వరకు వచ్చానని.. ఈ సినిమా అవుట్ పుట్ చూశాక చాలా సంతృప్తి కలిగిందని చెప్పారు. ఈ చిత్రంతో తనకు వరుణ్ లాంటి మంచి బ్రదర్ దొరికాడని అన్నారు. హిట్లు లేనప్పుడే మనిషి వ్యాల్యూ తెలుస్తుందని.. వరుణ్‌ ఈ మూవీతో కమ్ బ్యాక్ ఇస్తాడని అన్నారు. నింద మూవీతోనే దానికి నాంది పడుతుందన్నారు.

Also Read: Nayanthara: ఆటో డ్రైవర్, డెలివరీ అబ్బాయితో గొడవపడి.. ఇల్లు ఖాళీ చేసిన నయనతార..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News